వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నాయ‌కుల‌పై సిట్ వేధింపులు

19 Jul, 2025 14:26 IST

చిత్తూరు:  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోంద‌ని, వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నాయ‌కుల‌పై సిట్ అధికారుల వేధింపులు ఎక్కువ‌య్యాయ‌ని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిప‌డ్డారు. ఎంపీ మిథున్‌రెడ్డి లిక్కర్‌ కేసు వ్యవహారంపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది.. అవినీతి కు అవకాశం లేద‌న్నారు. మా పాలనలో ఒక్క బెల్ట్ షాపు లేదు, ప్రభుత్వం పారదర్శకంగా మద్యం దుకాణాలు నిర్వహించామ‌న్నారు. ఈరోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు తెరిచార‌ని ఆక్షేపించారు. 50 ఏళ్ల త‌న రాజకీయ జీవితంలో ఎక్కడ అవినీతికి పాల్పడలేదని స్ప‌ష్టం చేశారు. నీతిగా నిజాయితీగా పాలన చేశామ‌ని తెలిపారు. దళిత నాయకుడు గా ఉన్నత‌న‌పై  ప్ర‌భుత్వం కక్ష్య సాధింపు చర్యలు దిగుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. జీడి నెల్లూరు కు వచ్చిన సీఎం చంద్రబాబు  నేను ఎలాంటి అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు అని స్వయంగా చెప్పార‌ని గుర్తు చేశారు.