టీడీపీలో వారసత్వం కోసమే లోకేష్ పాదయాత్ర
27 Jan, 2023 15:21 IST
విజయవాడ: టీడీపీలో వారసత్వం కోసమే నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ రక్తంతో పుట్టిన పార్టీ టీడీపీ అని తెలిపారు. ఎన్టీఆర్ వారసుల నుంచి లాక్కొనేందుకు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. ఏ అర్హతతో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని కొడాలి నాని ప్రశ్నించారు. లోకేష్ మొదట ఎమ్మెల్యేగా గెలవాలన్నారు. శాసన సభ్యుడిగా ఓడిపోయిన వాడు పాదయాత్ర చేయడమేంటని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉండి పాదయాత్ర చేయాలని సూచించారు. లోకేష్ పాదయాత్ర టీడీపీకే ఉపయోగం లేదన్నారు.