చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలి
13 Jul, 2025 19:27 IST
అనకాపల్లి: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు ప్రతీ గ్రామానికి, ప్రతి ఇంటికి తీసుకుని వెళ్ళాలని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఆదివారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం లో విస్తృత స్థాయి సమావేశం మాజీ శాసనసభ్యులు నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమశంకర్ గణేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో గుడివాడ అమర్నాథ్, మాజీ విప్, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ కరణం ధర్మ శ్రీ , అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి , జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీ లు, సర్పంచులు, ముఖ్య నాయుకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.