‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అన్నట్లుగా కూటమి పాలన
తాడేపల్లి: రైతుల సమస్యలు. ఫీజు రీయింబర్స్‌మెంట్. ఆరోగ్యశ్రీ. సంక్షేమ హాస్టళ్లలో దుర్భర పరిస్థితులు, పిల్లల మరణాలు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో విపక్షం టార్గెట్‌గా వే«ధింపులు. టీటీడీ లడ్డూ వ్యవహారం. పరకామణి కేసుతో పాటు, చంద్రబాబు తనపై మాఫీ చేసుకుంటున్న కేసులపై సుదీర్ఘంగా మాట్లాడిన వైయస్ జగన్.
ప్రెస్‌మీట్‌లో వైయస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..:
‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అన్నట్లుగా పాలన:
రాష్ట్రంలో పాలన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అన్న రీతిలో సాగుతోంది. ఇండియా ఏపీ వైపు చూడండి అనాల్సిన పరిస్థితిలో పాలన ఉంది. వ్యవసాయం అన్నది 62 శాతం జనాభా ఆధారపడి ఉన్న రంగం. ఏ ప్రభుత్వమైనా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. వ్యవసాయాన్ని పండుగగా చేస్తేనే రైతు సంతోషంగా ఉంటాడు. రైతు సంతోషంగా ఉంటేనే, రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రైతు, రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ ఎదగదు. మా హయాంలో వ్యవసాయం పండుగ కాగా, నేడు దండగలా మార్చారు
ఎక్కడ లేని బిల్డప్. ఇచ్చింది జీరో:
ఇటీవల మొంథా తుపాన్ వచ్చినప్పుడు చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన దత్తపుత్రుడు.. ముగ్గురూ కలిసి ఆర్టీజీఎస్ కార్యాలయానికి వెళ్లి ఏ రకంగా బిల్డప్ ఇచ్చారో చూశాం. వీళ్లకు తోడు వాళ్ల ఎల్లో మీడియా బిల్డప్ చూస్తే.. ఏకంగా వీళ్లే తుపాన్ పీక పట్టుకుని డైవర్ట్ చేసినట్లుగా బిల్డప్ ఇచ్చారు. వీళ్లు అప్పుడు ఆర్టీజీఎస్‌లో కానీ కూర్చుని ఉండకపోతే ఆ తుపాన్ ఆగేది కాదన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ఆ తుపాన్ బీభత్సం, ఆ తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు ఫైనల్‌గా చూస్తే .. తుపాన్ కారణంగా నష్టపోయిన ఏ రైతుకు పైసా సాయం కూడా అందలేదు. దాదాపు 15 లక్షల్లో పంట నష్టం జరిగితే, దాన్ని 4 లక్షల ఎకరాలకు కుదించి చూపారు. చివరకు దానికి పైసా పరిహారం ఇవ్వలేదు.
రైతులకు అన్ని విధాల నష్టం:
చంద్రబాబు 19 నెలల పాలనలో రాష్ట్రంలో 17 సార్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు చాలా నష్టపోయారు. కాబట్టి వారికి 17 సార్లు ప్రభుత్వం నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ రావాల్సి ఉంది. అలా దాదాపు రూ.1100 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు ఉన్నాయి. ఆ డబ్బులు ఇచ్చి ఈ పెద్ద మనిషి పుణ్యం కట్టుకోలేదు. అవి ఇవ్వకపోగా, ఈ పెద్దమనిషి వచ్చిన వెంటనే రైతులకు అంతకు ముందు వరకు కూడా హక్కుగా ఉన్న ఉచిత పంటల బీమాను రద్దు చేశాడు. మా హాయంలో ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు రూ.7,800 వేల కోట్లు పరిహారంగా ఇప్పించాం.
ఈరోజు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఒక వైపు ఇన్‌పుట్ సబ్సిడీ రాదు. చంద్రబాబు పుణ్యాన ఉచిత పంటల బీమా కూడా లేదు. రాష్ట్రంలో దాదాపు 84 లక్షల మంది రైతుల్లో కేవలం 19 లక్షల మంది మాత్రమే క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకున్నారు. ఖరీఫ్ సమయంలో సహజంగా 87 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. మరి ఈరోజు 19 లక్షల మంది రైతులకే ఇన్సూరెన్స్ సదుపాయం ఉంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి?.
పథకాలు లేవు. ఏదీ చెప్పడు:
చంద్రబాబు ఎప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తారు తప్ప, పంట నష్టపోయిన రైతులకు ఎప్పుడు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తాడో చెçప్పడు. పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ పేరు పెట్టి ఏటా రూ.20 ఇస్తామన్నారు. ఆ మేరకు రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగిలిన రూ.30 వేలు ఇవ్వకుండా మోసం చేశారు. ఇంకా ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. ఉచిత పంటల బీమాను కూడా అమలు చేయడం లేదు.
ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు:
ఈ రోజు ఇన్ని కష్టాల మధ్య రైతు వ్యవసాయం చేస్తే ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. గత ఏడాది ధాన్యం, కందులు, మినుములు, పెసలు, ఉల్లి, టమాటా, చీనీ, మామిడి పంటలు ఏ పంట తీసుకున్నా కూడా మద్దతు ధర లేదు. ఈ ఏడాది కూడా అంతే.
ఇప్పటికే మొంథా తుపాన్‌లో నష్టపోయిన ఆ రైతుల ధాన్యాన్ని కొనే నాథుడు లేడు. 75 కేజీల బస్తాకు మద్దతు ధర రూ.1776 రావాలి. కానీ, ఈరోజు పరిస్థితి ఏమిటంటే.. రైతులను బస్తా ధాన్యం రూ.1200, రూ.1300కు ఇస్తారా అని దళారులు అడుగుతున్నారు.
దిత్వా ముంచుకొస్తోందని తెలిసినా..:
ఇప్పుడు దిత్వా తుపాన్ చూస్తున్నాం. ఈ తుపాన్ పంట కోతల సమయంలో వస్తుందని 10 రోజుల ముందే మనకు తెలుసు. కోసిన పంట ఇంకా కళ్లాల్లోనే ఉందని తెలుసు. ఈ పంట కొనకపోతే ధాన్యం తడిసిపోతుందని తెలుసు. రైతులు ఇప్పుడే దెబ్బ తిన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతులు నష్టపోతారని తెలుసు. అయినా చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తున్నారు. రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగడం లేదు. దీన్ని ప్రజలంతా గమనించాలి.
అదే మా హయాంలో అయితే..:
అదే మా హయాంలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. యుద్ధప్రాతిపదికన ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పని చేసేది. తుపాన్‌కు ముందే గన్నీ బ్యాగ్స్ సరఫరా చేశాం. లాజిస్టిక్స్ కోసం వెంటనే లారీలను రంగంలోకి దించాం. ఆర్బీకేలు వెంటనే యాక్టివేట్ అయ్యేవి. అలా వర్షం కన్నా ముందే వేగంగా పంట కొనుగోలు చేశాం.
మరి ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే రైతులు ఏమైనా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. వరి రైతులే కాదు, అరటి, మొక్కజొన్న, పత్తి, కొబ్బరి, వేరుశనగ.. ఏ పంట చూసినా అదే పరిస్థితి. ఏ పంటకు సరైన ధర లేదు. చివరికి ఏ స్థాయిలో ధరలు ఉన్నాయంటే కేజీ అరటి అర్ధ రూపాయి. ఇంత దారుణ పరిస్థితి ఉంటే రైతులు ఎలా బతుకుతారు? అంత ఘోరంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోంది.
నాడు రైళ్లలో అరటి ఎగుమతులు:
గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అరటి, చీనీ రైతులకు మేలు చేసేందుకు ప్రత్యేక రైళ్లను నడిపించాం. అనంతపురం నుంచి ఢిల్లీ, తాడిపత్రి నుంచి ముంబై, నంద్యాల, కర్నూలు నుంచి ఘజియాబాద్, లక్నోకు ప్రత్యేక రైళ్లు నడిచాయి. దీని వల్ల రైతులకు దళారుల బెడద తగ్గింది. రవాణా ఖర్చులు దాదాపు 40 శాతం తగ్గాయి. పెద్ద ఎత్తున వాటి ఎగుమతి జరిగింది. మా ప్రభుత్వం రాకముందు అరటి ఎగుమతి 23 వేల టన్నులు ఉంటే, 2023–2024లో అది ఏకంగా 3 లక్షల టన్నులకు చేరింది. రైతులకు అదనంగా 20 నుంచి 40 శాతం వరకు ఎక్కువ రేటు దక్కింది. అది ఈ ప్రభుత్వంలో ఎందుకు జరగడం లేదు? చంద్రబాబు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా?.
నిన్ను సీఎంగా ఎందుకు చేశారో తెలుసుకో:
చంద్రబాబూ, నిన్ను ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు? గాడిదలు కాయడానికి కాదు కదా? మీరు రైతులను పట్టించుకోవాలి కదా? చివరకు పులివెందులలో 600 టన్నుల కోల్డ్ స్టోరేజీని మా ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించాం. అది ఇప్పుడు ఆపరేషన్‌లో లేదు. కారణం కరెంటు బిల్లులు కట్టాల్సి వస్తుందని కోల్డ్‌స్టోరేజిని మూసి వేశారు.
దయనీయంగా మారిన రైతుల పరిస్థితి:
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రైతులకు ఇచ్చిన హామీలు మోసంగా తేలుతున్నాయి. దీంతో రైతుల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. రైతులకు హక్కుగా ఉన్న ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయ్యాయి. ఈ–క్రాప్ వ్యవస్థ తెరమరుగైంది. తూతూ మంత్రంగా ఈ–క్రాప్ చేశామంటే చేశామన్నట్లు చేశారు. రైతు సాగు చేసిన పంట పొలంలో ఆ రైతును నిలబెట్టి ఫోటో తీసి దాన్ని జియో ట్యాగ్ చేయాలి.
ఇంకా పంట సాగు విస్తీర్ణం, పంట వివరాలను ఆర్బీకేలో నమోదు చేయాలి. రైతుకు ఎక్కడ నష్టం జరిగినా, ఆర్బీకేలో గతంలో ఒక పోస్టర్ ఉండేది. ప్రతి పంటకు ఈ గిట్టుబాటు ధర అంటూ ధరల పట్టిక ఉండేది. ఎక్కడైనా రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే వెంటనే ఆర్బీకే యాక్టివేట్ అయ్యేది. దాంతో ఒక కాల్ జాయింట్ కలెక్టర్‌కు వెళ్లేది. వెంటనే ఆయన జోక్యం చేసుకుని, ప్రభుత్వం తరపున పంట కొనుగోలు చేసే వాడు. ఆ విధంగా మార్కెట్లో పోటీ వాతావరణం ఏర్పడేది. మా హయాంలో అలా పంటల కొనుగోలు కోసం రూ.7,457 కోట్లు ఖర్చు చేశాం.
రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. రైతన్నా మీ కోసం అంటూ ప్రచార కార్యక్రమం చేస్తున్నారు. ఈనాడు పేపర్లో కటింగ్ చూడండి ఓసారి. రైతన్నా మీకోసం అంట. కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలంట. అసలు రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు వీళ్లకు. పోతే రైతులు తిడతారు, కొడతారు. అందుకే ఎవరూ పోయేది లేదు.
నిస్సిగ్గుగా సూపర్‌హిట్ ప్రచారం!
చీటింగ్ కేసు పెట్టాలి కదా?:
ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. సూపర్‌సిక్స్ మొత్తం అమలు చేశారట? దానిపై ప్రకటనలు కూడా జారీ చేశారు. సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ అని చెప్పుకుంటున్నారు. గోబెల్స్ ప్రచారానికి చంద్రబాబు టీచర్.
నేను చంద్రబాబుగారిని సూటిగా అడుగుతున్నాను. అసలు సూపర్‌సిక్స్‌లో ఏమేం అమలు చేశారు? నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేల చొప్పున రెండేళ్లకు రూ.72 వేలు ఇవ్వాలి. అసలు ఇచ్చారా?. ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున, రెండేళ్లకు రూ.36 వేలు ఇవ్వాలి. ఇచ్చారా?
50 ఏళ్లకే పెన్షన్ అన్నారు. నెలకు రూ.4 వేల చొప్పున రెండేళ్లకు రూ.96 వేలు ఇవ్వాలి. ఇచ్చారా?. అన్నదాతా సుఖీభవ కింద ఏటా రూ.20 వేల చొప్పున రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాలి. ఇచ్చింది రూ.10 వేలు మాత్రమే. అమ్మ ఒడిలో 30 లక్షల మంది కట్. రెండేళ్లకు కలిపి ప్రతి పిల్లాడికి రూ.30 వేలు ఇవ్వాలి. కానీ, ఇచ్చింది రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు మాత్రమే. ఇది మోసం కాదా?. ఏడాదికి 3 సిలిండర్లు అన్నారు. అలా రెండేళ్లకు 6 సిలిండర్లు ఇవ్వాలి. కానీ ఇచ్చింది కేవలం 3 సిలిండర్లు మాత్రమే. అది మోసం కాదా?. ఉచిత ప్రయాణం అన్నారు. కానీ, కొన్ని బస్సుల్లోనే అనుమతిస్తున్నారు. ఇది మోసం కాదా?
అయినా వాళ్లకు వాళ్లకు సంబంధించిన పాంప్లెట్ పేపర్లు, ఎల్లో మీడియా టీవీ ఛానళ్లలో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చేస్తున్నాడు. గోబెల్స్ అనే వ్యక్తి హిట్లర్ టైమ్‌లో కమ్యూనికేషన్ మినిస్టర్. ఆయన పేరు చెబుతారు. కానీ వాస్తవంగా చంద్రబాబునాయుడు పేరు చెప్పాలి. ఆయన గోబెల్స్‌కు టీచర్, మెంటార్.
మరి ఇన్ని 420 చేష్టలు చేస్తున్నాడు. మరి చీటింగ్ కేసు పెట్టి ఈయన మీద బొక్కలో వేయాల్సింది కాదా? అసలు వీళ్ల ముగ్గుర్నీ బొక్కలో వేయాలి చీటింగ్ కేసు పెట్టి. ఫ్రాడ్ కాదా ఇది?. ఇదే వేరేవాడు చేస్తే, ఏదన్నా చిట్‌ఫండ్ నడిపే వాడో లేదా ఏదన్నా ఫైనాన్స్ స్కీమ్ నడిపేవాడో ఇలాంటి ఫ్రాడ్ చేస్తే ఏం చేసే వారు? జైల్లో పెట్టేవారు కాదా? వీళ్లు కాబట్టి ఈనాడు రాయదు. ఆంధ్రజ్యోతి చూపదు. టీవీ5 అసలు పట్టించుకోదు. అంతా వీళ్లే గజదొంగల ముఠా. దోచుకోవడాలు, పంచుకోవడాలు, తినుకోవడాలు. అంతా వీళ్లే. ఎవడూ రాయడు, ఎవడూ చూపడు, ఎవడూ మాట్లాడడు.
అస్తవ్యస్తమైన విద్యా రంగం:
మరోవైపు విద్యార్థుల పరిస్థితి నిజంగా అగమ్య గోచరంగా ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పూర్తిగా అటకెక్కించేశారు. విద్యార్థులు ఈ రోజు నిజంగా తల్లడిల్లుతున్నారు. జీఈఆర్ రేషియో డ్రాప్ అయింది. స్కూళ్లలో డ్రాపవుట్స్ పెరుగుతున్నాయి. పిల్లలు చదువులు మానేస్తున్నారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు:
ఫీజు రీయింబర్స్ మెంట్ పరిస్థితి చూస్తే మా హయాంలో ప్రతి క్వార్టర్. ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే వెరిఫికేషన్ చేసి వెంటనే తర్వాతి క్వార్టర్ రాకముందే తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడేవి. గత ఏడాది ఎన్నికల కోడ్ రావడంతో జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ డబ్బులు ఆగిపోయాయి. మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. దాంతో అక్కడ ఆగిపోయింది. ఈ డిసెంబర్ నాటికి 8 క్వార్టర్స్. ఒక్కో క్వార్టర్‌కు ఉజ్జాయింపుగా రూ.700 కోట్లు. ఉజ్జాయింపుగా మొత్తం రూ.5,600 కోట్లు. కానీ ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. అంటే రూ.4,900 కోట్ల బకాయిలు.
వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో మా ప్రభుత్వంలో రూ.1100 కోట్లు ఇచ్చే వాళ్లం. పిల్లల బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం. పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం. ఇంజనీరింగ్, డిగ్రీ చదివే పిల్లలకు ఏటా రూ.20 వేలు, పాలిటెక్నిక్ చదివే పిల్లలకు రూ.15 వేలు, ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు ఇచ్చే వాళ్లం. ఏప్రిల్ 2024లో ఎన్నికల కోడ్ వల్ల అది ఆగిపోయింది. దీంతో ఏప్రిల్ 2025 నాటికి రూ.2,200 కోట్లు బకాయిలు. విద్యాదీవెన బకాయిలు రూ.4,900 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ.2,200 కోట్లు. రెండూ కలిపితే రూ.7,100 కోట్లు బకాయిలు.
ప్రభుత్వ స్కూళ్లలో దారుణ పరిస్థితులు:
ఇంకా ఒక అడుగు ముందుకేద్దాం. ప్రభుత్వ స్కూళ్లు ఏరకంగా ఉన్నాయి అని చూస్తే.. ఈరోజు మీరు గమనించండి. ప్రభుత్వ స్కూళ్లకు పోయేటప్పుడు ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలందరూ క్యారియర్లు కట్టుకోని పోతున్నారు. దాదాపు ప్రతి పిల్లాడూ క్యారియర్ పెట్టుకుని పోతున్నాడు. ఎందుకు? అని అడగండి. తిండి అస్సలు బాగలేదన్నా, తినలేకపోతున్నాం అనే మాట వస్తోంది. గోరుముద్ద అన్నది గాలికి ఎగిరిపోయింది. నాడు–నేడు అన్నది ఆగిపోయింది. స్కూళ్లలో 3వ తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం, టోఫెల్ క్లాసులు నిలిచిపోయాయి. ఇంక ఐబీ కథ దేవుడెరుగు. 8వ తరగతి పిల్లలకు ట్యాబులిచ్చేది పూర్తిగా ఆగిపోయింది.
రెసిడెన్షియల్ స్కూళ్లలో దుర్భర పరిస్థితి.
ప్రభుత్వ వైఖరి విద్యార్థులకు శాపం:
ఈరోజు పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే ప్రభుత్వ హాస్టళ్లలో.. మీరంతా కూడా దీని మీద ధ్యాస పెట్టండి. ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగు నీరు, కలుషిత ఆహారం, అనారోగ్యం వల్ల ఈ 18, 19 నెలల చంద్రబాబు పాలన కాలంలో ఏకంగా 29 మంది పిల్లలు చనిపోయారు. ఇది రికార్డు. ఏయే స్కూళ్లలో చనిపోయారు, ఏయే ఆశ్రమ పాఠశాలలకు చెందిన పిల్లలు అనేది స్లైడ్స్ చూడండి.
(అంటూ.. పీపీటీలో పిల్లల ఫోటోలతో సహా పూర్తి వివరాలు ప్రదర్శించారు)
ఇంకా వీరు కాకుండా కొన్ని వందల మంది పిల్లలు ఆస్పత్రుల పాలయ్యారు. ఫుడ్ పాయిజన్, వాటర్ కంటామినేషన్‌తో. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను నేను కూడా వెళ్లి పరామర్శించాను. అంటూ..
(ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పిల్లల ఫోటోలు పూర్తి వివరాలతో పీపీటీలో చూపారు)
ఇటువంటి ఘటనలు ప్రతి రోజూ జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు..
ప్రభుత్వానికి మాయరోగం:
ఈ ప్రభుత్వానికి ఇంకో మాయరోగం వచ్చింది. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు. నిజంగా ఒకవైపున అన్ని రకాలుగా గవర్నమెంట్ అన్నది ఉన్నది ఎందుకు, ఏం చేయడం కోసం ప్రజలు నీకు అధికారం ఇస్తారు? చదువులు, వైద్యం, శాంతి భద్రతలు, పారదర్శకత, వ్యవసాయం.. ఇవే కదా చేయాల్సింది. కానీ ఇక్కడ అన్నీ తిరోగమనమే. అన్నీ స్కాములే. ఏదీ పట్టించుకునే పరిస్థితి లేదు. అన్నీ ప్రైవేట్‌కే. బాధ్యత నుంచి తప్పించుకోవడం. అందిన కాడికి స్కామ్‌లు చేయడం.
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం:
ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేయడం అన్నది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో ఆస్పత్రుల్లో సేవలన్నీ దాదాపుగా నిలిచిపోయాయి. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు దాదాపు నిల్చిపోయాయి. మామూలుగా ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు రూ.300 కోట్లు అవుతుంది. 18 నెలలకు రూ.5400 కోట్లు. ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం.. ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా మాట్లాడి, వాళ్లు కూడా స్ట్రైకులు చేస్తుంటే ఇచ్చింది ఎంత అని చూస్తే రూ.1800 కోట్లు. అంటే ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3,600 కోట్లు. దీంతో మొన్న నెట్‌వర్క్ ఆస్పత్రులన్నీ సమ్మె చేశాయి. సమ్మె దిగిపోయేటప్పుడు వాళ్లకిచ్చిన మాటకు కూడా దిక్కు లేదు.
నిజంగా పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. 104, 108 కూడా స్కాముగా మార్చేశారు. రూ.5 కోట్లు నికర టర్నోవర్ లేని సంస్థకు ఇచ్చారు. వాళ్ల తెలుగుదేశం ఆఫీసులో డాక్టర్ల సెల్ అధ్యక్షుడంట. అతడికి ఆ సర్వీసులు అప్పగించారు. కనుక్కోండి మీరే. స్కాము కాకపోతే రాయనన్నా రాయండి. ఓ పక్క ఇంత దారుణంగా ఆరోగ్య వ్యవస్థ ఉంటే.. మరోవైపు సంజీవని అంటాడు. అది ఇంకో డ్రామా.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
ఆ ప్రైవేటు యాజమాన్యాలకు బొనాంజా:
ఇలా ఓవైపున ఆరోగ్యశ్రీని ఖూనీ చేస్తూ.. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా హతం చేస్తూ ఇంకోవైపు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కాముగా మారుస్తూ.. ఈ ప్రభుత్వ పాలన సాగుతోంది. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటో తెలుసా.. కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం ఒక స్కాము అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాంజా ఇచ్చారు. అది ఇంకో పెద్ద స్కామ్.
ఆ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తున్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తుందంట!. చూడండి ఇది.
(అంటూ ఆ జీవో పీపీటీలో చూపి చదివి వినిపించారు)
ఒక్కో టీచింగ్ హాస్పిటల్‌లో అంటే 550 బెడ్ ఆస్పత్రికి ఎంత ఖర్చు అవుతుందని చూస్తే దాదాపు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు జీతాల కోసం ఖర్చవుతుంది. అంటే ఏటా రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్లు. రెండేళ్లకు రూ.120 నుంచి రూ.140 కోట్లు. ఈయన ఇస్తున్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే, గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ బిల్డింగ్‌లు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ జీతాలు కానీ, ఓనర్ మాత్రం ప్రైవేట్ వాళ్లు. ఆశ్చర్యంగా లేదా ఇది? స్కాముల్లో అన్నింటి కంటే పెద్ద స్కామ్ కాదా ఇది?. బొనంజా కాదా ఇది?.
లాభాలు ప్రైవేట్ వాళ్లకు. భారమేమో ప్రభుత్వం, ప్రజలకు. అంటూ.. ( జీఓ కూడా చూపారు)
జీవో నెం:847 చూడండి. ఒక పక్క ప్రజా ఉద్యమం జరుగుతుంది. సిగ్గు లేకుండా, ప్రజా ఉద్యమాన్ని ఖాతరు చేయకుండా చంద్రబాబు స్కాముల పర్వం ముందుకు పోతోంది. ఒక పక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు చేస్తున్నారు. మరోవైపున ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తున్న స్కాముల్లో ఒక అడుగు ముందుకేసి ఇంకో స్కామ్ చేస్తున్నాడు.
ఈనెల 16న గవర్నర్‌తో భేటీ:
కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలు తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తున్నా కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో ప్రజలంతా రోడ్లెక్కుతున్నారు. 175 నియోజకవర్గాల్లో మా పార్టీ ఇప్పటికే భారీ ర్యాలీలు ప్రజల తరఫున, ప్రజలతో కలిసి ప్రజల గొంతుకను ఇప్పటికే వినిపించడం జరిగింది.
కోటి మందికి పైగా సంతకాలు పెడుతూ ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు. నిన్ననే గవర్నర్ అపాయింట్‌మెంట్ డేట్ ఖరారు అయ్యింది. కోటి సంతకాల పత్రాలు ఈనెల 10న అసెంబ్లీ సెగ్మెంట్లలో డిస్‌ప్లే చేసి చూపించి, అక్కణ్నుంచి జిల్లాలకు పంపడం జరుగుతుంది. 13వ తేదీన జిల్లా కేంద్రాల్లో ర్యాలీ చేసి ప్రజలు చేసిన కోటి సంతకాలకు పైగా పత్రాలు జిల్లా నుంచి పార్టీ సెంట్రల్ ఆఫీస్‌కు బయల్దేరుతాయి. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఈ కోటి సంతకాలకు పైగా పత్రాలను తీసుకొని రాష్ట్ర గవర్నర్ గారికి ఈనెల 16న సమర్పిస్తాం.
ఈనెల 16న రాష్ట్ర గవర్నర్ గారికి చెప్పడం, చూపించడం రెండూ చేసిన తరువాత ఈ పత్రాల ద్వారా హైకోర్టులో పిటీషన్ కూడా వేస్తాం.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు:
ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయనే దానికి ఈ డిసెంబర్ పూర్తయి జనవరి వస్తే.. 5 డీఏలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే.. డీఏ బకాయిలు రిటైర్మెంట్ అయ్యాక ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బహుషా చరిత్రలో చూసి ఉండం, ఒక్క చంద్రబాబు ప్రభుత్వంలో తప్ప.
దానికి తగ్గట్టుగా జీవో: 60 ఇచ్చారు. క్లాజ్ 11, 12 చదివితే అర్థం అవుతుంది. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం కూడా ఇంత దౌర్భాగ్య (డ్రెకోనియన్) జీవో ఇచ్చి ఉండరు. వెంటనే దీని మీద గొడవలు మొదలయ్యే సరికి, ఉపసంహరించుకొని వాయిదాల్లో ఇస్తామన్నారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా మెరుగైన పీఆర్సీ ఇంత వరకూ లేదు. ఎన్నికల సమయంలో మెరుగైన పీఆర్సీ అన్నారు. అసలు ఉన్న పీఆర్సీ చైర్మన్‌ను తీసేశారు. ఇప్పటి వరకు చైర్మన్‌ను నియమించలేదు. చైర్మన్‌ను నియమిస్తే.. రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇస్తే వెంటనే అమలు చేయాలి. అది చేస్తే ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. పెరిగిన జీతాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందన్న దురుద్దేశంతో పీఆర్సీ చైర్మన్‌ను ఇప్పటి వరకు నియమించలేదు. మెరుగైన పీఆర్సీ కథ దేవుడెరుగు.. కనీసం పీఆర్సీ చైర్మన్ అపాయింట్ కాలేదు. మెరుగైన పీఆర్సీ ఒక బూటకం.
అధికారంలోకి వచ్చిన వెంటనే తాత్కాలిక భృతి (ఐఆర్) అన్నాడు. అదీ లేదు. మేము వచ్చిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చాం. అధికారంలోకి రాగానే ఉద్యోగుల జీతాలు పెరిగాయి. చంద్రబాబు వచ్చాక ఐఆర్ లేదు. పీఆర్సీ లేదు. ఓపీఎస్ లేదు.
అంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే.. ఉద్యోగులను త్రిశంకు స్వర్గంలో పెడుతూ మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్ (గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్) కూడా చెల్లుబాటు కాకుండా చేశాడు. గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్‌ను ఇప్పుడు దేశమంతా కాపీ కొడుతోంది. కనీసం అదైనా అమలు చేసి ఉంటే దాని బెనిఫిట్స్ రిటైర్డ్ ఉద్యోగులకు వచ్చి ఉండేది.
పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్‌లు, ఏపీజీఎల్‌ఐలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్లు, సరెండర్ లీవ్స్ వీటి రూపేణా ఉద్యోగులకు మొత్తం రూ.31 వేల కోట్ల బకాయిలు పడ్డాడు చంద్రబాబు.
ఆప్కాస్ ద్వారా ప్రతినెలా 1వ తేదీనే జీతాలిచ్చేట్లుగా మా ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటే.. ఆప్కాస్‌లో ఈరోజు ఒకవైపు సంఖ్య తగ్గిస్తున్నారు. అందరికీ కాంట్రాక్ట్‌లు. ఆలయాల్లో శానిటేషన్ వర్క్ కాంట్రాక్ట్‌లే. వీళ్లకు సంబంధించిన భాస్కర్ నాయుడు. చంద్రబాబు నాయుడు బంధువులు, చంద్రబాబు మనుషులే.. వీళ్లకే ఆ లేబర్ కాంట్రాక్ట్ వర్క్‌లు. ఆప్కాస్‌లో ఒకవైపు నంబర్లు తగ్గిస్తున్నారు. మరోవైపు ఆప్కాస్‌లో 1వ తేదీ జీతం కథ దేవుడెరుగు. ఇప్పుడు జీతాలు రెండు, మూడు నెలలకు ఓసారి ఇస్తున్నారు. గెస్ట్ లెక్చరర్లకు 8 నెలలుగా జీతాలు లేవు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ప్రైవేటీకరణ:
విశాఖ ఉక్కు. ఆం«ధ్రుల హక్కు,. ఎన్నో ఉద్యమాలు, ఎందరో త్యాగాలతో ఆ ప్లాంట్ వచ్చింది. ఆం«ధ్రుల మనోభావాలు ప్రతిబింబిస్తూ ప్లాంట్ ఏర్పాటైంది. ఇప్పుడు ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా ఆందోళన ఉ«ధృతంగా సాగుతోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా, మా ఐదేళ్ల పాలనలో కాపాడగలిగాం. ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకూడదని అసెంబ్లీలో తీర్మానం చేసి, ఈ ప్లాంట్‌కు మంచి జరిగేలా వెంటనే క్యాపిటివ్ మైన్స్ అలాట్ చేయండి అని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. అలా మా ఐదేళ్ల పాలనలో ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగాం.
కానీ, చంద్రబాబు అనే వ్యక్తి నిజంగా ఎన్నికలకు ముందు ఏమన్నాడు.. ఎన్నికల తరువాత చంద్రబాబు ఏమంటున్నాడో మీరే చూడండి.
(అంటూ.. ఆ వీడియో కూడా పీపీటీలో చూపారు)
సినిమాల్లో విలన్ అని అంటాం కదా.. విలన్ అనే పాత్ర ఎలా ఉంటుందో నిదర్శనం ఒక్కసారి వీడియో ప్లే చేసి చూపిస్తా..
నిజంగా ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుంటాం.. కలిసి పోరాడుతాం.. కార్మికుల ఉద్యమానికి మద్దతు అంటూ వీర డైలాగులు పీకాడు. కార్మికులందరితో చెప్పించాడు.. బాగుంది.
అదే ఇవాళ ప్రైవేటీకరణపై ప్రశ్నిస్తే.. పని చేయకుండా జీతాలు ఇవ్వాలా?. ఇంట్లో పడుకొని పనిచేయకపోతే ఎలా? ఊరికే జీతాలు ఇస్తారా? పక్కనే మరో ఫ్యాక్టరీ ప్రైవేటు వాళ్లది వస్తుంది. వాళ్లది లాభాల్లోకి వెళ్తారు అని చెబుతూ తమాషాలు చేయొద్దు.. పీడీయాక్ట్‌లు పెట్టి లోపల వేస్తా’ అంటున్నారు.
అసలు సంస్థ నష్టానికి కారకులెవరు?:
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆశాజనకంగా, మిగతావాటి కంటే అంత బాగా ఉండకపోవడానికి కారణం ఉద్యోగస్తులు కాదు. ఒకసారి అందరూ గమనించండి.
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్). స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ప్లాంట్ల మధ్య తేడా గమనిస్తే.. ఎంప్లాయీ ఎక్స్‌పెండేచర్, పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్‌పెండేచర్ చూస్తే అర్థం అవుతుంది. 2023–24 ఫైనాన్షియల్ ఇయర్ వాళ్ల వార్షిక నివేదికలో ఉన్న డేటాను డిస్‌ప్లే చేస్తున్నాను..
ఎంప్లాయీ ఎక్స్‌పెండేచర్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్‌పెండేచర్ చూస్తే.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కూడా 11.2 శాతం. సెయిల్‌లో కూడా 11.2 శాతమే. తేడా ఏమీ లేదు. వీళ్లకు ఉన్న రెవెన్యూస్‌లో ఎంప్లాయీ ఎక్స్‌పెండేచర్ 11.2 శాతం. కానీ, సెయిల్ ఎందుకు ఇంకా రిజల్ట్స్‌లో బెటర్‌గా ఉంది.. విశాఖ ఎందుకు లేదంటే కారణం సొంతంగా గనులు లేకపోవడం. సెయిల్ ప్లాంట్‌కు సొంత ఖనిజ గనులు ఉన్నాయి. సెయిల్ క్యాపిటీవ్ మైన్స్ ప్రొడ్యూస్ 34.34 మిలియన్ టన్స్. అది ఒక్కటే కాదు.. వీళ్లు 1.16 మిలియన్ టన్స్ ఓపెన్ మార్కెట్‌లో వాళ్ల కాపిటివ్ మైన్స్ నుంచి ఉన్న మైన్స్ అమ్ముకున్నారు. అందుకనే ఇనుప ఖనిజం వ్యయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో 18.6 శాతం. సెయిల్‌లో అది కేవలం 9.8 శాతం మాత్రమే. అంటే వాటి మధ్య 10 శాతం తేడా ఉంది.
అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేతాయించాలని ఢిల్లీకి వెళ్లి ఎన్డీయేలో కూటమిగా ఉన్న పరిస్థితుల్లో అడగాల్సిందిపోయి.. వీళ్లు ఏం చేస్తున్నారంటే.. మిట్టల్ అనే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారంట.. వాళ్లకు క్యాపిటివ్ మైన్స్ ఇవ్వాలని అడుగుతున్నారు.
గవర్నమెంట్ సెక్టార్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాపిటివ్ మైన్స్ టీడీపీ ఎంపీలతో చంద్రబాబు అడిగించడు. కానీ, ప్రైవేట్ సెక్టార్‌లో పెట్టబోయే మిట్టల్ ప్లాంట్‌కు క్యాపిటివ్ మైన్స్ ఇవ్వాలని ఎంపీలు అడుగుతున్నారు.. అది చంద్రబాబు పద్ధతి.
రెడ్‌బుక్ రాజ్యాంగం. వేధింపుల పర్వం:
మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం. నిజంగా పరిస్థితి ఎలా ఉంది అని అంటే.. రెడ్ బుక్ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబతాను వినండి.
ఇది బాగా వినండి నేను చెప్పేది. వీరిదే రాష్ట్ర ప్రభుత్వం. ఈనే ప్రభుత్వంలో ఉన్నారు. గత 19 నెలలుగా వీళ్లే ఉన్నారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు రాష్ట్రవ్యాప్తంగా వీళ్లు పెట్టినవే. ఎక్కడ పడితే అక్కడ వీళ్లు.. వీళ్ల ఎమ్మెల్యే కాండెట్లు, మంత్రులు, వీళ్ల ప్రఖ్యాత, వీళ్ల పలుకుబడి కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులతో ఈ నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలను నడుపుతూ ఉన్న వారి ఫోటోలు ఎక్కడబడితే అక్కడ కనిపిస్తాయి.
(అంటూ ఆ నకిలీ మద్యం తయారీ కంపెనీలు. వాటి యజమానులు. టీడీపీ అధినేతలతో ఉన్న వారి ఫోటోలు పీపీటీలో చూపారు)
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో బాగా పూజలు జరిగాయని స్టార్ట్ చేసినా.. కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు. కింద ములకలచెరువు.. చూడండి బాగా. బాక్సులు కూడా బాగా కట్టినారు. బ్రాండు పేర్లు కూడా, లేబుళ్లు కూడా వాళ్లే తయారు చేస్తున్నారు. టకాలున అతికించడం.. నకిలీ మద్యం మీద వీళ్లకి కావాల్సిన బ్రాండ్ పేరు పెట్టడం. మళ్లా డిస్ట్రిబ్యూషన్ చానల్.. అంతా వీళ్లే. ప్రైవేట్ షాపులు, వీళ్ల మనుషులే ప్రైవేట్ షాపులు. నీట్‌గా డిస్ట్రిబ్యూషన్ కూడా కరెక్టుగా వీళ్ల మనుషులకే పోతుంది, వీళ్లే నీట్‌గా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేస్తారు. ఇది కాక బెల్టు షాపులు ఉన్నాయి.. ఇది కాక పర్మిట్‌లు కూడా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ చానల్ కూడా వీళ్లదే.
అంటే వీళ్లదే గవర్నమెంటు. అందుకే నీట్‌గా బాటిళ్ల మీద లేబుళ్లు కూడా అతికించేసి, ఏది ఒరిజినల్‌లో, ఏది నకిలీదో ఎవరికీ తెలియకోకుండా, మూడో పెగ్గుకు వచ్చేసరికి, నాలుగో పెగ్గుకు వచ్చేసరికి ఏం తాగుతున్నామో ఎవడికీ ఏం తెలీదు. అన్నీ ఒకటే అనే లెవెల్‌లోకి తీసుకుపోతున్నారు.
ఇది ఇబ్రహీంపట్నంలో, ఇది డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్కు, చూడండి ఇది తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ కేండిడేట్ ఆయన. ఆయన పేరు జయచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఇన్‌చార్జ్ ఫ్రమ్ ములకలచెరువు. ములకలపల్లి మండలం అంటే తంబళ్లపల్లి నియోజకవర్గం. ఆయన జయచంద్రారెడ్డి, కంటెస్టెడ్ కేండిడేట్, తెలుగుదేశం పార్టీ, విత్ చంద్రబాబునాయుడు. బీఫామ్ ఇస్తా.. మళ్లా ఆయన పార్ట్‌నరూ. ఇంకొక ఆయన జనార్దనరావు వీరంతా. ఇంకొక ఆయన సురేంద్రనాయుడు. చూడు లోకేశ్ గారితో ఫోటో, 1000 ఓల్ట్ బల్బుల్లా మళ్లా.. లిక్కర్ వ్యాపారం పెట్టుకున్నారు కాబట్టి షైన్ కూడా కనబడుతోంది. ఆ ప్రాంతానికి చెందిన మంత్రి ఆయన పక్కన.
ఇది అనకాపల్లి. పరవాడ. ఉత్తరాంధ్ర.
నీటుగా ఇదిగో సేమ్ మోడల్ బ్రాండ్ ఇది. లేబుళ్లు, గీబుళ్లు అంతా. ఈయనెవరంటే స్పీకరు. ఆయన పక్కన ఎవరూ అనంటే అయ్యన్నపాత్రుడి సన్నిహితుడు రుత్తుల రాము. చూడు నీట్‌గా ఇద్దరూ బ్రహ్మాండంగా.. ఆ నవ్వులు కూడా చూడండి 1000 ఓల్ట్ బల్బుల మాదిరి నవ్వుతున్నారు.
ఇది అమలాపురం. సేమ్ మోడల్ షాపులు. మెషీన్‌తో సహా దొరికారు. కానీ, ఇది పాలకొల్లు.. ఇది ఏలూరు, ఇది రేపల్లె, ఇది నెల్లూరు.. కుటీర పరిశ్రమ మాదిరి ఏకంగా, ప్రతిచోట నడిపిస్తా ఉన్నారు. ఇక్కడే నేను చెప్తా ఉన్నా.. వీరిదే రాష్ట్ర ప్రభుత్వం, కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు రాష్ట్రవ్యాప్తంగా పెట్టిందీ వీళ్లే,, వీళ్ల మనుషులే. వీరివే లిక్కర్ షాపులు, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, వీరివే బెల్ట్ షాపులు, వీరివే పర్మిట్ రూములు. గమనించండి ఒకసారి.
ప్రభుత్వం వీరిదే, పోలీసులు వీళ్లవారే, మానుఫ్యాక్చరింగ్ వీరిదే, డిస్ట్రిబ్యూషన్ వీరిదే. నేను అడుగుతా ఉన్నా. వీళ్ల రెడ్ బుక్ పాలనలో వీళ్లు కాక ఇంకెవరైనా నడిపే ధైర్యం ఉందా? నేను అడుగుతున్నా.
అన్యాయంగా జోగి రమేష్ అరెస్ట్:
మా జోగి రమేష్‌ను తీసుకుని పోయినారు పాపం. ఎంత అన్యాయం. నాకు అర్థం కాదు. ములకలచెరువులో జోగి రమేష్ చేయించినాడంట. తీసుకొనిపోయినారు. అది చేసిన వాడు జయచంద్రారెడ్డి అన్నవాడు ఇప్పటివరకు అరెస్ట్ కాలా. ఆయన తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ కేండిడేట్. వాళ్ల బావమరిది గిరిధర్ రెడ్డి అరెస్ట్ కాలా, వాళ్ల పీఏ రాజేశ్ ఇంతవరకు అరెస్ట్ కాలా.
ములకలచెరువులోనూ వీళ్లే, ఇబ్రహీంపట్నంలోనూ వీళ్లే, అనకాపల్లిలోనూ వీళ్లే, అముదాలవలసలోనూ వీళ్లే, ఇంక నేను చెప్పిన, ఇంతకుముందు చెప్పినవి చూసినవా ఈ పేర్లన్నీ,, నెల్లూరు దగ్గర నుంచి, ఏలూరు దగ్గర నుంచి, పాలకొల్లు దగ్గర నుంచి, రేపల్లె దగ్గర నుంచి అంతా ఎవరెవరు చేస్తా ఉన్నారో మీ అందరికీ కూడా కళ్ల ముందే కనిపిస్తా ఉంది. వీళ్లే తయారు చేస్తూ, వీళ్ల ప్రభుత్వంలో వీళ్లే ఉండి, వీళ్ల ప్రభుత్వంలో వీళ్లే తయారు చేస్తూ, వీళ్లే వీళ్ల కల్తీ మద్యాన్ని వీళ్ల డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ వీళ్ల షాపులు, వీళ్ల బెల్ట్ షాపులు, వీళ్ల పర్మిట్ రూముల ద్వారా వీళ్లే అమ్ముతూ తప్పుడు వాంగ్మూలాలతో,, అన్నీ వీళ్లే చేస్తూ కానీ తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు వీళ్లే క్రియేట్ చేస్తూ, వీళ్లకున్న అధికార దుర్వినియోగం చేస్తూ మా మాజీ మంత్రి జోగి రమేష్‌ను తీసుకునిపోయి వీటినంతా జోగి రమేష్ చేయిస్తున్నాడు అంటున్నారు. ఎక్కడికండీ ఇది. మీరు ఈ మాదిరిగా దీన్ని గనుక డెమోక్రసీలో పర్మిట్ చేస్తే రేపొద్దున్న ఎవడన్నా బతకగలుగుతాడా? ఒక మాజీ మంత్రి పరిస్థితే ఇది అన్నప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంది? చూడు అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను.
దొంగే.. దొంగా దొంగా అంటున్నాడు:
వీళ్లే దొంగ, వీళ్లే పోలీసులు, వీళ్లే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లు. వీళ్లదే ప్రభుత్వం, వీళ్లదే వ్యవస్థలు. వాస్తవంగా జరుగుతా ఉన్నదిదే. చివరికి జోగి రమేష్, జోగి రమేష్ తమ్ముడిని అరెస్ట్ చేసినారని వాళ్ల కొడుకు రాజకీయాల్లో, ఈ మధ్య కాలంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉద్యమం వీటిలో ఆయన పార్టిసిపెంట్ చేస్తున్నాడని, వాళ్ల కొడుకు యాక్టివ్ అయినాడని, వాళ్ల కొడుకుపై కూడా కేసు పెడతా ఉన్నారు. ఇదే లిక్కర్ కేసు. ఆ పిల్లోడికి మొన్న పెళ్లయింది పాపం. మీ వయసులో ఉంటాడు పాపం. యంగ్‌స్టర్. ఇంకా 30 ఏళ్లు రాలా. 25, 26, 27 ఉంటాయి పాపం. ఆ పిల్లోడిని కూడా దీంట్లోకి తీసుకువస్తున్నారు. కేవలం మొన్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ పిల్లాడు వాళ్ల నాయన ఆబ్‌సెన్స్‌లో ఆ పిల్లాడు కార్యక్రమాలు చేసినాడని. ప్రొజెక్షన్ కార్యక్రమాలు చేసినందుకు ఆ పిల్లాడిని ఇరికిస్తున్నారు.
మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్‌కు వేధింపులు:
రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఏ స్థాయిలో ఉంది అంటే.. మరో ఉదాహరణ చెప్తున్నా.. మాచర్లకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు, నాలుగుసార్లు ఎమ్మెల్యే ఆయన, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డిని ఒక కేసులో ఇరికించారు.
ఆ కేసు వివరాలు చూడండి. వీళ్ల హయాంలో అంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ల హయాంలో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ల గ్రూపుల తగాదాల వల్ల, వాళ్లు వాళ్లు కొట్లాడుకుని, వాళ్లు వాళ్లు చంపుకుంటే, ఆ కేసులో ఇరిక్కిచ్చేది మా ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే క్యాండేట్‌ను, మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండేట్‌ను ఇరికిస్తా ఉన్నారు.
ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? టీడీపీలో రెండు వర్గాల మధ్య శతృత్వం వలన ఈ ఘటన జరిగితే, ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ, అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే, ఈ ఘటన జరిగినప్పుడు, ఘటన జరిగిన రోజో, మరుసటి రోజో ఎస్పీ పోయి, స్థానిక ఎస్పీ పోయి, ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా ఏమన్నాడో ఒకసారి చూడండి మీరే.
(అంటూ ఆ వీడియోను కూడా ప్రదర్శించి చూపారు)
టీడీపీ హయాంలోనే.. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా ఏమి మాట్లాడారో మీరే చూడండి.
‘గుండ్లపాడు గ్రామానికి చెందిన జె.వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య, జె.కోటేశ్వరరావులను బ్లాక్ స్కార్పియోలో గుద్ది..చంపడం జరిగింది. చనిపోయిన వారికి తోట చంద్రయ్య కుటుంబంతో ఎటువంటి బంధుత్వం లేదు. ఇద్దరూ టీడీపీ వారే. ఈ ఘటనకు కారణాలు, బాధ్యులను పట్టుకోవడానికి ప్రత్యేక టీములు ఏర్పాటు చేయడం జరిగింది‘.
చంపిన వాళ్లు, చంపబడిన వాళ్లు టీడీపీ వారేనని ఏకంగా ఆ జిల్లా ఎస్పీ ట్వీట్ చేశారు. మరుసటి రోజు ఈనాడు పేపర్ లో కూడా అదే రాశారు. మీరే చూడండి. ‘ఆధిపత్య పోరులో ఇద్దరు టీడీపీ నేతల దారుణహత్య. పల్నాడు జిల్లాలో ఘటన.. మాటేసి.. కారుతో దాడి. పల్నాడు జిల్లాలో ఆధిపత్య పోరుకు ఇద్దరు టీడీపీ నేతలు బలయ్యారు. అదే పార్టీకి చెందిన ఇద్దరు వారిని దారుణంగా హత్య చేశారు. ఇది ఎస్పీ ట్వీటు, మరోపక్క వారి గెజిట్ పేపర్.
అయినా ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు అరెస్టు. ఎక్కడండి న్యాయం. ఎక్కడన్నా న్యాయం ఉందా? ధర్మం ఉందా? అసలు. ట్విస్ట్ చేసి.. తప్పుడు కేసులు పెట్టి..పిన్నెల్లిని ఇరికించి ఇబ్బందులు పెడుతున్నారు. అంతకు ముందు ఎన్నికల సమయంలో రిగ్గింగ్‌ను అడ్డుకున్నందుకు 54 రోజులు ఇదే రామకృష్ణారెడ్డిని జైల్లో పెట్టారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ 18 నెలల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 16 అక్రమ కేసులు పెట్టారు.
విశాఖలో విద్యార్థి నాయకుడిపై..!:
అసలు చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత దారుణంగా ఉందంటే.. విశాఖపట్నంలో మా పార్టీకి చెందిన కొండారెడ్డి అనే విద్యార్థి నాయకుడిని ఇదే మాదిరిగా దొంగ కేసులో అరెస్టు చేశారు. ఆశ్చర్యం ఏంటంటే. స్టూడెంట్ అని కూడా చూడకుండా గంజాయి కేసు పెట్టారు. రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామని ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆశ్చర్యమేంటంటే.. కొండారెడ్డి తన ఇంటిదగ్గరే ఉన్న టిఫిన్ సెంటర్‌కు వెళుతుండగా, మద్దిలపాలెం వద్ద అడ్డగించి మరీ అదుపులోకి తీసుకున్నట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయింది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లినట్లు ఫుటేజీ ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. పోలీస్ Ü్టషన్‌లో ఆ పిల్లాడిని పెట్టుకుని, అతని బైక్‌ను 14 కి.మీ. తీసుకుపోయారు. రైల్వే న్యూ కాలనీలోకి. ఆబైక్‌కు జీపీఎస్ ట్రాక్ ఉంది కాబట్టి 14 కి.మీ. తీసుకువెళ్లినట్లు జీపీఎస్ ద్వారా ట్రాక్ అయింది. పోలీసు స్టేషన్ నుంచి అక్కడికి తీసుకువెళ్లి అక్కడ గంజాయి దొరికిందని చెప్పి ఆ పిల్లాడిని అరెస్టు చేశారు.
ఈ మాదిరిగా చేస్తే వ్యవస్థలు బతుకుతాయా? ఒక చిన్నపిల్లాడిని పట్టుకుని ఇరికించే కార్యక్రమం చేశారు. జీవితాన్ని నాశనం చేస్తున్నామన్నా చిన్న అపరాథ భావం కూడా లేకుండా.. దిస్ ఈజ్ రెడ్ బుక్ రాజ్యాంగం.
లేని లిక్కర్ స్కామ్. అక్రమ అరెస్టులు:
వీళ్లే కాకుండా, ఇప్పటికే మా పార్టీకి చెందిన ఎంతో మందిని అన్యాయంగా జైళ్లకు పంపించారు. లేని లిక్కర్ కేసును సృష్టించారు. నిజానికి చంద్రబాబు ఇప్పటికే లిక్కర్ కేసులో బెయిల్‌పై ఉన్నాడు. ఆ కేసును నీరు గార్చేందుకు.. తన పాలసీ వల్ల తాను రాష్ట్రం నాశనం అయిపోయి లూటీ చేశాడన్న కేసు ఏదైతే ఆయనపై ఉందో.. దాన్ని నీరు గార్చేందుకు మధ్యలో ఉన్న మా గవర్నమెంట్ పాలసీని తప్పుగా చూపించేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నాడు. ఎందుకంటే.. నాటి తన పాలసీనే చంద్రబాబు ఇప్పుడు కూడా అమలు చేస్తున్నాడు. ఇప్పుడు అమలు చేస్తున్న పాలసీని జస్టిఫై చేసుకోవడానికి.. అప్పుడు తనపై పెట్టిన కేసును కొట్టివేయించడానికి.. మధ్యలో ఉన్న పాలసీని తప్పుగా చూపించే కార్యక్రమం చేస్తున్నాడు.
ఆయనది ప్రైవేటు షాపులు, ప్రైవేటు మాఫియా.. ప్రైవేటు కథ.. మనది ప్రభుత్వ షాపులు, రిస్ట్రిక్టెడ్ టైమింగ్, అన్నీ రిస్ట్రిక్షన్స్. ఈ పాలసీ మళ్లీ తీసేశాడు. మళ్లా ప్రైవేటుకు వచ్చేశాడు. మళ్లా డిస్ట్రిబ్యుషన్ ఆయనదే.. మాన్యుఫాక్చరింగ్ ఆయనదే.. అన్ని స్కాములు ఆయనవే.. దాన్ని జస్టిఫై చేసుకోవడానికి.. మధ్యలో లేని లిక్కర్ స్కామును ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాడు. లేని లిక్కర్ స్కామును సృష్టించి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని లోపలేశారు. మిథున్ రెడ్డిని లోపలేశారు. మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తూ జడ్జి రాసిన జడ్జిమెంట్ కాపీని ఒకసారి చదవండి. ఎంత ఇదిగా జడ్జి రాశారంటే.. అసలు మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారో? ఆయనకు ఏం సంబంధమో?అని ఏకంగా జడ్జి కూడా ఆశ్చర్యపడి రాసే పరిస్థితి.
అలా లేని లిక్కర్ కేసును సృష్టించి చెవిరెడ్డిని, మిథున్ రెడ్డిని, రిటైర్డ్ అధికారులు కృష్ణమోహన్ రెడ్డిని, ధనుంజయరెడ్డిని, ఎంఎన్‌సీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను, రాజ్ కసిరెడ్డిని నిర్బంధించారు. లేని స్కామును ఉన్నట్లుగా చూపించడం కోసం..
రూ.11 కోట్ల డ్రామా:
ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. రూ.11 కోట్ల డబ్బులు దొరికినట్లుగా చూపిస్తున్నారు. ఈ బాధితులు కోర్టులో పిటిషన్ వేశారు. ఆ రూ.11 కోట్లపై ఉన్న నోట్ నంబర్ల ద్వారా ఏ బ్యాంకులో డ్రా చేశారో.. ఎప్పుడు డ్రా చేశారో.. వివరాలు చెప్పండి అని పిటిషన్ వేసే సరికి వారందరికీ వణుకు స్టార్ట్ అయింది.
మామూలుగా రెడ్ హ్యాండెడ్‌గా డబ్బులు దొరికితే వాటిని పక్కన పెడతారు కదా? వీళ్లేమంటున్నారు. పక్కన పెట్టలేదు. అన్నీ కలిపేశామంటున్నారు. అంటే ఆ డబ్బు వివరాలు బయట పడితే. .అవి ఇంజినీరింగ్ కాలేజీ డబ్బులు అని తెలుస్తాయని, అతనికి ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఆయన గోడౌన్ లో డబ్బులు దొరికాయంటే అవి ఇంజినీరింగ్ కాలేజీల డొనేషన్ల డబ్బు అనే విషయం తెలుస్తుందని.
అందుకే అది తెలియకుండా...దానికి లిక్కర్ అని బ్యాండ్ వేసి రూ.11 కోట్లు డబ్బులు వీళ్లే పెట్టి...ప్లాంట్ చేసి కేసులు బిల్డ్ చేస్తున్నారు. ఏ స్థాయికి పోతున్నారంటే వీళ్లు.. భాస్కర్ రెడ్డి పరిస్థితి అంతే..మిథున్‌రెడ్డి పరిస్థితి అంతే.. ఈ రిటైర్డ్ అధికారుల పరిస్థితి ఇంతే.. అందరినీ తీసుకుపోయి వేధిస్తున్నారు.
దొంగ కేసులు. దొంగ సాక్ష్యాలు:
కాకాణి గోవర్ధన్‌రెడ్డిని, వల్లభనేని వంశీని, పినిపే శ్రీకాంత్ .. వీళ్లందరిపైనా ఇలాంటి దొంగ కేసులు.. వీళ్లే దొంగ సాక్ష్యాలను సృష్టిస్తున్నారు. వీళ్లే అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తున్నారు. వీళ్లదే ప్రభుత్వం, వీళ్లే ఇరికిస్తున్నారు. వీళ్లే కాదు చివరికి పోసాని కృష్ణమురళి వంటి సామాన్యులు, కొమ్మినేని శ్రీనివాసరావు వంటి సీనియర్ జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై గంజాయి కేసులు పెడుతున్నారు.
సాక్షి పై కక్ష సాధింపు:
వీళ్ల రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా జరుగుతుందంటే.. సాలూరులో మంత్రి సంధ్యారాణి సతీష్ .. వేధిస్తున్నాడని చెప్పి మండల ఆఫీసులో పని చేస్తున్న ఒక అటెండర్ మహిళ.. సతీష్ తనకు పంపిన వాట్సాప్ మెసేజ్‌లు తీసుకుని ఫిర్యాదు చేసింది. వాట్సాప్ మెసేజ్‌లను ఆధారాలుగా చూపిస్తే.. బాధ్యత గల ప్రభుత్వమైతే ఏం చేయాలి? పీఏని బొక్కలో వేయాలి కదా? ఆ మండలాఫీసులో పని చేస్తున్న మహిళ.. తనను హెరాస్ చేస్తూ పీఏ పంపిన మెసేజ్‌లు చూపిస్తోంది. ఒక మహిళను అబ్యూజ్ చేస్తా.. నాతో పడుకుంటావా? ఇంకొకడితో పడుకుంటావా? అంటూ ఇలాంటి గలీజు మాటలన్నీ మాట్లాడుతూ.. ఒక మంత్రి పీఏ ఇలాంటివి చేస్తే ఏం చేయాలి. జైల్లో పెట్టాలి కదా? ఆ మాట దేవుడెరుగు. కనీసం అరెస్టు చేయకపోగా, కేసు కూడా పెట్టలేదు. దీంతో ఆమెకు దిక్కు తోచక ఎవరో జర్నలిస్టులకు చూపిస్తే.. సాక్షి పేపర్ లో రాస్తే.. అంతే, రాసిన సాక్షి విలేకరిపై కేసులు. ఇంక ఎక్కడికి పోతున్నాం.?
టీటీడీ లడ్డూ వ్యవహారం. దారుణం:
మరోవైపు ఏకంగా దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు. టీటీడీ వేదికగా. నిజంగా వెంకటేశ్వరస్వామి.. ప్రసిద్ధి గాంచిన గుడి అంటే టీటీడీ.. ప్రపంచ వ్యాప్తంగా ఆ గుడికి ఒక ప్రతిష్టత ఉంది. అలాంటి వెంకటేశ్వరస్వామి గుడిని చంద్రబాబునాయుడు పుణ్యాన నిజంగా ఎంత అభాసుపాలు చేస్తున్నాడన్న దానికి నిదర్శనాలు ఇవన్నీ.
వీటికి సమాధానం ఉందా?:
నేను అడుగుతున్నా ఇదే చంద్రబాబు కక్ష రాజకీయాలను చూస్తూ అడుగుతున్నా..
అయ్యా చంద్రబాబూ.. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, ఆ నెయ్యి అడ్డూలో కలిసిందని, ఆ లడ్డూలు భక్తులు తిన్నారంటూ దేవుడంటే భయమూ, భక్తీ లేకుండా మాట్లాడారు. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని, ఆ లడ్డూలు భక్తులు తిన్నారని దేవుడంటే భయమూ, భక్తీ లేకుండా చంద్రబాబు మాట్లాడారు. ఇలా చెప్పడానికి ఆధారాలు దొరికాయా? అని చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా. కల్తీ నెయ్యి ఆరోపణలున్న ఆ ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్లాయా? దీనికి ఆధారాలు ఉన్నాయా?
ఎందుకంటే టీటీడీలో ఒక రోబోస్ట్ ప్రొసీజర్ ఉంది. టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా ఎన్‌ఏబీఎల్ (నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబరేషన్ ల్యాబ్) సర్టిఫికేషన్ తోనే రావాలి. ఇది రూల్. మ్యాండేటరీ. ఈ సర్టిఫికెట్ లేకుండా తిరుపతిలోపలికి రాకూడదు.
తర్వాత టీటీడీలో ఈ ఎన్‌ఏబీఎల్ సర్టిఫికెట్ ఒక్కటే ఒప్పుకోరు. ఇది ప్రొసీజర్లో పార్ట్. టీటీడీలో ఒక సొంత ల్యాబ్ ఉంది. ఆ సొంత ల్యాబులో కూడా మళ్లీ టెస్టు పాస్ కావాలి. ప్రతి ట్యాంకర్ పాస్ కావాలి. ఆ తర్వాతనే ట్యాంకర్ లోపలికి పోవడానికి అనుమతి ఇస్తారు.
ఎన్‌ఏబీఎల్ సర్టిఫికెట్, వీళ్ల సొంత ల్యాబ్ పాస్ సర్టిఫికెట్. ఈ రెండూ ఉంటేనే ట్యాంకర్ లోపలికి పోతుంది. ఈ స్టాండర్స్ లేకపోతే రిజెక్ట్ చేసి ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారు. ఇదే కార్యక్రమం. ఈ టెస్టింగ్లో ఫెయిల్ అయినప్పుడు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించే కార్యక్రమం గతంలో చంద్రబాబు హయాంలో 15 సార్లు వెనక్కి పంపించారు. వైయస్సార్ సీపీ హయాంలో 18 సార్లు వెనక్కి పంపించారు. ఇదొక రొటీన్ ప్రొసీజర్. రోబోస్ట్ ప్రొసీజర్ ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. వ్యవస్థ యాక్టివ్‌గా పని చేస్తోందని చెప్పడానికి ఇవి ఉదాహరణలు.
తప్పుకు ఆస్కారం ఎక్కడుంది?:
ఇంత రోబోస్ట్ ప్రోటోకాల్ ఉన్నప్పుడు తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను. ఇదే చంద్రబాబునాయుడు హయాంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీ ఈవో ప్రెస్‌మీట్‌లో చెప్పిన మాటలు వినండి.
(అంటూ టీటీడీ ఈఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడినవి పీపీటీలో ప్రదర్శించి చూపారు)
క్లియర్ కట్‌గా సెప్టెంబర్ 20, 2024న వాళ్ల ప్రభుత్వ హయాంలో వాళ్ల ఈవో అన్న మాటలు. ఆ 4 ట్యాంకర్లను టోటల్ గా టెస్టులు పాస్ కానందువల్ల రిజెక్ట్ చేసి వెనక్కి పంపించామని చంద్రబాబునాయుడు గవర్నమెంట్లో ఆయన ఈవో అన్న మాటలు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హయాంలో అదే రీతిలో జూలై నెలలో 4 ట్యాంకర్లు తిప్పి పంపారు. రోబోస్ట్ ప్రొసీజర్ ను మరొక్కసారి చూపిస్తూ.
కాగా ఆ ట్యాంకర్లు ఆగస్టులో మళ్లీ తిరిగి వచ్చాయంటున్నారు. మరి అప్పుడు ఎవరు సీఎం? ఆయనే కదా? ఎవరిది ప్రభుత్వం? ఆయనదే కదా?.
అదే నిజమైతే ఎవరిపై చర్య తీసుకోవాలి?:
మళ్లీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని, లడ్డూ ప్రసాదంలో వాటిని వాడారని, మొన్న రిమాండ్ రిపోర్టులో సిట్ రాసింది. మరి ఎవర్ని బొక్కలో వేయాలి? ఇదే నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఇవి ఎలా రాగలిగాయి. అలా వచ్చిన ఆ వెహికల్స్ నిజంగా చంద్రబాబు చెప్పినట్టుగా ఒకవేళ వాడి ఉంటే అది నిజమే అయితే, మరి అది చంద్రబాబునాయుడు వైఫల్యం కాదా? ప్రస్తుత టీటీడీ చైర్మన్, ఆ పీరియడ్ లో ఉన్న టీటీడీ ఈవో, వాళ్లిద్దరూ ఏమి చేస్తున్నారు? వాళ్లిద్దరినీ ఎందుకు అరెస్టు చేయలేదు? ఎవరి టైమ్ లో జరుగుతోంది ఇది?
ఇప్పుడు ఉన్నది మరి చంద్రబాబు ప్రభుత్వం కాదా? మీ హయాంలో మీ అప్పటి ఈవో మీద, మీ అప్పటి టీటీడీ చైర్మన్ మీద ఎందుకు కేసు పెట్టలేదు? మరి ఎవరి మీద నిందలు వేస్తున్నారు?
దేవుడంటే భయమూలేదు, భక్తీ లేదు, దుర్మార్గమైన అసత్యాలు. వీళ్ల సిట్ పని తీరు కూడా చెబుతా ఎలా పని చేస్తోంది అని. ఒక మనిషిని ఇరికించాలనే ఆరాటం, తపన, తాపత్రయంతో తప్పులు ఎలా దొర్లుతున్నాయో చెబుతా.
ఆ నెయ్యిలోనూ అంతా కల్తీయేనా?:
స్వచ్ఛమైన నెయ్యి రూ.320కే మీరు ఎలా సప్లయ్ చేయిస్తారు? అని చంద్రబాబునాయుడు, ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నలు వేశారు. నాణ్యమైన కిలో నెయ్యికి రూ.3 వేలు అవుతుందని ప్రకటనలు చేశారు. ఇదే ఈనాడు గజట్ పత్రిక అయితే నాణ్యమైన కిలో నెయ్యి కనీసం రూ.1000 నుంచి రూ.1600 అవుతుందని రాశారు.
మరి టీటీడీలో ఇవాళ నెయ్యి ఎంతకు కొంటున్నారు? రూ.3 వేలు ఇచ్చి కొంటున్నారా? రూ.1600 ఇచ్చి కొంటున్నారా? రూ.1000 ఇచ్చి కొంటున్నారా?
పోనీ 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఆ ఐదేళ్లూ కిలో నెయ్యి రూ.276 నుంచి రూ.314 వరకు కొన్నారు. మరి ఆ ధర రూ.320 కన్నా తక్కువ కదా? అలాంటప్పుడు ఆ నెయ్యి మొత్తం కల్తీదేనా? దీనికి చంద్రబాబునాయుడు సమాధానం చెప్పాలి.
బోలే బాబా ఎవరి హయాంలో వచ్చింది:
ఇంకోటి గమ్మత్తయిన విషయం చెప్పమంటారా? ఈ బోలేబాబా అని ఈ మధ్య కాలంలో పేరు విని ఉంటారు. ఎవడరా నాయనా అని నేను కూడా అనుకున్నాను. బోలే బాబా అనే డెయిరీ విషయంలో చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ఇది టీటీడీ బోర్డు మినిట్స్. 26 జూన్ 2018. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా...
(అంటూ ఆబోర్డు మినిట్స్ పీపీటీలో చూపి, చదివి వినిపించారు)
ఆ కంపెనీనే ఆ తర్వాత పేరు మారి బోలే బాబా అయింది. ఇది నిజంగా గమ్మత్తయిన విషయమే కదా?
నెయ్యి సేకరణ. పక్కా వ్యవస్థ:
తిరుమలకు నెయ్యిని అనేక కంపెనీలు సప్లయ్ చేస్తుంటాయి. సుమారు ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలుస్తుంటారు. ఎవరు తక్కువకు కోట్ చేస్తారో వారి దగ్గర నుంచి కొంటుంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రొసీజర్. పొలిటికల్ ఇన్ఫ్లూయెన్స్ ఉండదు, ఒకడు చేసేదీ ఉండదు, పెట్టేదీ ఉండదు, ఇంకోటి ఇంకోటి కూడా ఉండవు.
టెండర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్లకు ఎల్1 ఎవరుంటారో వారికి కేటాయిస్తారు. ఇందులో రాజకీయాలకు సంబంధం లేదు.
సప్లయ్ చేసిన కంపెనీ ఏదైనా అమల్లో ఉన్న రోబోస్ట్ ప్రోటోకాల్ ప్రకారం.. టెస్టులు చేస్తారు. వాళ్లు వచ్చేటప్పుడు ఎన్‌ఏబీఎల్ సర్టిఫికెట్ తీసుకొని రావాలి, దాంతో పాటు టీటీడీలోఉన్న ల్యాబులో టెస్టులు చేస్తారు, టెస్టుల్లో పాసయితేనే ఆ వెహికల్స్ లోపలికి పోతాయి.
అసలు సుప్రీంకోర్టును ఎవరు ఆశ్రయించారు?:
అసలు దుష్ప్రచారం ఆపండి, నిజాలు బయటకు రావాలి అని సుప్రీంకోర్టుకు వెళ్లింది ఎవరండీ? వైవీ సుబ్బారెడ్డి. తెలుగుదేశం వాళ్లు కాదు. మరి ఆయనమీద ఆరోపణలు ఏందండీ అసలు సెన్స్ ఉండాలి. హైదరాబాద్‌లో వైవీ సుబ్బారెడ్డిగారి ఇంటికి వెళ్లి చూడండి. ఆయన ఇంట్లో గోపూజ జరుగుతుంది. ఇదే వైవీ సుబ్బారెడ్డి గారు అయ్యప్ప మాల కనీసం 35–40 సార్లు వేసుకుని ఉంటాడు. గురుస్వామి కూడా అయ్యారు. 1978 నుంచి 35 నుంచి 40 సార్లు శబరిమల పోయి ఉంటాడు. ఏమి ఆరోపణలు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో మీకే తెలియదు.
‘సిట్’లో అంతా చంద్రబాబు మనుషులు:
అసలు సిట్ లో చంద్రబాబు వేసిన అధికారులు ఎవరో తెలుసా? ఒకరు కృష్ణయ్య సమీప బంధువు. గోపీనాథ్ జెట్టి.
(అంటూ ఎన్టీఆర్ ట్రస్టులో భువనేశ్వరితో ఆయన కలిసి ఉన్న ఫొటో చూపారు)జ
కృష్ణయ్య సమీప బంధువు ఈ గోపీనాథ్ జెట్టి. సిట్‌లో ఒక ఆఫీసర్. ఈ కృష్ణయ్య మీద చంద్రబాబుకు ఎంత ప్రేమ అంటే.. ఈయన రిటైర్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పెట్టుకోవడం అనేది కాక, ఇన్ని సంవత్సరాల తర్వాత స్టేట్ గవర్నమెంట్‌లో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్. ఇలాంటి స్వప్రయోజనాలున్న వ్యక్తి సమీప బంధువు వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్.
ఇంకో ఆఫీసర్ ఎవరు? డీఐజీ త్రిపాఠి. ఈ సర్వశ్రేష్ట త్రిపాఠి అనే వాడు ఎలాంటి వాడో నేను చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. పల్నాడు జిల్లాలో ఆయన క్రియేట్ చేసిన అల్లకల్లోలం ఇప్పటికీ కూడా ప్రజలు మర్చిపోలేదు. ఏ రకంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కోసం, భుజాన వేసుకుని తెలుగుదేశం పార్టీ కోసం పాకులాడాడు అని చెప్పి, ఆ తర్వాత చంద్రబాబునాయుడు ఇదే ఆఫీసర్ ను ఏ రకంగా పక్కన కూర్చోబెట్టుకుని డీఐజీ స్థానం ఇచ్చి, ఆయన చేస్తున్న మాఫియా కలెక్షన్లలో ఈయన కూడా ప్రముఖ ప్రధాన పాత్ర పోషిస్తున్న వ్యక్తి. ఈ త్రిపాఠి అనేవాడు. సిట్‌లో ఇలాంటి ఆఫీసర్లు.
అప్పన్న వీపీఆర్ పీఏ:
ఇంకా ఆశ్చర్యం.. ఈ మధ్య కాలంలో మీరంతా విని ఉంటారు, వైవీ సుబ్బారెడ్డి పీఏ అని. అసలు అప్పన్న ఎవడి పీఏ అని నేను అడిగారు. ఆయన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్) పీఏ. వీపీఆర్ ఎవరు? టీడీపీ ఎంపీ. ఆయన దగ్గర నుంచి అప్సన్న ప్రతి నెలా శాలరీ తీసుకుంటున్నాడు. ఆ తర్వాత ఏపీ భవన్ ఉద్యోగి కూడా. మరి ఎక్కడ వైవీ సుబ్బారెడ్డి వచ్చాడు పిక్చర్ లోకి?
ఎందుకు మాటిమాటికీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు ఎంతసేపూ వైవీ సుబ్బారెడ్డి పీఏ అని గోబెల్స్ ప్రచారం చేస్తూ డ్రిల్ చేస్తున్నారు?. ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఒక సిస్టమాటిక్ పద్ధతిలో వ్యవస్థలు కూడబలుక్కుని ఇరికించే కార్యక్రమంలో ఏ రకంగా వీళ్లంతా దిట్టలు అని చెప్పడానికి నిదర్శనాలు.
జరుగుతన్నవన్నీ టీడీపీ హయాంలోనే!:
అన్నింటికన్నా ఆశ్చర్యం. ఇవన్నీ జరిగింది ఎప్పుడు? ఈయన ముఖ్యమంత్రిగా ఈయన ప్రభుత్వంలో జరుగుతున్నవి. ఇవన్నీ టీటీడీలో జరుగుతున్నాయి. రిజెక్ట్ చేసినవి నెల తర్వాత ట్యాంకర్లు వచ్చాయని వీళ్లే అంటారు, మరి అప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఏరకంగా రిజెక్ట్ చేశారు, మీరే యాక్సెప్ట్ చేసినట్లు మీరే రాసుకుంటున్నారు. దాని అర్థం ఏమిటి?
పరకామణి చోరీ కేసు.
టీటీడీకి మేలు చేస్తే నేరం అవుతుందా?:
ఈ పరకామణి కేసు నిజంగా ఆశ్చర్యం కలిగించే కేసు. ఈ కేసు ఏంటని చూస్తే.. ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ, చిన్న చోరీ 9 అమెరికన్ డాలర్ల నోట్స్. మన కరెన్సీలో వాటి విలువ దాదాపు రూ.72 వేలు. ఆ దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. రూ.72 వేలు విలువ చేసే 9 అమెరికన్ డాలర్లు చోరీ చేస్తుండగా, ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా..? దీనికి ప్రాయశ్చితంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు రూ.14 కోట్లు విలువైన వారి ఆస్తులను దేవుడికి ఇవ్వడం తప్పు అవుతుందా..?
పోనీ, దేశంలో అనేక చోట్ల.. అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి. కానీ, ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా..?
ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. తిరుపతి కోర్టులో చార్జిషీట్ వేశారు. మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు. అన్నీ కోర్టుల పరిధిలో ప్రాపర్ కోర్టు ప్రొసీజర్‌తో జరిగాయి. జ్యుడీషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. ఇందులో సాంకేతిక పరమైన అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు తప్పులేదు. కానీ, రాజకీయాల కోసం ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నాడనో.. భూమన కరుణాకర్‌రెడ్డి ఉన్నాడనో.. వారి మీద బురదజల్లాలని తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చేలా, ఇవ్వాలని అక్కడ పనిచేస్తున్న బీసీ పోలీస్ అధికారిని వేధించి, వెంటాడి, బెదిరించి, చివరకు ఆయన చనిపోయేలా చేసి, ఆ మరణానికి ఎవరో కారణం అంటూ ఎల్లో మీడియా చేత ఫేక్ కథనాలు రాయించడం ఎంత వరకు సమంజసం, ఎంత వరకు ధర్మం. మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని అడుగుతున్నా..
ఆ దొరికిన దొంగ జీయర్ స్వామి మఠంలో క్లర్క్‌గా 30 ఏళ్ల నుంచి పని చేస్తున్నాడు. పరకామణి లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాడు. కొత్తగా మా ప్రభుత్వంలో వచ్చిన వ్యక్తి కాదు. మరి చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఎందుకు పట్టుకోలేకపోయారు.. ఆ దొంగను మేము పట్టుకున్నాం.. మీరెందుకు పట్టుకోలేకపోయారు చంద్రబాబును సూటిగా ప్రశ్న అడుగుతున్నా.
పరకామణిని పటిష్టం చేసిందెవరు?:
చంద్రబాబును ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నా.. మేము వచ్చాక తిరుమల హుండీ డబ్బును లెక్కింపు ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేయగలిగాం. ఏకంగా దేవుడి సొమ్ము దొంగలపాలు కాకూడదని రూ.23 కోట్లు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టాం. అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశాం. దాన్ని సీఎం హోదాలో నేను ప్రారంభించాను. 2023 ఫ్రిబవరి 5 నుంచి ఆ బిల్డింగ్ పూర్తి స్థాయి ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యాయి. పాత భవనంలో అరకొర సీసీ కెమెరాలు ఉండేవి. రికార్డింగ్ క్వాలిటీ కూడా తక్కువే. బ్లయిండ్ స్పాట్స్ ఎక్కువ. వాటిని అన్నింటినీ మారుస్తూ కొత్త భవనంలో 360 డిగ్రీస్ కవరేజ్‌తో 4కే హెచ్‌డీ సీసీ టీవీ వ్యవస్థలు, హైబ్రీడ్ నైట్ విజన్ కెమెరాలు, ఎక్కువ రోజులు డేటా ఉండేలా మల్టీ టీమ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ తీసుకువచ్చాం. ఇవన్నీ చేసిన తరువాత ఏప్రిల్ 4, 2023లో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు మంచివారు. ఇంత గొప్ప వ్యవస్థను సష్టించినందుకు మాపై నిందలా..?
దశాబ్దాలుగా ఇదే పనిచేస్తున్నాడని అనుకోవచ్చు. చంద్రబాబు హయాంలో ఎవరూ పట్టుకోలేదు. జరిగించారు. జరుగుతుంది. మా హయాంలో పట్టుకున్నాం. గతంలో ఏం జరిగిందో దేవుడికి తెలుసు. 9 నోట్లతో దొరికాడు. రూ.72 వేల విలువ. ఏకంగా రూ.14 కోట్ల ఆస్తి దేవుడికి ఆ కుటుంబం రాసిచ్చింది. మీరంతా ఏం చేస్తున్నారు స్వామీ.
న్యాయవ్యవస్థను కించపర్చేలా మాటలు!:
పైగా, వర్ల రామయ్య అనే టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్.. ఆయన చేత చంద్రబాబు మాట్లాడిస్తున్న మాటలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో తెలుసా.. ఒక్కసారి వినండి
(అంటూ ఆయన మీడియాతో మాట్లాడిన వీడియో ప్రదర్శన)
చంద్రబాబునాయుడు ఆయన పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్‌తో మాట్లాడిస్తున్న మాటలు ఇవి. ఏకంగా న్యాయవ్యవస్థ మీద చంద్రబాబు దాడి చేస్తున్నాడు. తిరుపతి జడ్జి మీద, లోక్ అదాలత్ జడ్జి మీద, వీరిద్దరికి పై నుంచి ఒక సుప్రీం కోర్టు పెద్ద జడ్జిగారు ఒత్తిడి తెచ్చారట. ఆయన మీద కూడా మాట్లాడుతున్నాడు. పెద్ద జడ్జిల గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు ఒక మంచి పరిష్కారంలో భాగస్వామ్యం అవ్వడం, పరిష్కారం చూపించడం తప్పా.. అని నేను అడుగుతున్నా.
దాంట్లో రాజకీయం ఎందుకు?:
తిరుమలకు పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తుంటారు. ఇలాంటి కేసులు ఏమైనా జరిగినప్పుడు తిరుపతిలో ఉన్న జడ్జిలు సుప్రీం కోర్టు జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటారు. ఇలాంటి ఇంపార్టెంట్ కేసు.. దేశం మొత్తం చూస్తున్న కేసులో మీ సలహాలు ఇవ్వండి, ఎలా చేయాలి, ఏం చేయాలని అడుగుతుంటారు. జ్యుడీషియల్ పరిధిలో సలహాలు తీసుకుంటారు. ఏ తప్పు జరగలేదు, ఏ తప్పూ చేయలేదు కాబట్టి సలహాలు తీసుకొని, ఇంప్లిమెంట్ చేశారేమో.. దాంట్లో రాజకీయం చేయడానికి ఏముంది.
రూ.72 వేల విలువైన 9 డాలర్ నోట్లు దొరికితే, రూ.14 కోట్ల ఆస్తులు టీటీడీకి రాసిస్తే.. ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ జరగవు ఇలా. దానికి సంతోషపడాల్సిందిపోయి.. ఆ జడ్జిలపై నిందలు వేయడం, టీటీడీ ఆఫీసర్లను అనడం ఏంటీ.. ఏం చేస్తున్నారు..?
అంత న్యాయ నిపుణులు భాగస్వాములు అయ్యి, దేవుడికి, దేవుడి ఆలయానికి మంచి చేయడం కోసమే కదా.. వాళ్లంతా ఇన్వాల్వ్ అయ్యింది. దాంట్లో ఎవరి స్వార్థం ఉంది.. ఏం స్వార్థం ఉంది దాంట్లో.. అధికారులు, జడ్జిలు, మరొకరు గానీ, జ్యుడిషియల్ ఫాలో అయ్యింది.. నిజంగానే ఆస్తులు టీటీడీకి వచ్చాయి.
సింహాచలంలో ఆ పని ఎందుకు చేయలేదు?:
దీనికి తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఎలా ఉంటుందంటే.. ఈ ఏడాది సెప్టెంబర్ 1న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే హయాంలో.. సింహాచలంలో హుండీ డబ్బులు రూ.55 వేలు చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డారు. ఇది అన్ని పేపర్లలో వచ్చింది.
సింహాచలం ఎంతటి సుప్రసిద్ధ ఆలయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 1న సింహాచలంలో హుండీ డబ్బులు రూ.55 వేలు చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డారు. ఉద్యోగి రమణను సస్పెండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయి సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు కానీ, స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఇది జరిగిన వాస్తవం.
నేను అడుగుతున్నా.. ఎవరు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయమన్నారు? ఎందుకు జైల్‌లో పెట్టలేదు. మరి చంద్రబాబు నాయుడు దీనిపై ఎందుకు విచారణ చేయలేదు. మొత్తం వారిద్దరి ఆస్తులపై విచారణ చేసి, వాటిని మొత్తం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు..? పైగా సింహాచలం ఆలయానికి ధర్మకర్త ఎవరంటే.. తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతిరాజు. ఈయన ప్రస్తుతం గోవా గవర్నర్. ఆయనే సింహాచలం ఆలయానికి ధర్మకర్త.
ఏంది స్వామి ఇది.. ఒక్కోచోట ఒక్కోన్యాయం. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి చైర్మన్‌గా ఉంటే ఒక న్యాయం. అదే అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా ఉంటే ఇంకో న్యాయం. వాళ్లు మంచి చేసినా దాన్ని చెడు అంటారు.. వీళ్లు చెడు చేసినా దాన్ని మంచి అంటారు. మరి ఆయన మీద విచారణ ఎందుకు చేయడం లేదు.
ఎక్కడైనా న్యాయం ఒక్కటే కదా. సింహాచలంలోనూ, తిరుపతిలోనూ, సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి విషయంలోనూ, అశోక్ గజపతిరాజు విషయంలోనూ న్యాయం అనేది అందరికీ ఒకటే మాదిరిగా ఉండాలి.
టీడీపీ హయాంలోనే అక్రమాలు:
అసలు దేవుడి సొమ్మును స్కామ్ చేసిందెవరో చెప్తా. ఇదే టీటీడీలో తిరుపతిలో తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిలతీర్థం వరకు ఫ్లైఓవర్ 6 కిలోమీటర్లు. మీరంతా తిరుపతికి వెళ్తే ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది. శ్రీనివాస సేతు అని ఈ ఫ్లైఓవర్ పేరు. దీన్ని కట్టడానికి చంద్రబాబు గత గవర్నమెంట్‌లో ఒక ప్రతిపాదన చేశారు. 67 శాతం ఖర్చు టీటీడీ పెట్టాలని, 33 శాతం ప్రభుత్వం పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు.
చంద్రబాబు నాయుడు అప్పటి తిరుపతి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను పిలిపించుకొని, రూ.684 కోట్లతో కట్టేయమని చెప్పాడు. గమ్మతు ఏమిటంటే ఆ మీటింగ్‌లో టీటీడీ ప్రతినిధులు ఎవరూ లేరు. టీటీడీనే 67 శాతం డబ్బు ఇచ్చేది. అంత టీటీడీ నుంచి తీసుకోబోతున్నప్పటికీ, టీటీడీ వాళ్లు ఉండరు. కారణం ఏంటీ.. రహస్యం ఏంటీ..? బోర్డు అనుమతి, ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకుంటారు. తరువాత ఒత్తిడి తెచ్చి దాన్ని ఆమోదం తెలిపేందుకు అడుగులు వేస్తారు. ఇది స్కామ్ కనిపించడం లేదా..?
దీన్ని మన ప్రభుత్వం వచ్చిన తరువాత టీటీడీ బోర్డు రీవిజిట్ చేసి రూ.40 కోట్లు ఖర్చు తగ్గించారు. మరి రూ.40 కోట్లు మిగిలించారు కదా.. కొత్త బోర్డు రాకపోయి ఉంటే ఆ రూ.40 కోట్లు ఎవరి జేబుల్లోకి పోయేవి.
ఇక రెండో స్కామ్.. టీటీడీ డబ్బుల్లో 10 శాతం మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు. ఇది టీటీడీ రూల్. చంద్రబాబు హయాంలో కమీషన్లకు కక్కుర్తి పడి, చంద్రబాబునాయుడు గట్టిగా సిఫార్సు చేయడంతో రూ.1300 కోట్లు ఎస్ బ్యాంక్‌లో డిపాజిట్ చేశారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత మన బోర్డు ఈ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బును విత్ డ్రా చేసి జాతీయ బ్యాంక్‌లో ఆ డబ్బు పెట్టింది. పెట్టిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయ్యింది. ఒకవేళ చంద్రబాబు పెట్టిన రూ.1300 కోట్లు ఎస్ బ్యాంక్‌లోనే ఉండి ఉంటే ఆ డబ్బు ఏమయ్యేది.
అంత పక్కాగా దొరికినా రాజకీయం చేయలేదు:
మరి ఏది స్కామ్. ఇన్ని ఉన్నా కూడా, మాకు ఇవన్నీ తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాల్లో లాగకూడదని దీని జోలికి వెళ్లలేదు. సమస్య పరిష్కరించి, సరిదిద్దాం కానీ, రాజకీయం చేయలేదు. మన దేవుడిని మనం అభాసుపాలు చేసినట్టు అవుతుందనే ఉద్దేశంతో చేయలేదు. కానీ, ఇప్పుడు వీళ్లు చేసేవి చూస్తుంటే.. అసలు ఏమీ జరగకపోయినా, మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తూ, వీళ్లు రివర్స్ అబద్ధాలు చెబుతుంటే.. వాళ్లు చేసినవి రాజకీయం చేయకుండా వదిలేశాం.
టీటీడీ అనేది ఒక స్వతంత్ర వ్యవస్థ. అక్కడ బోర్డు మెంబర్స్ వివిధ రాష్ట్రాల నుంచి విశిష్ట ప్రఖ్యాత కలిగిన మనుషులు బోర్డు మెంబర్లుగా వస్తారు. ఎందరో సీనియర్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. కొన్ని శతాబ్దాలుగా బెస్ట్ వరల్డ్ ఓవర్ ప్రాక్టీస్ తిరుమల తిరుపతి దేవస్థానంలో చేస్తారు. అలాంటి ఆలయాన్ని, ఏకంగా దేవుడి ప్రతిష్టను మంట గలుపుతున్నామనే కనీస ధ్యాస కూడా లేకుండా, వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజారుస్తూ వీళ్లు చేస్తున్న రాజకీయాలు నిజంగా అత్యంత హేయమైన రాజకీయాలు.
సందట్లో సడేమియా..
దొంగచాటుగా కేసుల క్లోజ్:
ఇన్నిన్ని దుర్మార్గాలు ఒకవైపు చేస్తున్న చంద్రబాబు, మరోవైపు సందిట్లో సడేమియాలా తన మీద అవినీతి కేసులన్నీ దొంగచాటుగా క్లోజ్ చేయించుకుంటున్నాడు. ఇది బెయిల్ నిబంధనల ఉల్లంఘన కాదా?
చంద్రబాబు అనే వ్యక్తి ఈరోజు బెయిల్ మీద ఉన్నాడు. అలాంటప్పుడు ఇవన్నీ బెయిల్ నిబ«ంధనల యథేచ్ఛ ఉల్లంఘన కాదా? తానే దొంగ. తానే పోలీస్. తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్. తానే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తాను తన మీద కేసుల్ని విత్ డ్రా చేసుకుంటున్నాడు? మరి దీన్ని ఏమంటారు? కళ్ల ముందే ఈ బరితెగింపు కనిపిస్తోంది.
చంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను ఆయన బెదిరించి, వారిని భయపెట్టి, వారి చేత అబద్ధపు వాంగ్మూలాలను చెప్పించి, గవర్నమెంటుగా తానే పిటిషన్లు వేసి ఒక్కో కేసు మూసి వేస్తున్నాడు. కళ్ల ముందే కనిపిస్తోంది. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నాడు. ఇంత బరితెగించి చేస్తున్నాడు. దీని గురించి ఎల్లో మీడియా ఎప్పుడైనా రాసిందా, చూపించిందా, మాట్లాడారా? ఏమీ ఉండవు.
ఒక్కోటి కొండంత అవినీతి కేసు:
అసలు 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు చేసినవి ఆషామాషీ స్కాములు కావు. స్కిల్ స్కామ్ అనేది వందల కోట్లు బొక్కేసిన వ్యవహారం.
స్వయంగా ఆ ఫైళ్ల మీద చంద్రబాబు సంతకాలు చేసి డొల్ల కంపెనీలకు 370 కోట్లు ఇచ్చి సీమెన్స్ ఎండీనే చెబుతున్నాడు, ఆ డబ్బులు నాకు రాలేదు, నా కంపెనీయే కాదని. డొల్ల కంపెనీలకు ఈయనే స్వయంగా సంతకాలు పెట్టి ఫైల్ మూవ్ చేసి ఈయనే 370 కోట్లు ఇచ్చిన కేసు అది. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు ఈడీ అరెస్టులు చేశాయి. డొల్ల కంపెనీలు పెట్టిన వాళ్లను, డబ్బులు తీసుకున్నోళ్లను అరెస్టు చేశారు గానీ, డబ్బులు ఇచ్చినోడిని అరెస్టు చేయలేదు. డబ్బు పోయింది. తప్పని చెబుతున్నారు, డొల్ల కంపెనీలంటున్నారు, డబ్బు ఎత్తినోడిని అరెస్టు చేస్తున్నారు, డబ్బు ఇచ్చినోడిని అరెస్టు చేయలేదు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏందిదీ?
అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత కోర్టు చంద్రబాబును జైలుకు కూడా పంపింది.
రెండో స్కామ్.. అమరావతి అసైన్డ్ ల్యాండ్ స్కామ్. అసైన్డ్ భూములు ఎవరూ కొనకూడదు, ఎవరూ అమ్మకూడదు. ఇది చట్టం. ఈయన, ఈయన బినామీలు కొనడం, కొన్న తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేయడం.. ఇదొక స్కాము. అదే స్థాయిలో రింగు రోడ్డు అలైన్ మెంట్ స్కామ్, కరెక్టుగా ఆయన హెరిటేజ్ భూములకు వచ్చే సరికే ఇట్లా పక్కకు పోతుంది.
ఉచితం పేరుతో కోట్ల రూపాయల ఇసుక స్కామ్. మా హయాంలో సంవత్సరానికి రూ.750 కోట్లు గవర్నమెంటుకు వస్తే, ఐదేళ్లకు కలిపితే కనీసం రూ.3500 కోట్లు గవర్నమెంటుకు రావాల్సింది ఈయన ఉచితం పేరుతో గవర్నమెంటుకు రావాల్సిన రూపాయి రాకపోగా లెఫ్ట్, రైట్, సెంటర్ స్కామ్ చేశారు, ఈరోజు కూడా అదే శాండ్ స్కామ్ చేస్తున్నారు.
ఫైబర్ నెట్ స్కామ్ ఇంకొకటి, అర్హత లేని బ్లాక్ లిస్టులో ఉన్న తన అనుచరుడి కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టి వందల కోట్లు ఇచ్చిన స్కామ్ ఫైబర్ నెట్.
ఇంకో స్కామ్.. లిక్కర్ లో ఎమ్మార్పీ కన్నా అధిక రేట్లకు అమ్మి తన బెల్ట్ షాపుల ద్వారా, పర్మిట్ రూముల ద్వారా, తన మాఫియా సామ్రాజ్యం ద్వారా లిక్కర్ లో ఎమ్మార్పీ కన్నా అధిక రేట్లకు అమ్మి, క్యాబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి దాని మీద చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ ఇది.
నాటి నుంచి నేటి వరకు అదే విధానం:
ఇదే మోడెస్ ఆపరెండీ ఇప్పుడు కూడా జరుగుతోంది. ఇప్పుడు డిస్ట్రిలరీలకు ఆర్డర్లు ప్లేస్ చేసేది ప్రైవేట్ షాపులు, ప్రైవేట్ షాపులు ఎవరివి?చంద్రబాబు నాయుడు ఎవరికి చెబితే వారికి ఆర్డర్లు ప్లేస్ చేసే తన మాఫియా సామ్రాజ్యంలో భాగస్తులు. ఒక పక్క అట్లా, ఒక పక్క ఇట్లా.
కల్తీ మద్యం ప్రతి 5 బాటిళ్లకు ఒక బాటిల్ కల్తీ మద్యం, రెండో పక్క ఇట్లా.
ప్రజాధనాన్ని బొక్కేసిన ఈ గజదొంగను చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి కావాల్సిన అన్ని ఆధారాలు, సాక్షాలు ఉన్నా కూడా చంద్రబాబు తన అధికార బలంతో ఫిర్యాదుదారులైన అధికారుల్ని భయపెట్టి, బెదిరించి స్టేట్మెంట్లు విత్ డ్రా చేయించి, వాటిని కోర్టు ముందు పెట్టి, ఈ కేసులో ఏమీ లేదంటూ వ్యవస్థల్ని తప్పుదారి పట్టించి, రెఫర్ చార్జ్ షీట్ వేయించి మూసి వేయిస్తున్నాడు.
గతంలో కూడా సేమ్ మోడస్ ఆపరెండీ, ఏలేరు స్కామ్ తీసుకున్నా, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ బ్యాంకు అకౌంట్లను, ఆ పార్టీ గుర్తును లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన కేసు నుంచి, ఇవాళ్టి ఈ కేసు వరకు.. చట్టం ఒకవైపు, వ్యవస్థలు ఒకవైపు.. ఈ రెండూ చంద్రబాబుకు చుట్టాలుగా మారి రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఆ దిశలోనే మా పంథా:
నేను అడుగుతున్నా. వీటి అన్నింటి నుంచి ప్రజల్ని మభ్యపెడుతూ చంద్రబాబునాయుడు డ్రామాలు రక్తికట్టిస్తూ, గోబెల్స్ ను మించిపోతూ, తాను, తన ఎల్లో మీడియా గ్యాంగు చేస్తున్న దుష్ప్రచారాలను కొనసాగిస్తుండగా, చంద్రబాబు చేస్తున్న ఈ అన్యాయాలను వేలెత్తి చూపిస్తూ సాక్షాలు, ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రజల ముందు నాణేనికి ఇటువైపున వివరిస్తూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం చేస్తూ పోతామని శ్రీ వైయస్ జగన్ స్పష్టం చేశారు.
మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..
ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టుల ద్వారానే పోరాటం చేయగలుగుతాం. ఎండ్ ఆఫ్ ద డే.. పై నుంచి దేవుడు చూస్తుంటాడు, డెమోక్రసీలో ప్రజలు చూస్తుంటారు. దేవుడు, ప్రజలు వీళ్లే బుద్ధి చెప్పాలి.
అమరావతి గురించి మీరే చెప్పాలి. ఇంతకు ముందు అంతా చంద్రబాబు ఏమన్నాడు? 2014–19 మధ్య 53 వేల ఎకరాలు తీసుకుంటూ అసలు ఇది ఇంటర్నేషనల్ రాజధాని, సింగపూర్, గింగపూర్ యాడికి పోవాల్నో, మన దగ్గర నుంచే ఏదైనా కానీ, మన రాజధానిని చూసి వాళ్లు కాపీ కొట్టే పరిస్థితుల్లోకి దీన్ని బిల్డ్ అప్ చేస్తున్నాను అని మనకు బాహుబలి సెట్టింగ్స్ చూపించారు.
ఆ 53 వేల ఎకరాల్లో ఆయన రాజధాని కట్టింది ఎంత అంటే, రాజధాని కట్టడం కథ దేవుడెరుగు.. ఆ 53 వేల ఎకరాల్లో రోడ్లు వేయడానికి, కరెంటు ఇవ్వడానికి, డ్రెయినేజీ కనెక్షన్లు ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి.. వీటికే ఎకరాకు రూ.2 కోట్లు అవుతుందని తానే డీపీఆర్ ఇచ్చాడు. అంటే ఆ 53 వేల ఎకరాలకే లక్ష కోట్లు కావాలని ఆయన ఇచ్చిన డీపీఆర్లోనే రూ.5వేల కోట్లు పెట్టాడుసినిమా అంతా చూపిస్తూ.
మళ్లా ఈరోజు ఏం చేస్తున్నాడు? 53 వేల ఎకరాలు సరిపోదు అంటున్నాడు. కాగా, ఆ రోజేమో సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అన్నాడు, 8 వేల ఎకరాలు మిగిలింది, దాంతోనే రాజధాని అయిపోతుంది అన్నాడు.
మళ్లీ ఈరోజు ఏమంటున్నాడు?
అధికారంలో ఉంటే ఆయనకు స్కాములే గుర్తుకొస్తాయి. ఎవరెవరికి భూమి ఇవ్వాలి? ఎవరెవరి దగ్గర ఎంత పుచ్చుకోవాలి? చదరపు అడుగు నిర్మాణం రూ.4 వేలు అయ్యే దగ్గర రూ.10 వేలకు కాంట్రాక్ట్ ఇవ్వాలి. నేషనల్ హైవేలు కి.మీ రూ.25 కోట్లు అయ్యే చోట రూ.54 కోట్లు పెట్టి ఎలా దండుకోవాలి?.
ఇలా అన్నీ స్కాములే కాబట్టి రాజధానిలో పనులు నిరంతరం జరుగుతుండాలనేది ఆయన ఉద్దేశం. గతంలో తీసుకున్న 53 వేల ఎకరాలకే దిక్కులేదు. ఇంకో 53 వేల ఎకరాలు తీసుకోవడానికి రైతుల నుంచి వెనుకాడటం లేదు.
ఇక్కడ జరిగేది ఒక్కటే. ఈయన, ఈయన బినామీలు ముందుగానే ల్యాండ్ కొంటారు. కొన్న తర్వాత ఆ ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంటారు. ఆ తర్వాత తన బినామీలకు మాత్రం ప్లాట్లు ఇచ్చుకోవాల్సిన చోట ఇచ్చుకుంటాడు. మిగిలిన వాళ్లకు ప్లాట్లు వేరేచోట ఇస్తాడు. అక్కడ ఎప్పటికీ అభివృద్ధి జరగదు. అంటే మిగతా వాళ్లు గాలికి పోతారు వీళ్ల మనుషులు అంతో ఇంతో.. కొద్దోగొప్పో ఆ వేసిన రోడ్లు వాళ్ల దగ్గర వేసుకుంటారని శ్రీ వైయస్ జగన్ వివరించారు.