వైయస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు
28 Feb, 2026 13:39 IST
అనకాపల్లి జిల్లా: చోడవరం నియోజకవర్గం వడ్డాది సమీపంలోని నూతన శ్రీరామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ తణుజా, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, స్థానిక జడ్పీటీసీ సభ్యుడు రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, రాష్ట్రానికి మళ్లీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పూజలు చేశారు. వచ్చిన అతిథులకు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ జ్ఞాపికలు, దుస్సాలువులతో ఘనంగా సత్కరించి తమ ఆతిథ్యాన్ని చాటుకున్నారు.