టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీలోకి వలసల వెల్లువ 

30 Jan, 2026 14:30 IST

అనంత‌పురం జిల్లా: సింగనమల నియోజకవర్గంలో కూటమి అరాచక పాలనపై విసుగుతో టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో వారికి వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూటమికి చెందిన సుమారు 25 మంది కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్ వారిని పార్టీలోకి స్వాగతించి కండువాలు వేసి అభినందించారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలైన ప్రజా సంక్షేమ పథకాలు, ప్రజల పక్షాన ఆయన చేస్తున్న పోరాటాలను గుర్తించి కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరడం అభినందనీయమన్నారు. రానున్న ఎన్నికల్లో అందరం కలసికట్టుగా పనిచేసి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు