దమ్ముంటే నాపై దాడులు చేయండి.. నన్ను ఎదుర్కొండి!

15 Jul, 2024 16:12 IST

ఒంగోలు:  వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే త‌న‌ను ఎదుర్కోవాల‌ని, తాను ఎక్క‌డికి వెళ్ల‌న‌ని ఒంగోలులోనే ఉంటాన‌ని స‌వాలు విసిరారు. టీడీపీ నేత‌ల తీరును బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి ఎండ‌గ‌ట్టారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతోమాట్లాడారు.

మాజీ మంత్రి బాలినేని ఏమ‌న్నారంటే..

  • నేను 5 సార్లు ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచా!
  • ఎప్పుడు కూడా టీడీపీ వాళ్ళ మీద దాడులు చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఉద్దేశపూర్వకంగా మా కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నాడు. 
  • మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి..
  • నేను ఒంగోలు ఎంఎల్ఏ గా ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు.. 
  • నాకు చివరి ఎన్నికలు అని... ఎన్నికలు ముందే చెప్పాను.. 
  • నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రతీపక్షంలో ఉన్న నేతలను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు..
  • ఎన్నికల ఫలితాల తర్వాత మా కార్యకర్తలపై టీడీపి వాళ్లు దాడులు చేశారు.. 
  • దాడుల చేయటం మంచి పద్దతి కాదు.. 
  • నేను వద్దు అనుకున్న.. రాజకీయాలు... కానీ మా కార్యకర్తలపై దాడులు చేశాక మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా....
  • ద‌మ్ముంటే త‌న‌పై దాడులు చెయండి.. నన్ను ఎదుర్కొండి 
  • ఓ చోట నాయుకుడు అబ్బా కొడుకులు పారిపోయారని ఫ్లెక్సి లు వేపించారు.. 
  • నేను మంత్రి గా ఉన్నప్పుడు నన్ను హవాలా మంత్రి, బు కబ్జా దారుడు అన్నారు.. ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది నా పై ఆరోపణలు తేల్చండి.. 
  • నేను అధికారంలో ఉన్నప్పుడు నా పై ఆరోపణలు చేశారు.. వాటిని నిరూపించండి. 
  • వైయ‌స్ఆర్‌సీపీ నేతలు టీడీపిలోకి వెళ్ళాక మంచోళ్ళు అయ్యారా..  వాళ్లు.
  • మా వియ్యంకుడు విల్లాలో అక్రమాలు జరిగాయని అంటున్నారు.. అక్రమాలు నిరూపించండి. 
  • టీడీపి ఎమ్మెల్యే A జనార్దన్ మా వ్యాపారులపై గురి పెట్టారు.  
  • ఎమ్మెల్యే జనార్దన్.. దమ్ము ఉంటె స్టైట్ గా నన్ను ఎదుర్కో.. 
  • నావాళ్ల‌ జోలికి వస్తె... చెప్పుతో కొడతా.. 
  • ఒంగోలు లేవట్లలో అక్రమాలు చేసివుంటే.. " నేను ఉరి వేసుకుంటా"  చస్తా ...
  • ఎమ్మెల్యే జనార్దన్ ఇప్పుడు అందరికీ నోటీసులు ఇచ్చి వేధిస్తున్నాడు.. 
  • నేను ఒంగోలు నుంచి పారిపోయాడు అనీ ఫ్లెక్సీ వేపించవు.. నేను పారిపోలేదు..
  • ఒంగోలులో ఉంటా.... పార్టీ మారేది లేదు..
  • నేను ప్రజా పోరాటానికి సిద్ధ‌మ‌ని బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి స‌వాలు విసిరారు.