మోసానికి షర్ట్, ప్యాంట్‌ వేస్తే అది చంద్రబాబు

20 Feb, 2026 07:09 IST

తాడేపల్లి: ‘మోసానికి షర్ట్, ప్యాంట్‌ వేస్తే అది చంద్రబాబు.. అబద్ధానికి రెక్కలు తొడిగితే అవి చంద్రబాబు మాటలు’.. అని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తేల్చి చెప్పారు. చంద్రబాబు పాలనలో ప్రతి బడ్జెట్‌లోనూ ప్రజలకు వంచన, మోసమే అని, ఈ ఏడాది బడ్జెట్‌లోనూ అన్నీ తప్పుడు గణాంకాలు, మొత్తం కాకి లెక్కలు. పూర్తిగా అవాస్తవాలే అని  శ్రీ వైయస్‌ జగన్‌ ఫైర్‌ అయ్యారు. చంద్రబాబుది ఆర్థిక అస్తవ్యస్త నిర్వహణ అన్న ఆయన, రాష్ట్ర అప్పులపై పదే పదే అవే అబద్ధాలు చెబుతున్నారని, ఆదాయంలో దారుణ స్థితిలో మన రాష్ట్రం ఉందని, ‘కాగ్‌’ రిపోర్ట్‌ ప్రకారం దేశంలో 22వ స్థానం నిల్చిందని శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు.
    ఎన్నికల ముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇంటింటికీ బాండ్లు పంపి పచ్చి మోసం చేశారని, వాటిలో ఏదీ అమలు చేయకుండా వంచన, దగా చేశారని, చివరకు ఉద్యోగులకు కూడా భారీ మోసం చేశారని, రెండేళ్లుగా ఉద్యోగుల జీతాలు పెరగలేదని, వారికి ఐఆర్‌ ఇవ్వలేదని, పీఆర్సీ ప్రస్తావనే లేదని గుర్తు చేశారు.
    ‘చంద్రబాబు హ్యాబిట్యువల్‌ అఫెండర్‌’ అన్న శ్రీ వైయస్‌ జగన్, ఆయనకు మోసాలు కొత్త కానే కాదని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తేల్చి చెప్పారు.
    రాష్ట్ర వార్షిక బడ్జెట్, తిరుపతి లడ్డూ. ఇందాపూర్‌ డెయిరీ హెరిటేజ్‌ లింక్‌ అంశాలపై మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్, ఇంకా ఏమన్నారంటే..:

ప్రతి బడ్జెట్‌లోనూ వంచన. మోసం:
    సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా కూడా ఐదు బడ్జెట్‌లు ఉంటాయి. ఆ అవకాశాన్ని ప్రజలు ఏ ప్రభుత్వానికైనా ఇస్తారు. ఈ చంద్రబాబునాయుడుగారి ప్రజా వ్యతిరేక వెన్నుపోటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. దీంతో ఇంకా రెండు బడ్జెట్లు మాత్రమే మిగిలాయి. ఈ మూడు బడ్జెట్ల ద్వారా చంద్రబాబుగారు రాష్ట్రానికి,  ప్రజలకు ఏం మంచి చేశారని, చేస్తారని పరిశీలిస్తే ఎక్కడా మంచి కనపడదు. మోసమే కనిపిస్తుంది. ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడుస్తూ, వారిని వంచిస్తున్నారు.

మోసానికి ప్యాంట్, షర్ట్‌ తొడిగితే చంద్రబాబు:
    ఈ బడ్జెట్‌లోనూ చంద్రబాబు తాను ఇస్తానన్న సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌తో పాటు, మ్యానిఫెస్టో హామీలు పూర్తిగా గాలికెగిరిపోయాయి. అన్ని వర్గాలనూ మోసం చేస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇది. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ విషయంలో ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి, అబద్ధాలను కూడా రక్తి కట్టించారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలను నెరవేర్చకపోయినా పదే పదే అబద్ధాలు చెబుతూ.. సూపర్‌ హిట్‌ అంటూ నిస్సిగ్గుగా గోబెల్స్‌ ప్రచారానికి దిగారు.
    ‘మోసానికి షర్టూ, ప్యాంటూ వేస్తే చంద్రబాబు అవుతాడు’. అలాగే అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా అవే పచ్చి అబద్ధాలు. తప్పుడు లెక్కలు. లేని గొప్పలు. చంద్రబాబు భజన కనిపిస్తున్నాయి.

పబ్లిసిటీ పీక్‌. పర్ఫార్మెన్స్‌ వీక్‌:
    రాష్ట్ర ప్రగతి గురించి. ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి. వాస్తవ లెక్కలు చూస్తే అవి గడప కూడా దాటని పరిస్థితులు కనపడతాయి. చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్‌. ఫెర్ఫార్మెన్స్‌ వీక్‌. ఇదే చంద్రబాబు పాలనలో స్టాండర్డ్‌గా కనిపించే సత్యం.
    2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే జీఎస్‌డీపీ 11.75 శాతంగా చంద్రబాబు చెబుతూ వచ్చారు. అదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 9.8 శాతం మాత్రమేనని ఆయన తన ఆఫీసులో కూర్చుని అంకెలు రాసేస్తారు. అదే విధంగా 2025–26కు సంబంధించి రాష్ట్ర జీఎస్‌డీపీ గ్రోత్‌ రేట్‌ 10.75 శాతంగా గొప్పలు చెప్పుకుంటారు. అదే సమయంలో దేశ జీడీపీ గ్రోత్‌ రేట్‌ 8 శాతమే. మరి రాష్ట్రంలో గ్రోత్‌ రేట్‌ 10.75 శాతంగా నమోదైందని చంద్రబాబుగారు తన డబ్బాను తానే కొట్టుకుంటున్నారు. ఫ్యాబ్రికేటెడ్‌ నంబర్లతో తన డప్పు తానే కొట్టుకోవడం మనందరికీ కనిపిస్తుంది. 

ఒకవేళ ఆ గణాంకాలే వాస్తవమైతే..?:
    నేను ఒకటే అడుగుతున్నా. జీడీపీ, రాష్ట్ర వృద్ధి రేటు ఆ స్థాయిలో ఉంటే, నిజంగా రాష్ట్రం పురోగతిలో ఉందని అర్థం. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టార్లు పురోగతి సాధిస్తున్నాయని దాని అర్థం. వ్యవసాయ, పారిశ్రామిక, తయారీ, సేవల రంగాలన్నీ చాలా వేగంగా పరిగెడుతున్నాయని దాని అర్థం. మరి చంద్రబాబు చెప్పిన ఈ లెక్కలే నిజమైతే, జీఎస్‌డీపీలో గ్రోత్‌ రేట్‌ ఈ రకంగా ఉంటే, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం కూడా నిజంగా ఇదే రీతిలో పెరిగి ఉండాలి కదా? ప్రజల ఆదాయాలు పెరిగి ఉంటే వారి కొనుగోలు శక్తి కూడా పెరగాలి కదా?. తద్వారా ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయం కూడా పెరిగి ఉండాలి కదా?. ఇదంతా సైక్లికల్‌ కదా?. కానీ అది జరిగిందా?.

వాస్తవ ఆదాయాలు. గణాంకాలు పరిశీలిస్తే..:
    2024–25లో చంద్రబాబుగారి మొదటి సంవత్సరం. రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయం రూ.1,19,927 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో చెప్పారు. కానీ ఆ ఏడాది రాష్ట్రానికి నికరంగా వచ్చిన ఆదాయం కేవలం రూ.95,407 కోట్లు. అదే అంతకు ముందు ఏడాది, 2023–24లో అంటే వైయస్సార్‌సీపీ ప్రభుత్వ చివరి ఏడాదిలో రాష్ట్ర సొంత ఆదాయం (ఎస్‌ఓఆర్‌) రూ.93,354 కోట్లు. అంటే పెరుగుదల కేవలం 2.2 శాతం మాత్రమే. అలా, ఆ బడ్జెట్‌లో చంద్రబాబు లెక్కలు వేసిన రూ.1,19,927 కోట్లు గాలికెగిరిపోయాయి. 
    ఇక 2025–26లో కూడా బడ్జెట్‌ గారడీ చేస్తూ రాష్ట్ర సొంత ఆదాయాన్ని రూ.1,27,703 కోట్లుగా ప్రొజెక్టు చేశారు. కానీ ఈ జనవరి, ఫిబ్రవరి వరకు లెక్కేసుకుంటే, కాగ్‌ నివేదికల ప్రకారం çఈ పది నెలల్లో రాష్ట్రానికి వచ్చిన నికర ఆదాయం రూ.75,964 కోట్లు మాత్రమే. అదే గత ఏడాది.. 2024–25లో 10 నెలల్లో వచ్చిన ఆదాయం రూ.72,864 కోట్లు. అంటే పెరుగుదల కేవలం 4.25 శాతం. 
    మరి చంద్రబాబుగారు ప్రొజెక్ట్‌ చేసిన రూ.1,27,703 కోట్ల ఆదాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు సవరించినా, వాస్తవం చాలా దూరంలో ఉంది. ఈ ఏడాది బడ్జెట్‌ రివైజ్డ్‌ ఎస్టిమేట్‌లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.1,12,349 కోట్లుగా చెప్పారు. మరి 10 నెలల్లో కేవలం రూ.75,964 కోట్లు వస్తే, మిగిలిన ఉన్న 2 నెలల్లో అది ఏకంగా రూ.1,12,349 కోట్లకు ఎగబాకుతుందా? ప్రభుత్వం ఆశించినట్లు ఈ రెండు నెలల్లో రూ.36,385 కోట్లు వస్తాయా? అంటే ఈ ఫిబ్రవరి, మార్చిలో రూ18,224 కోట్ల చొప్పున ఆదాయం వస్తుందా? ఆ ప్రకారం 139 శాతం ఎస్‌ఓఆర్‌ రావాలి. ఇది అంకెల గారడీ కాక మరేమిటి? ప్రజలను తప్పుదోవ పట్టించడమే కదా?.
    నాకు తెలిసినంత వరకు ఈ పది నెలల కాలానికి రూ.75,964 కోట్లు వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో మిగిలి ఉన్న రెండు నెలలు కాలంతో కలిపి మొత్తం రూ.95 వేల కోట్లు వస్తే గొప్ప. 
    కానీ, ఈ పెద్ద మనిషి మళ్లీ 2026–27 వచ్చే సరికి ఏం చెబుతున్నాడు! రాష్ట్ర సొంత ఆదాయాన్ని (ఎస్‌ఓఆర్‌) ఏకంగా రూ.1,37,320 కోట్లుగా చూపుతున్నారు. అంటే అది ఏకంగా 45 శాతం పెరుగుదల. అది సాధ్యమేనా?. గత బడ్జెట్‌లో కూడా ఇలాగే చూపిస్తే, వచ్చిన వృద్ధి రేటు కేవలం 3.4 శాతం మాత్రమే.
    ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 2025–26లో మొదటి 9 నెలల పన్నుల ఆదాయాన్ని, 2023–24 మా చివరి ఏడాదితో పోలిస్తే.. ఈ రెండేళ్లకు సంబంధించిన సీఏజీఆర్‌ (వార్షిక వృద్ధి రేటు) కేవలం 1.97 శాతం మాత్రమే.

ఆదాయంలో అట్టడుగున ఆంధ్రప్రదేశ్‌:
    ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? కాగ్‌ డేటాను ఈ మధ్య కాలంలోనే అప్‌లోడ్‌ చేశారు. 23 రాష్ట్రాలున్న దేశంలో చంద్రబాబునాయుడు పరిపాలనలో ఉన్న మన రాష్ట్రం పరిస్థితి ఏమిటంటే, మనం 22వ స్థానంలో ఉన్నాం. అంటే చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నాం. అంటే రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర సొంత ఆదాయాలు, 2023–24 నుంచి ఇప్పటి వరకు రెండేళ్ల 9 నెలల్లో పెరుగుదల కేవలం 1.97 శాతం మాత్రమే. అలా దేశంలో అట్టడుగున 22వ స్థానంలో ఉన్నాం. చంద్రబాబునాయుడుగారి అసమర్థత, ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా?.
    సొంత ఆదాయాల విషయంలో రాష్ట్రాలతో పోల్చినా లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు చూస్తే 9.64 శాతం పురోగతి ఉంటే, మన రాష్ట్ర పురోగతి 1.97 శాతమే. అంటే మిగతా రాష్ట్రాలకు కనీసం దరిదాపుల్లో కూడా లేం. కానీ చంద్రబాబు ఏమంటారు? జీఎస్డీపీలో మనం దూసుకుపోతున్నాం. దేశంకన్నా ఇంకా పైస్థానంలో ఉన్నాం అంటాడు. 2024–25లో 11.75 శాతంతో దూసుకుపోతున్నాం. దేశం ఎంత 9.8 శాతమే అంటాడు. మళ్లా ఏమంటాడు 2025–26లో రాష్ట్రం 10.75 శాతంతో దూసుకుపోతున్నాం. దేశం ఎంత కేవలం 8 శాతంతో ఉంది అంటాడు. మనం కేవలం 1.97 శాతం వృద్ధిరేటుతో ఉంటే, జీఎస్డీపీ వృద్ది రేటు ఆయన చెప్పినట్లు ఏకంగా 11.75 శాతం, 10.75 శాతం ఏరకంగా నమోదవుతుంది? ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నాడు ఈ మనిషి?.

అంతా దోచుకో.తినుకో.పంచుకో:
    అసలు చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రానికి ఆదాయాలు రావడం లేదు. రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు తగ్గుముఖంలో ఉన్నాయి. పెరుగుదల మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎందుకు పెరగడం లేదు? కారణం రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు. పక్క దోవ పట్టి చంద్రబాబునాయుడి జేబులోకి ఇంత, ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలకు ఇంత, బినామీలకు ఇంత.. అందరూ పంచుకుంటున్నారు. దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టుగా. 
    రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇసుక, మట్టి, లిక్కర్, లేటరైట్, గ్రానైట్, లిక్కర్‌ మాఫియా. అంతా ఎక్కడికక్కడ దోపిడి. ప్రభుత్వ భూములు ఎడాపెడా నచ్చిన వారికి నచ్చిన రేటుకు ఎడాపెడా అమ్మే పరిస్థితి. ఇలా వనరులన్నింటినీ దోచేస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రావడం లేదు. 

ప్రత్యేక విమానాలు. జల్సాలు:
    మరోవైపు చూస్తే ఆయనొక (చంద్రబాబు) విమానం. ప్రత్యేక విమానంతో పాటు ఒక హెలికాప్టర్‌. ఆయన కొడుక్కో విమానం, హెలికాప్టర్‌. ఆ తర్వాత ఆయనకు మద్దతిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌గారికి ఒక విమానం, ఒక హెలికాప్టర్‌. అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రిగారి కొడుకు ఒకపూట విజయవాడలో ఉంటే మరోపూట హైదరాబాద్‌లో ఉంటారు. ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్‌ మ్యాచ్‌ కోసం పక్క దేశం వెళ్లి కొలంబోలో మ్యాచ్‌ చూస్తాడు రాత్రికి. మరుసటిరోజు ఉదయం విజయవాడలో ఉంటాడు. మళ్లీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతా ప్రైవేట్‌ విమానాలే.
    దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్లు ఇలా జల్సాలు, సంబరాలు చేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్‌ ఆడుతుంటే ఈయనేం స్వామీ నాకు అర్థం కావడం లేదు. ప్రైవేట్‌ ఫ్లైట్‌లో కొలంబోకు పోయి మ్యాచ్‌ చూస్తాడు. క్రికెట్‌ అభిమానివే అనుకో. టీవీలో చూస్తే కనపడదా?.

రాష్ట్ర అప్పులపై అవే గోబెల్స్‌ ప్రచారం:
    రాష్ట్ర అప్పుల విషయానికి వస్తే మళ్లీ అవే గోబెల్స్‌ ప్రచారాలు. చంద్రబాబునాయుడుగారి నైజం నిజంగా కుక్కతోక వంకరే. ఎన్నిసార్లు మనం చెప్పినా, ఎందుకయ్యా అబద్ధాలు చెబుతావు, వాస్తవాలు ఇవీ ఇదిగో వాస్తవాలు అని మనం ఎన్నిసార్లు ప్రజెంటేషన్లు ఇచ్చినా, సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్పినా అవే గోబెల్స్‌ ప్రచారాలు, అవే అబద్ధాలు. కుక్కతోక కూడా మీరు గమనించే ఉంటారు. దాన్ని కరెక్ట్‌ చేయడానికి ఇలా చేయండి అది మళ్లీ వెనక్కి వెళ్లిపోతుంది. అందుకే సామెత కూడా అంటారు కుక్కతోక వంకర అని. చంద్రబాబునాయుడుగారు కూడా అంతే. 
    మొన్నటి బడ్జెట్లో కూడా ఏకంగా రూ.9.74 లక్షల కోట్ల అప్పులు మేం మిగిల్చాం అంటారు. అసలు నిజాలేంటో తెలుస్తాయని, రాష్ట్రానికి సంబంధించిన అప్పులు రాష్ట్ర ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందో అని ఏకంగా బడ్జెట్‌ పేపర్స్‌లో అప్పులకు సంబంధించిన టేబుల్‌ వాల్యూమ్‌ నంబర్‌–6 బుక్‌లో ఉంటుంది. దాన్ని పూర్తిగా ఎత్తేశారు. 
    నేను చంద్రబాబును ఒక్కటే అడుగుతా. అయ్యా చంద్రబాబూ.. ఇక్కడ దాచిపెట్టవచ్చు కానీ, మీరే, ప్రజెంట్‌ చేసిన మీ తొలి బడ్జెట్‌.  అప్పటికి ఇంకా ఇన్ని తెలివితేటలు ముదరలేదు. 2024–25 బడ్జెట్‌ డాక్యుమెంట్స్‌లోనే క్లియర్‌గా రాష్ట్రానికి అప్పులెంత ఉన్నాయనేది రాశారు.
    ఇంకా ఆ విషయం 2023–24 కాగ్‌ నివేదికలో కూడా కనిపిస్తుంది. మన హయాం చివరికి అంటే 2023–24 వరకు చూస్తే రాష్ట్ర అప్పు రూ.4,91,734 కోట్లుగా కనిపిస్తుంది. తర్వాత స్టేట్‌ గవర్నమెంట్‌ గ్యారెంటీస్‌ ఔట్‌ స్టాండింగ్స్‌ మరో రూ.1,54,797 కోట్లు. రెండూ కలిపితే వైయస్సార్‌ సీపీ హయాం ముగిసే నాటికి ఎంత అప్పు అనేది క్లియర్‌గా ఉంటుంది. వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చే నాటికి, చంద్రబాబు హయాం ముగిసే నాటికి, రాష్ట్ర అప్పు రూ.3,90,247 కోట్లు.

ఎవరి హయాంలో ఎంతెంత అప్పు?:
    ఒక్కసారి అంతకు ముందు చూస్తే.. రాష్ట్ర విభజన తర్వాత 2014 వరకు అన్ని రకాల అప్పులు చూస్తే రూ.1,40,717 కోట్లు కాగా, 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి అవి రూ.3,90,247 కోట్లకు ఎగబాకాయి. అంటే చంద్రబాబు తన హయాంలో 2014–19 మధ్య రూ.2,49,350 కోట్లు అప్పు చేశాడు. అంటే అప్పుల ఏటా వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్‌) 22.63 శాతంతో ఆయన అప్పు చేశారు.
    ఇక మా ప్రభుత్వంలో రూ.3,90,247 కోట్ల అప్పు నుంచి మేం స్టార్ట్‌ అయితే.. మేము దిగిపోయే నాటికి ఉన్న మొత్తం అప్పు రూ.7,21,917 కోట్లు. అంటే మా హయాంలో చేసిన అప్పు రూ.3,31,670 కోట్లు. మా ప్రభుత్వంలో అప్పుల సీఏజీఆర్‌ కేవలం 13.09 శాతమే. ఇది కాగ్‌ లెక్కలు, స్టేట్‌ గవర్నమెంట్‌ లెక్కలు, బడ్జెట్‌ డాక్యుమెంట్లలో అన్నింటిలో స్పష్టంగా కనిపిస్తుంది.
    కానీ చంద్రబాబునాయుడు మాత్రం టేప్‌ రికార్డర్‌ ఆన్‌.. గోబెల్స్‌ ప్రచారం ఆన్‌. అన్ని రకాల అప్పులూ రాష్ట్రంలో మేం దిగిపోయే నాటికి రూ.7,21,917 కోట్లే కనిపిస్తుంటే.. నిన్న కూడా మాకు అప్పు ఇంత మిగిల్చి పోయారు రూ.9.74 లక్షల కోట్లు అని మళ్లీ అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకు అబద్ధాలు అలా. తప్పు కదా? అబద్ధాలు ఆడటం మోసం చేయడం. బాధ్యత గల స్థానంలో ఉన్నప్పుడు బాధ్యత తీసుకుని నిజాలు చెప్పాలి తప్ప బాధ్యత గల స్థానంలో ఉండి ఇలా అబద్ధాలు ఆడటం ఎంతమటుకు కరెక్టు?.

20 నెలల్లో రికార్డుస్థాయిలో అప్పు. పారదర్శకత లేదు:
    ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన అప్పులు చాలా దారుణంగా ఉన్నాయి. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లోనే చేసిన అప్పు ఏకంగా రూ.3,17,448 కోట్లు. మేము 5 ఏళ్లలో రూ.3,31,671 కోట్ల అప్పు చేస్తే చంద్రబాబు 20 నెలల్లోనే రూ.3,17,448 కోట్ల అప్పు చేశారు.
    వాస్తవాలన్నీ ఆధారాలతో సహా కనిపిస్తున్నా కూడా ఇంకా వాళ్లు బడ్జెట్‌ డాక్యుమెంట్స్‌తో ఇంకా గేమ్‌ ఆడుతూనే ఉంటారు. చివరికి బడ్జెట్‌ డాక్యుమెంట్లో చూస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ఈ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా పారదర్శకంగా చూపించడం లేదు.
    2025–26లో మొదటి 10 నెలల్లో చేసిన బడ్జెట్‌ అప్పులు చూస్తేనే రూ.90,768 కోట్లు. ఇంకా చివరి రెండు నెలలు ఇంకా ఉన్నాయి. అయినా అప్పులు చేస్తూనే ఉన్నారు. కానీ బడ్జెట్‌ పుస్తకాలు చూస్తే 2025–26 ఆర్థిక సంవత్సరానికి వీళ్లు సవరించిన ఎస్టిమేట్స్‌ 12 నెలలకు అప్పు ఎంత చూపించారో తెలుసా? కేవలం రూ.80,567 కోట్లు మాత్రమే చూపిస్తున్నారు. నిజానికి కాగ్‌ లెక్కల ప్రకారమే రూ.90,768 కోట్లు అప్పు చేశారు. 2025–26లో 12 నెలలకు కలిపి ఇంకా రెండు నెలలు ఉన్నాయి. అప్పు రూ.10 వేల కోట్లు తగ్గించి, రూ.80,567 కోట్లు మాత్రమే చూపిస్తున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? అప్పులు వీళ్లు పారదర్శకంగా చూపించడం లేదు. ఎక్కడికక్కడ అడ్జస్ట్‌ చేస్తున్నారు. 

ఉద్యోగులకు రూ.35 వేల కోట్ల బకాయిలు:
    ఉద్యోగులకు సంబంధించిన డబ్బు ఇష్టమొచ్చినట్టు ఎడాపెడా వాడేస్తున్నారు. ఒకవైపున వారికి ఇవ్వాల్సింది ఇవ్వడం లేదు. రూ.35 వేల కోట్లు వాళ్లకు బకాయిలు, జీతాలు పెంచేది లేదు. మరోవైపున వాళ్ల జీతాలతో, వాళ్ల అకౌంట్స్‌ తో వీళ్లు గేమ్‌ ఆడుతున్నారు. ఐఆర్‌ లేదు. పీఆర్సీ ప్రస్తావన లేదు.

మూలధన వ్యయం. వాస్తవాలకు దూరం:
    మూలధన వ్యయం వాస్తవాలకు దూరంగా ఉంది. మూలధన వ్యయం కింద 2025–26లో గమనిస్తే బడ్జెట్లో చూపించింది రూ.40,635 కోట్లు. మళ్లీ రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌లో రూ.33,135 కోట్లు అని చెప్పారు. కానీ, ఈ 10 నెలల్లో వీళ్లు ఖర్చు పెట్టింది కేవలం రూ.21,675 కోట్లు మాత్రమే. అలాగే గత ఏడాది చూస్తే.. 2014–25లో మూలధన వ్యయాన్ని రూ.32,714 కోట్లుగా చూపారు. ఆ తర్వాత రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌లో దాన్ని రూ.24,072 కోట్లకు తగ్గించారు. చివరకు వారు ఖర్చు చేసింది కేవలం రూ.16,141 మాత్రమే.
    రాష్ట్ర సొంత ఆదాయాల విషయంలో అయితేనేమి, మూలధన వ్యయంలో అయితే ఏమి.. అంతా మోసం మోసం. ఇక ఈ బడ్జెట్‌లో 2026–27లో మూలధన వ్యయాన్ని ఏకంగా రూ.48,097 కోట్లుగా చూపారు. కానీ, ఎంత ఖర్చు చేస్తారనేది చూడాలి.
    చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన బిల్డప్‌ ఏమిటి అంటే.. తాను సీనియర్‌ అని అని, సంపద çసృష్టిస్తానని, అప్పుల మీద ఆధారపడే పరిస్థితి రాకుండా చేస్తానని కబుర్లు చెప్పాడు. ఇవాళ పరిస్థితి ఏంటి అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా అప్పులు చేస్తున్నాడు. ఆల్‌ టైమ్‌ రికార్డులన్నీ బద్ధలు కొడుతున్నాడు. కానీ ప్రజలకు ఎలాంటి స్కీములు లేవు. ఉన్న స్కీములన్నీ రద్దు. సూపర్‌ సిక్సులు, సూపర్‌ సెవెన్లు మోసాలు. 

మ్యానిఫెస్టోలో ప్రతి మాట నిలబెట్టుకున్నాం:
    మేనిఫెస్టో అన్నది ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు ఇచ్చే హామీలు. మా హయాంలో మొట్టమొదటిసారిగా రిఫార్మ్‌ తీసుకొచ్చాం. మ్యానిఫెస్టో ద్వారా ప్రజలకిచ్చే హామీలు నీటిమీద రాతలు కాకూడదని, అవి మోసాలుగా మిగిలిపోకూడదు అని, మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి ఉండాలని, నిజంగా కోవిడ్‌ లాంటి మహా సంక్షోభం ఉన్నా కూడా మా ప్రభుత్వంలో మనసా, వాచా కర్మణా మ్యానిఫెస్టో అన్నది అమలు చేసి ఒక పవిత్రతను తీసుకొచ్చాం. ఏకంగా 99 శాతం హామీలు నెరవేర్చి, ప్రజల దగ్గరికి గర్వంగా చిక్కటి చిరునవ్వుతో వెళ్లగలిగే పరిస్థితి ఒక రాజకీయ పార్టీకి తీసుకొచ్చింది ఒక్క మా హయాంలో. 

చంద్రబాబుకు మ్యానిఫెస్టో ఒక చిత్తు కాగితం.
ఇంటింటికీ బాండ్లతో పచ్చి మోసం:
    అలాంటి చిత్తశుద్ధి మేం చూపిస్తే.. మేనిఫెస్టో అనే పదానికి అర్థం చెబుతూ.. చంద్రబాబు తన మేనిఫెస్టోకు ఇచ్చిన విలువ ఏంటో తెలుసా? ఇంతకు ముందు ఆయన పెట్టిరెండు బడ్జెట్లు చూసినా, ఇప్పుడు ఆయన పెడుతున్న మూడో బడ్జెట్‌ చూసినా మేనిఫెస్టో అంటే తనకు ఎప్పటికీ కూడా చిత్తు కాగితమే అని రుజువు చేస్తున్నాడు చంద్రబాబు.
    ఎన్నికలకు ముందు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంటింటికీ వెళ్లి బాండ్లు పంచాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ పథకానికి ఎంతెంత వస్తుందో కూడా లెక్కలేసి చూపించి మరీ ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు ప్రతీ కుటుంబాన్ని కూడా మోసం చేస్తున్నాడు. ఎన్నికల మేనిఫెస్టోల గురించి సూపర్‌ సిక్స్‌లు, సూపర్‌ సెవెన్‌లు అంటూ వారి కరపత్రికల్లో ఒకటే యాడ్లు ఇచ్చారు. ప్రజలను మోసం చేసేందుకు మాఫియా ముఠా మొత్తం ఒక్కటై ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను మోసం చేశారు.
    బీసీలకు యాభై ఏళ్లకే పింఛన్, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, యువగళం పేరుతో ప్రతినెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు, ప్రతి మహిళకు నెలకు రూ.1500, స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు, ప్రతి కుటుంబానికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు.. అని చెప్పడమే కాకుండా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ల ఫొటోలతో బాండ్లు ఇచ్చి వాటిపై సంతకాలు పెట్టి వారి చేతిలో పెట్టారు. పీఎం కిసాన్‌తో కలిపి రైతుకు ఏడాదికి రూ.26 వేలు ఇస్తామని ఊదరగొట్టారు. 

త్రికరణ శుద్ధితో పచ్చి మోసం:
    ఇదంతా కాకుండా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటూ త్రికరణ శుద్ధితో ప్రమాణం చేశారు. ఎలాంటి నియమ నిబంధనలు విధించకుండా లబ్ధిదారులందరికీ పథకాలు వర్తింప చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఇద్దరూ సంతకాలు చేసిన బాండ్లు పంపించారు. ప్రతి ఇంటికీ త్రికరణ శుద్ధితో పంపిణీ చేశారు. 

నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి రూ.1.08 లక్షల బాకీ:
    కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్‌లలో తానిచ్చిన నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి కించిత్‌ ప్రస్తావన ఎక్కడైనా ఉందా?  యువగళం పేరుతో ఆయన, ఆయన కొడుకు రాష్ట్రమంతా తిరిగి ఎక్కడ యువకుడు కనపడినా నిరుద్యోగ భృతి పేరు చెప్పి నెలకు రూ.3 వేలు చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇస్తామని వారి భావోద్వేగాలతో ఆడుకున్నారు. కానీ ఈ మూడు బడ్జెట్‌లలో ఇచ్చింది సున్నా. వీరు చెప్పిన 20 లక్షల మంది నిరుద్యోగుల లెక్క తీసుకున్నా వారికి ఏడాదికి రూ.7200 కోట్లు ఇవ్వాలి. మూడేళ్లలో పడ్డ బకాయిలు రూ.21,600 కోట్లు. ప్రతి నిరుద్యోగికి చంద్రబాబు పడ్డ బాకీ రూ.1.08 లక్షలు. హామీ ఇవ్వడం తర్వాత దాన్ని చెత్త బుట్టలో పడేయడం ఆయన ఇది కొత్త కాదు.
    ‘హి ఈజ్‌ యాన్‌ హాబిచ్యువల్‌ అఫెండర్‌’. తాను గెలిచిన టీడీపీ 1999 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. తన 2014 ఎన్నికల మేనిఫెస్టో చూసినా కనిపిస్తోంది. మళ్లీ ఇప్పుడు 2024 మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తోంది. ప్రతిసారీ నిరుద్యోగులతో ఓట్లు వేయించుకుని నిస్సిగ్గుగా ఎగరగొడతాడు. అందుకే యువతకు చంద్రబాబు నాయుడు నిత్య మోసగాడు.. నిత్య వంచకుడు. 

స్త్రీశక్తి బాకీ రూ.97,200 కోట్లు:
    అమ్మవారి పేరుతో మోసం.. స్త్రీ శక్తి బాకీ అక్షరాలా రూ.97,200 కోట్లు. సూపర్‌ సిక్స్‌ సూపర్‌ సెవెన్‌లో చంద్రబాబు ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ 18 ఏళ్లు నిండిన 60 ఏళ్ల లోపు వయసున్న ప్రతి మహిళకు స్త్రీ శక్తి హామీ పేరిట నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని చెప్పాడు. స్త్రీశక్తి అని అమ్మవారి పేరు పెట్టి మహిళలను మోసం చేసిన మోసగాడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఏకైక వ్యక్తి చంద్రబాబు మాత్రమే. మొదటి రెండు బడ్జెట్‌లలో అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది సున్నా. ఈ బడ్జెట్‌ ద్వారా ఇచ్చేదీ సున్నానే. 
    రాష్ట్రంలతో 18 ఏళ్లు పైబడి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలు ఎన్నికల డేటా ప్రకారం రాష్ట్రంలో దాదాపు 1.80 కోట్ల మంది ఉన్నారు. వారికి ఏడాదికి రూ.18 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.32,400 కోట్లు చెల్లించాలి. మూడేళ్లకు కలిపి అక్కచెల్లెమ్మలకు బాకీ పడిన సొమ్ము అక్షరాలా రూ.97,200 కోట్లు. ఈ ఒక్క స్కీమ్‌ ద్వారానే మూడేళ్లలో పెట్టిన బాకీ మొత్తం రూ. 97,200 కోట్లు. 

పెన్షన్ల బాకీ రూ.28,800 కోట్లు:
    50 ఏళ్లకే పింఛన్లు.. మూడేళ్లలో రూ. 28,800 కోట్లు బాకీ
సూపర్‌ సిక్స్‌లో మరో ముఖ్యమైన హామీ 50 ఏళ్లకే పింఛన్లు. ఎవరైనా మర్చిపోతారేమో అని అదే పనిగా అవ్వను పట్టుకుని ఫోటోలు దిగి పింఛన్లు నెలకు రూ.4 వేలు, ఏడాదికి రూ.48 వేలు ఇస్తామని తమ కరపత్రికల్లో యాడ్స్‌ ప్రచారం చేశారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు 20 లక్షల మందికి పైగానే ఉన్నారు. వారికి నెలకు రూ.4వేలు చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు ఇవ్వాలి. మూడేళ్లకు కలిపి రూ.28,800 కోట్లు బాకీ. ఈ ఒక్క స్కీమ్‌ ద్వారానే ఒక్కొక్కరికి ఏడాదికి రూ.48 వేల చొప్పున మూడేళ్లకు కలిపి రూ.1.44 లక్షల బాకీ ఉన్నాడు. 

ఫ్లాప్‌ సినిమాకి సూపర్‌ హిట్‌ ప్రచారం:
    చంద్రబాబునాయుడు సూపర్‌ సిక్స్‌ సూపర్‌ సెవెన్‌ల పేరుతో ప్రవేశపెట్టిన ఈ మూడు బడ్జెట్‌లలో కూడా ఈ మూడు ప్రధాన హామీలకు అతీగతీ లేదు. మరి ఏరకంగా సూపర్‌ ఫ్లాప్‌ సినిమా చూపిస్తూ చంద్రబాబు సూపర్‌ హిట్‌ అంటూ సంబరాలు చేసుకోమని చెబుతున్నాడు. న్యాయమేనా ఇది?. ధర్మమేనా? ఇలా చేయడం.

ఏ రకంగా చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ అంటున్నారు. సూపర్‌ ప్లాప్‌ అయిన సినిమా చూపిస్తూ సంబరాలు చేసుకోమని చెబుతున్నారు. ఇది ధర్మమేనా?, న్యాయమేనా?

ప్రతి నెలా 25 వేల పెన్షన్లు కట్‌:
    ప్రతి నెల పింఛన్ల పంపిణీ అంటూ చంద్రబాబు పబ్లిక్‌ మీటింగ్‌లు పెట్టి పచ్చి అబద్ధాలు చెబుతూ.. ఏకంగా 25 వేల పింఛన్లు కట్‌ చేస్తున్నారు. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఉన్న పింఛన్ల సంఖ్య 66,34,372. ఈనెల, అంటే 2026 ఫిబ్రవరిలో ఇచ్చిన పింఛన్లు  60,96,108. అంటే ఏకంగా 5,38 లక్షల పింఛన్లు కత్తరించారు. 
    ఇంకా ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఈ ఫిబ్రవరి నెలలో ఇచ్చిన 60 లక్షల పింఛన్లకు రూ.2,632 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. వీటికి 12 నెలలు వేసుకుంటే ఏడాదికి రూ.31,554 కోట్లు బడ్జెట్‌లో కనిపించాలి కదా?. ఈ ఏడాది బడ్జెట్లో పింఛన్ల కోసం రూ.27,719 కోట్లు మాత్రమే చూపారు. ఈ లెక్కన ఎన్ని పింఛన్లకు ఆ మొత్తం వర్తిస్తుందంటే అది తగ్గి 53,50,115 మందికి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఈ సంవత్సరం చంద్రబాబు మరో 7,45,993 పింఛన్లు కట్‌ చేయడానికి సిద్ధపడ్డారు అని చెప్పకనే చెబుతున్నారు. 
    ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్తగా ఒక్క పింఛన్‌ కూడా ఇవ్వలేదు. కొత్త వాటికి కనీసం దరఖాస్తులు కూడా తీసుకోలేదు. ప్రభుత్వం వద్ద 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మా హయాంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి పింఛన్లు మంజూరు చేసే వాళ్లం. ప్రతి ఏటా జూన్, డిసెంబర్‌లో పింఛన్లు అప్‌డేట్‌ చేసే వాళ్లం. ఈ రోజు పరిస్థితి రివర్స్‌. మా ప్రభుత్వంలో చంద్రబాబు దిగిపోయే నాటికి 39 లక్షల పింఛన్లు ఉంటే.. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 66 లక్షల పింఛన్లకు పెంచాం. చంద్రబాబు వచ్చిన రెండేళ్లకే 6 లక్షల పింఛన్లు తగ్గాయి. 

తల్లికి వందనం కాదు.. తల్లికి వంచన:
    తల్లికి వందనం పథకాన్ని తల్లికి వంచనగా మార్చారు. బడికి వెళ్లే ఒక్కో పిల్లాడికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామన్నారు. రాష్ట్రంలో యూడీఐఎస్‌ఈ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) డేటా ప్రకారం మా ప్రభుత్వంలో 87,41,885 మంది బడికి వెళ్లే పిల్లలు ఉండేవారు. ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామన్నారు ఈ పెద్ద మనిషి. అంటే బడ్జెట్‌ ప్రకారం రూ.13,112 కోట్లు ఖర్చు అవుతుంది.
    మొదటి ఏడాది ఈ పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు. రూపాయి కూడా ఇవ్వలేదు. రెండో ఏడాది రూ.13112 కోట్లకు గాను కేవలం రూ.8,389 కోట్లు మాత్రమే ఇచ్చారు. 20 లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టారు. కేవలం 67 లక్షల మందికి మాత్రమే అరకొరగా ఇచ్చారు. కొందరికి రూ.8 వేలు, కొందరికి రూ.10 వేలు అలా ఇచ్చారు. 
    తాజా బడ్జెట్‌ ప్రసంగంలోనే పథకానికి రూ.9,668 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. కానీ,  కేటాయించింది రూ. 8,456 కోట్లు మాత్రమే. అంటే ఈ ఏడాది కూడా పిల్లల సంఖ్యలో భారీ కోత పడుతుందని చెప్పకనే చెబుతున్నారు. మరి ఈ పథకం ఇచ్చినట్లా? ఇవ్వనట్లా? ఇది మోసం కాదా? 

ఉచిత బస్సు..తుస్సు:
    ఎన్నికలకు ముందు వీళ్లు అన్న మాటలు ఏంటంటే కడప నుంచి వైజాగ్‌కు వెళ్లి రావచ్చు అన్నారు. శ్రీకాకుళం వాళ్లు తిరుపతి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు అన్నారు. రాష్ట్రానికి ఏ మూలకు వెళ్లిన ఉచిత ప్రయాణం అన్నారు. ఏపీఎస్‌ ఆర్‌టీసీలో 16 రకాల సర్వీసులు ఉంటే కేవలం 6 రకాల సర్వీసులకు మాత్రమే ఈ పథకం పరిమితం చేశారు. ఈ పథకాన్ని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఖర్చు చేయాలి.   మొదటి ఏడాది ఈ పథకాన్ని ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఆగస్టులో అరకొరగా మొదలుపెట్టారు. చేసిన ఖర్చు కేవలం రూ.1040 కోట్లు. ఈ పథకం కోసం ఈ బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.1420 కోట్లు మాత్రమే. మూడేళ్లకు కలిపితే రూ.9,600 కోట్లకు గాను వీళ్లు 7,140 కోట్లు బకాయిలు పెట్టారు.

గ్యాస్‌ లైటింగ్‌ ఏ స్థాయిలో ఉందంటే..:
    దీపం పథకం పేరుతో కూడా మోసాలే. రాష్ట్రంలో మొత్తం గ్యాస్‌ కనెక్షన్ల సంఖ్య 1.59 కోట్లు. ఒక్కో కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ఒక్కో సిలిండర్‌ రూ.855, అంటే రూ.4 వేల కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది వీళ్లు ఇచ్చింది కేవలం రూ.786 కోట్లు మాత్రమే. రెండో ఏడాది రూ.2,199 కోట్లు ఇచ్చారు. ఈ బడ్జెట్లో ఈ పథకానికి పెట్టింది రూ.2,600 కోట్లు మాత్రమే. అంటే  ఈ పథకానికి  రూ.6,143 కోట్లు బకాయిలు ఉన్నాయి. గ్యాస్‌లో కూడా బాకీ పెట్టారు. గ్యాస్‌ లైటింగ్‌ (చక్కగా అబద్ధాలు ఆడటం) అన్నది ఏ స్థాయిలో ఉందో గమనించండి. 

అన్నదాతా సుఖీభవ. రైతులకు పచ్చి దగా:
రాష్ట్ర రైతులకు చంద్రబాబు శాపం. వ్యవసాయం నిర్వీర్యం:
    (ఎన్నికల ప్రచారంలో పథకంపై చంద్రబాబు ప్రసంగ వీడియో ప్రదర్శించారు)
    ఈ పథకంలో ప్రతిరైతు కుటుంబానికి పీఎం కిసాన్‌ కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడి సహాయం కింద రూ.20 వేలు ఇస్తానన్నాడు. మడమ తిప్పడు–మాట తప్పడు అని నా గురించి మాట్లాడాడు. రైతు భరోసా పథకంలో చెప్పిన దానికంటే పెంచి ఇచ్చాం
అసలు బడ్జెట్‌ అంటే కేంద్రం ప్రభుత్వం ఇచ్చేది, మనం తీసుకువచ్చే అప్పులది.. ప్లస్‌ రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది. కానీ, చంద్రబాబు స్పెసిఫిక్‌గా.. వాళ్లు ఇచ్చేది కాకుండా, నేను రూ.20 వేలు ఇస్తాను అన్నదాత సుఖీభవ పేరుతో అని స్పెసిఫిక్‌గా చెప్పాడు. 
    అన్ని చెప్పిన ఈ పెద్ద మనిషి.. ఈ రూ.20 వేలు ఎంతమందికి ఇచ్చాడు. మా హయాంలో రైతులు ఎంతమంది అని లిస్ట్‌ చూస్తే 53.58 లక్షల మంది. ఈ 53.58 లక్షల మందికి అన్నదాత సుఖీభవ కింద పీఎం కిసాన్‌ కాకుండా రూ.20 వేలు చంద్రబాబు ఇవ్వాలి. అంటే రూ.10,717 కోట్లు సంవత్సరానికి ఇవ్వాలి. కానీ, మొదటి ఏడాదే ఎగ్గొట్టేశాడు. రెండో ఏడాది ఏం చేశాడు. రెండేళ్లు కలిపి రూ.40 వేలు ఇవ్వాలి. కానీ, చంద్రబాబు ఇచ్చింది రెండు విడతల్లో రూ.10 వేలు ఇచ్చాడు. రూ.30 వేలు ఎగరగొట్టేశాడు. 
    ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. వైఎస్సార్‌ సీపీ హయాంలో 53.58 లక్షల మందికి రైతు భరోసా పథకం ద్వారా మనం మేలు చేస్తే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత 7 లక్షల మంది రైతులకు పథకాన్ని దూరం చేశాడు. 46.85 లక్షల మందికి మాత్రమే ఇచ్చాడు ఈ సంవత్సరం. అది కూడా రూ.10 వేలు మాత్రమే ఇచ్చాడు. అది కూడా రూ.4,685 కోట్లు మాత్రమే. 
    కానీ, బడ్జెట్‌లో ఏమంటాడు.. ఆ వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ.. రూ.6,309 కోట్లు ఇచ్చేశామని చెబుతున్నాడు. వాళ్లు ఇచ్చిందే రూ.4685 కోట్లు. అది కూడా 46.85 లక్షల మందికి. ఇప్పటికే రెండేళ్లకు కలిపి ప్రతి రైతుకు రూ.30 వేలు ఎగరగొట్టారు. ఇది వాస్తవం అయితే.. బడ్జెట్‌లో నువ్వు రూ.6,309 కోట్లు ఇచ్చానని చదువుతున్నావ్‌.. ఎట్లా అబద్ధాలు అడుతున్నావ్‌ నువ్వు.. మోసం చేయడానికి మనసు ఎలా వస్తుంది. ధర్మమేనా.. న్యాయమేనా నువ్వు చేసేది. 
    రెండేళ్లకు కలిపి 53.58 లక్షల మందికి రూ.20 వేల చొప్పున రూ.21,434 కోట్లు ఇవ్వాలి. నువ్వు ఇచ్చింది ఎంతంటే.. రూ.4685 కోట్లు మాత్రమే. ఈ రెండేళ్లకు రూ.16,749 కోట్లు రైతులకు ఈ ఒక్క స్కీమ్‌ ద్వారానే బాకీ. ప్రతి రైతుకు రూ.30 వేలు బాకీ. అంతే కాకుండా వరుసగా మూడో బడ్జెట్‌లో కూడా కౌలు రైతులకు పూర్తిగా జీరో. మొండి చెయ్యి. రెండో బడ్జెట్‌లో వారికి ఇచ్చింది సున్నా. మూడో బడ్జెట్‌లో ఇప్పుడు వారికి ఇచ్చేది సున్నా.
    కేంద్రం ఇవ్వకపోయినా కూడా వైఎస్సార్‌సీపీ హయాంలో కౌలు రైతులకు రైతు భరోసా పథకం అందించి ఆదుకున్నాం. వీళ్లకే కాదు.. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలున్న గిరిజనులకు పట్టాలిచ్చి మరీ రైతు భరోసా సొమ్ము ఇచ్చాం. ఇప్పుడు ఆ గిరిజనులకు కూడా కటింగ్‌. చంద్రబాబు ప్రభుత్వంలో రెండేళ్లు ఇచ్చింది లేదు.. మూడో సంవత్సరం ఇచ్చేది సున్నా. 

పంట నష్టపోతే పరిహారం లేదు:
    చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. రైతులు ఇబ్బందులు పడితే. చంద్రబాబు ప్రభుత్వం వీరిని ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైంది. మా ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా పెట్టి రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉంటూ, వాళ్ల భారాన్ని కూడా ప్రభుత్వమే కడుతూ ఈ పథకాన్ని మేము అమలు చేశాం. చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి 2024–25లో పంటల బీమా కోసం బడ్జెట్‌లో పెట్టింది రూ.60 లక్షలు. ఖర్చు చేసింది సున్నా. 2025–26లో బడ్జెట్‌లో పెట్టింది రూ.1023 కోట్లు. ఖర్చు చేసింది సున్నా. ఇక ఈ బడ్జెట్‌లో 2026–27లో పంటల బీమా కింద పెట్టింది రూ.250 కోట్లు. 
    ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 2023–24కు ఖరీఫ్, రబీలకు సంబంధించి 2024 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కడితే కేంద్రం కూడా దానికి జత కలిపి రైతులకు ఇవ్వాల్సిన పరిహారం ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఇస్తాయి. అలాంటిది 2023–24 ఖరీఫ్‌కు సంబంధించి 2024 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన ఉచిత పంటల బీమా ప్రీమియం రూ.834 కోట్లు కట్టకపోవడం వల్ల రైతులు ఏకంగా రూ.1324 కోట్లు నష్టపోయారు. 
    పోనీ, 2024 రబీకి సంబంధించి ప్రభుత్వం ఏమైనా ప్రీమియం కట్టిందా అంటే.. అది కట్టలేదు. చంద్రబాబు నిర్వాకాల వల్ల 2023–24, 2024–25 వ్యవసాయ సీజన్లకు సంబంధించి ఇప్పటికే సుమారు రూ.3500 కోట్లు రైతులు నష్టపోయారు. ఉచిత పంటల బీమా అందుబాటులో లేకపోవడం వల్ల నష్టపోయారు. 
    2025–26లో మనం అంతా చూస్తూనే ఉన్నాం. మొంథా తుఫాన్, దిత్వా తుఫాన్‌ వచ్చాయి. 2025–26లో లెక్కేసుకుంటే ఉచిత పంటల బీమా లేకపోవడంతో పాటు, కిందా మీదా పడి రైతులే వాళ్ల ప్రీమియం వాళ్లు కట్టుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం తాము కట్టాల్సిన తమ వాటా కట్టకపోవడంతో రైతులు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. 
    వైఎస్సార్‌ సీపీ హయాంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా ప్రీమియం మేమే కట్టి. రైతులపై ఒక్క పైసా కూడా భారం పడకుండా ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతులకు రూ.7802 కోట్లు ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లించాం. ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు జరిగిన మేలు రూ.7,802 కోట్లు. మేము కట్టిన ప్రీమియం ద్వారా రైతులు బాగుç ³డిన టేబుల్‌ మీ ముందే పెడుతున్నా. పంట నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారంగా ఇవ్వాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ విషయంలో కూడా రైతులే ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారు. 
    చివరకు మొంథా తుఫాన్‌ కారణంగా రైతులకు జరిగిన నష్టాన్ని కుదించారు. 15 లక్షల ఎకరాల నష్టం జరిగితే దాన్ని 4 లక్షల ఎకరాలకే పరిమితం చేశారు. మొత్తంగా చూస్తే ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద దాదాపుగా రైతులకు రూ.900 కోట్ల బకాయిలు ఇప్పటికీ ఉన్నాయి.2025–26లో కేటాయింపులు సున్నా. 

గిట్టుబాటు ధరలు లేవు:
    ఇక గిట్టుబాటు ధరల విషయంలో రైతులకు జరుగుతున్న అన్యాయం అంతా ఇంతా కాదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకూ కూడా గిట్టుబాటు ధర లేదు. వాస్తవానికి  ఈరెండేళ్లలో రైతుకు గిట్టుబాటు ధర దేవుడెరుగు. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కూడా రాని పరిస్థితి. 
    వరికి క్వింటాలుకు రూ.2,369 అయితే.. ఏ రైతు కూడా కనీసం రూ.300 నుంచి రూ.400 తక్కువకు అమ్ముకున్న పరిస్థితి. కానీ ధాన్యం కొనుగోలు విషయంలో తాము గొప్పగా చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. వీళ్ల పుణ్యమా అని చెప్పి.. గతంలో ఈ క్రాప్‌ పెట్టి ఆర్బీకేలు ద్వారా ..   ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చేలా కొనుగోలు చేసి.. ఎంఎస్‌పీ వ్వడమే కాకుండా జీఎల్‌టీ.. గన్ని బ్యాగులు, లేబర్, ట్రాన్స్‌ పోర్టు ఖర్చులు కూడా ఇచ్చాం. ప్రతి క్వింటాలుకు అదనంగా రూ.252 మేలు జరిగింది. 
    ఈరోజు రైతులు దళారులకు అమ్ముకునే దుస్థితి. ప్రభుత్వం ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమం నుంచి పక్కకు తప్పుకోవడం వల్ల ప్రతి రైతు రూ.300 నుంచి రూ,.400 వరకు తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోపు డబ్బులు చెల్లించే విధానాన్ని మా ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చాం. శ్రీకారం చుట్టింది మా ప్రభుత్వం హయాంలో.. వారు గతంలో 960 కోట్లు బకాయిలు పెడితే మేము వాటిని క్లియర్‌ చేశాం. ధాన్యం కొనుగోలు చేసిన రెండు వారాల్లో డబ్బులు ఇస్తున్నట్లు.. అదేదో వీళ్లు చేసినట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు. 
    అసలు వీరు ధాన్యం కొనుగోళ్లు నేరుగా చేయడం లేదు.. రైతుల నుంచి మొదట మిల్లర్లు కొంటున్నారు.. మధ్యవర్తులు కొంటున్నారు.. ఆ మిల్లర్ల దగ్గరకు వెళ్లిన తర్వాత రెండు వారాలకు అప్‌ లోడు చేస్తున్నారు. అప్‌ లోడ్‌ చేసిన తర్వాత కానీ డబ్బులు రిలీజ కావడం లేదు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తేదీ నుంచి కాదుమిల్లర్లు అప్‌ లోడ్‌ చేసిన తేదీ నుంచి ఇస్తున్నారు. 
    ఇక ఏ పంట తీసుకున్నా కానీ.. మొక్కజొన్న, అరటి, కొబ్బరి, కందులు, మినుములు, పెసలు, శనగలు, సజ్జలు, మిర్చి, టమోటో, చీనీ, పత్తి ధరలు పూర్తిగా పడిపోయినా కూడా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం విదిల్చింది శనక్కాయలు, బెల్లానికి కూడా చాలడం లేదు. అంత దారుణంగా రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. ఈ రోజు కూడా శనగలకు రేటు లేక అగచాట్లు పడుతున్నారు. రూ.5 వేలకు కూడా కొనుగోలు చేసేవాడు లేడు. శనగ కనీస మద్దతు ధర రూ.5,875. మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్‌ లో కాంపిటీషన్‌ క్రియేట్‌ చేసి రూ.8 వేలకు రేట్లు పెంచి రైతులకు మేలు చేశాం. 
    ఈ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధికోసం 2024–25 బడ్జెట్‌ లో కేటాయించింది రూ.300 కోట్లు. ఖర్చు చేసింది కేవలం రూ.50.4 కోట్లు. 2025–26 బడ్జెట్‌ లో వీళ్లు పెట్టింది రూ.300 కోట్లు.. ఖర్చు చేసింది రివైజ్డ్‌ ఎస్టిమేట్లో రూ.342 కోట్లు అంటున్నారు. అంత ఖర్చు చేశారా? లేదా? అనేది దేవుడికెరుగు. 2026–27 బడ్జెట్‌ లో పెట్టింది రూ.500 కోట్లు. నేను అడుగుతున్నా.. మా హయాంలో రూ.3000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఐదేళ్లలో ఏకంగారూ.7756 కోట్లు ఖర్చు పెట్టి మార్కెట్‌ లో  కాంపిటీషన్‌ క్రియేట్‌ చేశాం. ప్రతి ఆర్బీకేలో ఈ పంటకూ ఇది ధర అని పోస్టర్లు తగిలించేవాళ్లం. ఆ ధరకంటే పడిపోతే.. ఆర్బీకే అసిస్టెంట్‌ అగ్రికల్ల్చర్‌ గ్రాడ్యుయేట్‌..వెంటనే అలెర్ట్‌ చేసేవాళ్లు. 
సీఎం యాప్‌ (కంట్యున్యుయస్‌ మోనిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొడ్యూస్‌) అనేది ఉండేది.. వెంటనే యాక్టివేట్‌ అయ్యేది.. జాయింట్‌ కలెక్టర్‌ ను మార్క్‌ ఫెడ్‌ జాయింట్‌ ఎండీగా పెట్టాం..వెంటనే జాయింట్‌ కలెక్టర్‌ రియాక్ట్‌ అయ్యేవాడు. వెంటనే ఆర్బీకే పరిధిలో కొనుగోళ్లు జరిగేవి. కాంపిటీషన్‌ క్రియేట్‌ అయ్యాది.. ఆ కాంపిటీషన్‌ వల్ల రేట్లు పెరిగేవి. ఏకంగా ధరల స్థిరీకరణ నిధి ద్వారా రూ.7,756 కోట్లు ఖర్చు చేసి ప్రైజెస్‌ నిలబడేట్లు చేశాం. ఏయే పంటకు ఏ రకంగా రేట్లు నిలబెట్టామో టేబుల్‌ మీరే చూడండి. 

ఉద్దేశపూర్వకంగా వ్యవసాయం నిర్వీర్యం:
    చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. ఆయన క్రియేట్‌ చేసిన సంక్షోభం వల్ల.. ఆయన క్రియేట్‌ చేసిన సంక్షోభం అని నేను కేటగేరికల్‌ గా చెబుతున్నా.. ఆయన ఒక పద్ధతి ప్రకారం ఆర్బీకేలను నిర్వీర్యం చేశాడు. ఒక పద్ధతి ప్రకారం ఈ క్రాప్‌ ను నిర్వీర్యం చేశాడు.. ఒక పద్ధతి ప్రకారం దళారీ వ్యవస్థను తీసుకువచ్చాడు. ఇవన్నీ మ్యాన్‌ మేడ్‌ బ్లండర్స్‌.. ఇవన్నీ మా హయాంలో అధిగమించాం. ఆర్బీకేలు తీసుకువచ్చాం. ఈ క్రాప్‌ చేశాం.. సీయం యాప్‌ తెచ్చి ప్రైజెస్‌ ను మోనిటర్‌ చేశాం. కోవిడ్‌ సమయంలో కూడా రైతులను చేయి పట్టుకుని నడిపించాం. చంద్రబాబు వచ్చిన తర్వాత ఉచిత పంటల బీమా ను తీసేశాడు. ఇంతకుముందు ఈ క్రాప్‌ చేస్తే.. ఆటోమేటిగ్గా ఆ గ్రామం,.. ఆ గ్రామంలోని ఈక్రాప్‌ .. ఆర్బీకే పరిధి..వెంటనే ఈ క్రాప్‌ ద్వారా ఉచిత పంటల బీమా జరిగిపోయేది. రైతులు పట్టించుకోనక్కర లేకుండా ఆటోమేటిగ్గా ప్రభుత్వం చేసేది. ఏ సీజన్‌ లో నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగిసేలోగానే ఇన్‌ పుట్‌ సబ్సిడీ రైతుల ఖాతాలో పడిపోయేది. అదే గ్రామం.. అదే ఆర్బీకే పరిధి..అదే ఈ క్రాప్‌ డేటాతో ట్రాన్స్‌ పరెంట్‌ గా లిస్టులు పెట్టేవాళ్లం. ఈ రోజు చంద్రబాబు క్రియేట్‌ చేసిన మ్యాన్‌ మేడ్‌ సంక్షోభం వల్ల రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఏరైతుకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. దళారీ వ్యవస్థ మళ్లీ పిక్చర్‌ లోకి వచ్చింది. 
ఆర్బీకేలు నిర్వీర్యం అయ్యాయి.. ఈ క్రాప్‌ లేకుండా పోయింది. దీని సారాంశం.. రైతులకు చంద్రబాబు చేసిన మోసం.
    2025లో చంద్రబాబు లెక్కల ప్రకారమే.. 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వివరాలను కార్యదర్శుల సమావేశంలో ప్రభుత్వమే విడుదల చేసింది. ఇవికాక రికార్డు కాని మరణాలు ఇంకెన్నో.. నంబర్‌ ను తగ్గించడానికి వీళ్లు ఎఫ్‌ఐఆర్‌ లు కూడా నమోదు చేయడం లేదు. 

ఆ పరిహారం కూడా ఇవ్వడం లేదు:
    ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి మానవత్వం అన్నది ఏ స్థాయిలో ఉందన్నది చెప్పడానికి నిదర్శనం. మా హయాంలో గతంలో రూ.2 లక్షలు ఉన్నదాన్ని  రూ.7 లక్షలకు పెంచి..ౖ రెతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తే.. మరుసటి రోజే కలెక్టర్‌ గానీ.. జాయింట్‌ కలెక్టర్‌ గానీ  వెళ్లేవాడు..లోకల్‌ ఎమ్మెల్యే వెంటనే వెళ్లేవాడు. రైతు కుటుంబం చేతుల్లో రూ.7 లక్షల చెక్కు పెట్టేవాళ్లం. ఏకంగా 1320 మంది రైతు కుటుంబాలను ఆదుకున్నాం. చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న 474 రైతుల కుటుంబాలకు కూడా రూ.5 లక్షల పరిహారం అందించాం. 

విద్యాదీవెన. వసతి దీవెన:
    ఈ బడ్జెట్‌ లో ఇంకో దారుణమైన విషయం ఫీజు రీయింబర్స్‌ మెంట్‌. పిల్లల మీద, పిల్లల చదువుల మీద ఎంతటి దారుణంగా చిత్తశుద్ధి లేకుండా ఉన్నారనేందుకు ఇంకో నిదర్శనం విద్యాదీవెన, వసతి దీవెనకు సంబంధించిన బకాయిలపై స్పష్టత ఇవ్వకపోవడం, పిల్లల చదువులను త్రిశంకుస్వర్గంలో పెట్టడం. 
    రేపు నెల మార్చి ముగిసే నాటికి 9 త్రైమాసికాలకు గానూ, త్రైమాసికానికి రూ.700 కోట్లు.. అంటే 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆ క్వార్టర్‌ నుంచి మొదలు పెడితే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్‌ మామూలుగా ఏప్రిల్‌ లో వెరిఫికేషన్‌ చేసి మేలో మా ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చేవాళ్లం. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే డబ్బులు వెళ్లిపోయేవి తల్లుల ఖాతాల్లోకి. 
    జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన త్రైమాసికం మార్చి 16, 2024లో ఎన్నికల కోడ్‌ వచ్చింది, మే 13న ఎన్నికలు జరిగాయి. అక్కడ ఆగిపోయింది. ఈ మార్చి వస్తే 9 త్రైమాసికాలు. ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు ఖర్చవుతుంది విద్యా దీవెనకు. మొత్తం 9 త్రైమాసికాలకు మొత్తం రూ.6300 కోట్లు విద్యా దీవెన కోసం ఇవ్వాలి.
    ఇవి కాకుండా ప్రతి ఏప్రిల్లోనూ మా హయాంలో వసతి దీవెన కింద రూ.1100 కోట్లు ఇచ్చే వాళ్లం. ఏప్రిల్‌ 2024 ఎన్నికల పుణ్యాన ఆగిపోయింది మళ్లీ ఏప్రిల్‌ 2025 మళ్లీ.. ఈ రెండేళ్లకు రూ.2,200 కోట్లు వసతి దీవెన కింద ఇవ్వాలి. 
    ఈ రెండేళ్లలోనే విద్యాదీవెన కింద రూ.6300 కోట్లు వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు మొత్తంగా రూ.8,500 కోట్లు ఇవ్వాలి. కానీ, చంద్రబాబు ఎంతిచ్చారన్నది చూస్తే 2024–25లో వీరి లెక్కల ప్రకారమే వీళ్లు విడుదల చేసింది రూ.1771కోట్లు. 2025–26లో అసెంబ్లీ జరుగుతోందని చెప్పి రూ.1200 కోట్లకు బీఆర్వో ఇచ్చారు. నిజానికి అది నిధుల విడుదల కాదు. అలా రోజుకు 50, 60 బీఆర్వోలు ఇస్తుంటారు. బీఆర్వోలు ఇచ్చిన వెంటనే పేమెంట్‌ ఇచ్చినట్టు కాదు. కాలేజీలకు పేమెంట్‌ ఎంత అందింది అంటే కేవలం రూ.300 కోట్లు. అంటే టోటల్‌గా వీళ్లు ఇచ్చింది ఎంత అంటే ఈ రెండేళ్లకు రూ.2071 కోట్లు.
    పిల్లలకు ఇవ్వాల్సింది ఈ రెండేళ్లకు ఎంత? రూ.8,500 కోట్లు. విద్యాదీవెన, వసతి దీవెన కింద. బాకీ ఎంత అంటే రూ.6428 కోట్లు. ఇంకా ఇవ్వాల్సింది. ఈ రూ.6428 కోట్లకు ఇక ఈ మూడో సంవత్సరానికి సంబంధించి 2026–27కు సంబంధించి 4 త్రైమాసికాలు విద్యా దీవెన కింద రూ.2800 కోట్లు, ఏప్రిల్‌లో ఇచ్చే వసతి దీవెన మరో రూ.1100 కోట్లు. మొత్తం రూ.3900 కోట్లు. దీంతో రెండూ కలిపి మొత్తం బాకీ రూ.10,328 కోట్లు. వీళ్లు బడ్జెట్లో పెట్టింది ఎంత 2026–27కు గానూ రూ.2,766 కోట్లు. ఇప్పుడు చెప్పండి మీరు పిల్లల చదువులు జరుగుతాయా? పిల్లలు చదివే పరిస్థితి ఉంటుందా? మరి ఏరకంగా పిల్లలు చదువుకోగలుగుతారు?.

డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు మోసం:
    డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ. ఈ పథకానికి మూడు బడ్జెట్లలో అతీగతీ లేదు. చంద్రబాబు మేనిఫెస్టో ఒకసారి చూడండి. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పి.. పెంచడం కథ దేవుడెరుగు.. మామూలుగా ఇంతకు ముందు ఇస్తున్నట్టు ఇచ్చేది కూడా ఆగిపోయింది. 
    మా హయాంలో కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. వైయస్సార్‌ చేయూత పథకం ద్వారా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,189 కోట్లు ఇచ్చాం. వైయస్సార్‌ ఆసరా కింద 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు రూ.25,570 కోట్లు ఇచ్చాం. వైయస్సార్‌ కాపు నేస్తం ద్వారా 3,58,613 మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,029 కోట్లు ఇచ్చాం. వైయస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మరో రూ.1876 కోట్లు ఇచ్చాం. 
    నిజంగా స్త్రీ శక్తి ఎక్కడైనా లభించింది అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అంటే అది వైయస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతాం. 

ఇళ్ల స్థలాలు. ఇళ్ల నిర్మాణం:
    ఇదొక్కటే కాదు.. అక్కచెల్లెమ్మల పేరిట వాళ్లకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చాం. అందులో 21 లక్షల ఇల్లు మంజూరు చేయించాం. అందులో 10 లక్షల పైచిలుకు ఇల్లు పూర్తి చేశాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబునాయుడు అక్కచెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి చేసిన ప్రామిస్‌ ఏంటి? పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామనిమేనిఫెస్టోలో చెప్పాడు. 3 బడ్జెట్లు అయిపోయాయి. ఈరోజుకు కూడా ఒక్క కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. ఒక్క గజం కూడా స్థలం దీనికోసం కొనలేదు. బడ్జెట్లో దీని ప్రస్తావన కూడా ఎక్కడా లేదు. 
    గృహ నిర్మాణానికి సంబంధించి అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఇది. మేం ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చి, 21 లక్షల ఇల్లు మంజూరు చేయించి, 10 లక్షల ఇల్లు పూర్తి చేస్తే మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి కట్టడం వివిధ దశల్లో ఉంటే వాటిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారు గానీ, వాటికి సంబంధించిన కనీసం ఇల్లు కట్టడానికి డబ్బులు వీళ్లు ఇస్తున్నారా అంటే 2024–25లో బడ్జెట్‌ లో వీళ్లు పెట్టింది రూ.4,012 కోట్లు ఇస్తామని. ఖర్చు చేసింది కేవలం రూ.1500 కోట్లు. 2025–26లో వీళ్లు బడ్జెట్లో పెట్టింది రూ.6,300 కోట్లు. కానీ వీళ్లు ఖర్చు చేసింది రివైజ్డ్‌ ఎస్టిమేట్లో.. ఖర్చు చేశారో లేదో తెలియదు. మాకున్న లెక్కల ప్రకారం కేవలం రూ.200 కోట్లు ఖర్చు చేశారని, మిగతా ఫండ్స్‌ అన్నీ డైవర్ట్‌ చేశారని. కానీ వీళ్లు రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ లో రూ.1928 కోట్లు చూపిస్తున్నారు.
    ఒకసారి గమనిస్తే వైయస్సార్‌ సీపీ హయాంలో ఇళ్లపట్టాల కోసం, భూముల కొనుగోలు కోసం ఏకంగా రూ.11,871 కోట్లు మేం ఖర్చు చేస్తే ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కోసం ఏకంగా 20,338 కోట్లు ఖర్చు చేశాం. 
(అంటూ టేబుల్‌ చూపించారు)
    ఇది కాక జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం మరో రూ.3 వేల కోట్లు ఖర్చు చేశాం. మొత్తంగా రూ.35,210 కోట్లు మేం అక్కచెల్లెమ్మల పేరిట ఇంటి స్థలాలు ఇవ్వడమే కాక వారికి ఇళ్లు కట్టించే కార్యక్రమంలో వారిని లక్షాధికారులను చేసే కార్యక్రమంలో అడుగులు వేశాం. 
    అదే మీరేం చేశారు? 2024–25లో రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తామని కేవలం రూ.1548 కోట్లు, 2025–26లో రూ.6,300 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి రివైజ్డ్‌ ఎస్టిమేట్‌ లోనే రూ.1928 కోట్లు అని దారుణమైన నంబర్లు చూపించిన పరిస్థితి. 
    కేంద్ర ప్రభుత్వం లోక్‌ సభకు డిసెంబర్‌ 12, 2024న ఇచ్చిన ఆన్సర్‌.. ఆంధ్రప్రదేశ్‌లో 5 సంవత్సరాల పీరియడ్‌కు సంబంధించి పీఎంఏవైయూ కింద వాళ్లు ఇచ్చినది.. ఏపీకి 21,37,028 ఇళ్లు శాంక్షన్‌ చేస్తే 10,02,729 పూర్తయిపోయాయని లెక్కలు చూపిస్తూ ఇచ్చిన డేటా. 

పొదుపు సంఘాల పరపతి తగ్గింది:
    మేం ఇంతగా అక్కచెల్లెమ్మల కోసం పరితపించి అక్కచెల్లెమ్మలను నిలబెట్టే కార్యక్రమం మేం చేస్తే చంద్రబాబునాయుడు గారి ప్రభుత్వంలో విచిత్రం ఏమిటంటే.. పొదుపు సంఘాల పరపతి తగ్గింది. 
    మా హయాంలో ఇలా పొదుపు సంఘాలకు ఇచ్చే క్రెడిట్‌ లింకేజీ పెరుగుతూ పోతే.. 2023–24కు వచ్చే సరికే రూ.49,626 కోట్లకు బ్యాంకుల ద్వారా పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలు పోతే, చంద్రబాబు హయాంలో తగ్గుతూ తగ్గుతూ ఏకంగా 2025–26లో ఈ 10 నెలలకు సంబంధించి, గత డిసెంబరు 31 నాటికి చూస్తే అది రూ.30 వేల కోట్లకు పడిపోయింది. అది అంతకు ముందు ఏడాది రూ.41 వేల కోట్లు. అంటే మా ప్రభుత్వ హయాంలో రూ.49,626 కోట్లు ఉంటే, అది ఇప్పుడు చాలా తగ్గింది.

నాడు–నేడు పనులు. నిధులు:
    గవర్నమెంట్‌ స్కూల్స్, గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌ ఈ రెండింటిలో కూడా నాడునేడు కార్యక్రమం దేశంలోనే రాష్ట్రానికి మంచిపేరును మేం తీసుకొచ్చి పెడితే అలాంటి గొప్ప కార్యక్రమాన్ని చంద్రబాబు తన చేతులతో ఉరివేశాడు. మొదటి విడతలో మేం 15,713 స్కూళ్లలో నాడు–నేడు పనులు చేశాం. రెండో విడతలో 22,312 స్కూళ్లలో దాదాపుగా పూర్తయ్యే దశకు తీసుకొచ్చాం. మా ప్రభుత్వ హయాంలోనే రూ.8,524 కోట్లు ఖర్చు చేశామని చెప్పి ఈ చంద్రబాబుగారి ప్రభుత్వమే మొన్న అసెంబ్లీలో సమాధానం కూడా ఇచ్చింది. మరో రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే నాడు–నేడు పనులన్నీ  అయిపోతాయి.
    అలాంటిది చంద్రబాబు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని పూర్తిగా మూలన పడేశారు. ముఖ్యమంత్రి గారి సుపుత్రుడి శాఖలో నాడు–నేడు పనుల కోసం 2024–25లో పెట్టిన ఖర్చు కేవలం రూ.285 కోట్లు. మా హయాంలో రూ.8,524 కోట్లు ఖర్చు చేస్తే వీళ్ల హయాంలో 2024–25లో పెట్టిన ఖర్చు కేవలం రూ.285 కోట్లు. 2025–26లో రూ.1500 కోట్లు ఖర్చు చేస్తామని బడ్జెట్లో పెట్టి ఖర్చు చేసింది ఎంత అని చూస్తే రూ.259 కోట్లు. ఇక 2026–27 ఈ బడ్జెట్లో రూ.1500 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. మరి ఎంత ఖర్చు చేస్తారో చూడాలి.

పాఠశాల విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం:
    ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ, ఐబీ,టోఫెల్‌ నిలిపేస్తున్నట్లు సాక్షాత్తూ ఆర్థిక మంత్రే బడ్జెట్‌ ప్రసంగం ద్వారా ప్రకటించారు. ఇప్పటికే ఇంగ్లీష్‌ మీడియం, ట్యాబులు అన్నీ ఎగిరిపోయాయి. సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్టుకు ఇప్పటికే మంగళం పాడేశారు. మధ్యాహ్న భోజనం గోరుముద్ద కార్యక్రమం అత్యంత దారుణంగా ఇప్పటికే క్వాలిటీ తగ్గిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు–నేడు గాలికి వదిలేయడం వల్ల కలుషిత నీరు తాగి, క్వాలిటీ ఆఫ్‌ ఫుడ్‌ కూడా బాగోలేకపోవడం వల్ల 900 మంది పిల్లలు ఆస్పత్రుల్లో చేరారు అని జాతీయ పత్రికలు రాస్తున్నాయి.
(అంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా స్టోరీ చూపారు)
    ఆంధ్ర రాష్ట్రంలో బడి పిల్లల పరిస్థితి. ఇంత దారుణంగా విద్యారంగాన్ని నడుపుతున్నారు.

ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.7,150 కోట్లు:
    ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ కనిపిస్తోంది. ఆరోగ్యశ్రీ నడపాలంటే నెలకు రూ.330 కోట్లు కావాలి. డిపార్ట్‌మెంట్‌ లెక్కల ప్రకారమే రెండేళ్లకు రూ.4 వేల కోట్లు అవసరం. రెండేళ్లలో రూ.8 వేల కోట్లకు గాను వీళ్లు ఇచ్చింది ఎంత అంటే.. 2024–25 లో రూ.2259 కోట్లు, 2025–26లో రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ రూ.3వేల కోట్లకుపైనే చెబుతున్నారు. కానీ నమ్మేదానికి లేదు. వారి అసోసియేట్స్‌ దగ్గర నుంచి సమాచారం తీసుకుంటే రూ.2600 కోట్ల వరకు వచ్చిందని చెబుతున్నారు. ఆ లెక్కన చూస్తే రెండేళ్లలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.8 వేల కోట్లకు గాను పెండింగ్‌ అమౌంట్‌ ఇంకా రూ.3,150 కోట్లు చెల్లించాలి. ఈ సంవత్సరం 2026–27లో మరో రూ.4 వేల కోట్లు కావాలి. బకాయిలు రూ.3,150 కోట్లతో కలిపి మొత్తం రూ.7,150 కోట్లు ఆరోగ్యశ్రీ నడపడానికి అవసరం. కానీ వీళ్ల బడ్జెట్‌ చూస్తే రూ.4 వేల కోట్లు పెడుతున్నారు కానీ, ఖర్చులు మాత్రం రూ.2,200  కోట్లు దాటడం లేదు. వీళ్ల లెక్కల ప్రకారం పేదవాడు బతకాలో లేదో ప్రజలే అర్థం చేసుకోవాలి. 

రెండేళ్లుగా ఉద్యోగులకు జీతాలు పెరగలేదు:
    ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అన్నారు. అధికారంలోకి రాగానే ఐఆర్‌ అన్నారు. మూడు బడ్జెట్‌లు పెట్టారు. కనీసం ఒక్క పైసా జీతాలు పెరగలేదు. జీతాలు పెరగకపోగా మా హయాంలో ఐఆర్‌ ఇచ్చి, పీఆర్సీ చైర్మన్‌ను కూడా నియమిస్తే వీళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పీఆర్సీ చైర్మన్‌ను తొలగించారు. ఆయన త్వరగా రిపోర్టు గనుక ఇస్తే త్వరగా జీతాలు పెంచాల్సి వస్తుందేమోనని వారి భయం. అందుకే ఒకవైపున ఐఆర్‌ ఇవ్వకుండా మరోవైపు పీఆర్సీ చైర్మన్‌ని నియమించకుండా ఉద్యోగులను త్రిశంకు స్వర్గంలో తెచ్చి పెట్టారు. రెండేళ్లుగా ఉద్యోగులకు జీతాలు పెరగలేదు. నాలుగు డీఏలు పెండింగ్‌. ఐఆర్‌ లేదు. పీఆర్సీ లేదు. ఒకటో తేదీనే జీతాలన్నారు. అదైనా ఇచ్చారా అంటే.. అధికారంలోకి వచ్చిన మొదటి ఒక నెల మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు అది కూడా లేదు. జీపీఎఫ్, ఏపీ జీఎల్‌ఐ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్, సరెండర్‌ లీవ్స్‌.. వీటి కింద దాదాపు రూ. 35 వేల కోట్ల బకాయిలు. 
    2024–25లో ఉద్యోగుల జీతాల కోసం కేటాయించిన బడ్జెట్‌ రూ.62,806 కోట్లయితే 2025–26 రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ ప్రకారం జీతాలు రూ. 61,111 కోట్లకు తగ్గాయి. ఆశ్చర్యంగా జీతాలు పెరగాల్సింది పోయి తగ్గాయి. (కొంతమంది రిటైర్‌ అయిపోయి ఉంటారు). హౌస్‌ రెంట్‌ అలవెన్స్, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, అలవెన్స్‌ ఎర్నడ్‌ లీవ్స్, ఎల్టీసీ, ఓవర్‌టైమ్‌ అలవెన్స్, బేసిక్‌ పే.. ఇలా ఏది చూసినా అలాగే ఉంది. మొత్తంగా చూస్తే 2024–25లో రూ.62,806 కోట్లు కాగా, 2025–26 రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌లో రూ.61,111 కోట్లు. చంద్రబాబునాయుడు పుణ్యాన బడ్జెట్‌ మొత్తం అబద్ధాలు మోసాలుగా ఉంది.

‘ఇందాపూర్‌’ రూపంలో బయటపడ్డ చంద్రబాబు కుట్ర:
    హెరిటేజ్‌ కంపెనీ అఫిషియల్‌ వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 10, 2026న మాన్యుఫ్యాక్చర్‌ ఫ్లాంట్‌గా ఇందాపూర్‌ డెయిరీని చూపించారు. రెండో సైట్‌లో.. ఫిబ్రవరి 15, 2026 ఐదో రోజుల తరువాత కో–మాన్యుఫ్యాక్చర్‌ ప్లాంట్‌గా మారిన ఇందాపూర్‌ డెయిరీ. 
(అంటూ ఆ వెబ్‌సైట్‌ స్క్రీన్‌ షాట్స్‌ మీడియాకు పీపీటీలో చూపారు)
    ఇంకా ఇందాపూర్‌ రూపంలో చంద్రబాబు గుట్టు బయటç ³డగానే..14, ఫిబ్రవరి 2026న హెరిటేజ్‌ ఫుడ్స్‌ నేషనల్‌ సేల్స్‌ హెడ్‌ అండ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మార్కానందశాస్త్రి రాజీనామా చేశారు.
    చంద్రబాబు 2015లో అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్‌ యూనిట్, ఇందాపూర్‌ డెయిరీ నుంచి కిలో నెయ్యి రూ.278లకే సరఫరా చేసింది. 2016 మార్చి 18న ల్యాబ్‌ టెస్ట్‌ల్లో ఇందాపూర్‌ డెయిరీ నెయ్యి ఫెయిల్‌ అయ్యి డిస్‌క్వాలిఫై అయింది. అంటే కల్తీ జరిగిందనేగా దాని అర్థం. డిస్‌క్వాలిఫై అయిన 3 నెలల్లోనే అంటే మళ్లీ ఏప్రిల్‌ 26, 2016న ఇందాపూర్‌ డెయిరీకి మళ్లీ అర్హత కల్పించారు. దాంతో ఇందాపూర్‌ డెయిరీ మళ్లీ టీటీడీ బిడ్డింగ్‌లో పాల్గొంది.
(అంటూ ఆ ఆధారాలు కూడా పీపీటీలో ప్రదర్శించారు)
    ఆ తర్వాత కూడా నవంబర్‌ 27, 2018న హెరిటేజ్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ ఇందాపూర్‌ డెయిరీకి టెండర్‌ దక్కింది. కేజీ నెయ్యి రూ.321కే ఆర్డర్‌ ఇచ్చారు. 2024లో చంద్రబాబు అధికారంలోకి రాగానే మళ్లీ చక్రం తిప్పిన హెరిటేజ్‌ మాన్యుఫ్యాక్షరింగ్‌ యూనిట్‌ ఇందాపూర్‌ డెయిరీకి డిసెంబర్‌ 16, 2025న టెండర్‌ ఖరారు. కేజీ రూ.320కే గతంలో అమ్మిన ఇదే హెరిటేజ్‌ యూనిట్, ఇప్పుడు కేజీ రూ.658కి టెండర్‌ ఖరారు చేశారు.
    అంటే, ఒక భయాందోళన వాతావరణం సృష్టించి రూ.320కి కిలో నెయ్యి వస్తుందా అన్నట్లుగా ఎవర్ని రాకుండా అందర్ని భయపెట్టి, చివరకు చంద్రబాబు తన కంపెనీకి టెండర్‌ ఖరారు చేసుకున్నారు. 
    గతంలో టెండర్ల ప్రకారం నెయ్యిని సరఫరా చేసేవారు. గుడికి నెయ్యి సరఫరా చేసే ట్యాంకర్లు కూడా సెంట్రల్‌ గవర్నమెంట్‌ గుర్తింపు పొందిన ల్యాబ్‌లు ధ్రువీకరించిన రిపోర్టులతో రావాలి. ఇక్కడ సరఫరా చేసే కంపెనీలే దేశంలోని పలు దేవాలయాలకు నెయ్యి సరఫరా చేసేవి. ఇదే దశాబ్ధాలుగా జరుగుతుంది. ఆ రిపోర్టులు వచ్చిన తరువాత కూడా టీటీడీ ల్యాబ్‌లో కూడా టెస్ట్‌ చేస్తారు. ఇక్కడ పాస్‌ అయితేనే కొండ మీదికి పంపిస్తారు. ఇది ప్రక్రియ.  

భోలే బాబా అసలు పేరు  హ‌ర్ష్‌ ఫ్రెష్‌ డెయిరీ:
    ఈ భోలేబాబా డెయిరీనే  హ‌ర్ష్‌ డెయిరీ అని చూపే ఆధారాలు ఉన్నాయి. 2018 జూన్‌ 26న అంటే చంద్రబాబు ప్రభుత్వంలో భోలేబాబాకు టెక్నికల్‌ క్వాలిఫికేషన్‌ ఇస్తూ నాడు చంద్రబాబు హయాంలో టీటీడీ బోర్డు తీర్మానం. స్వయంగా భోలేæబాబా ప్లాంట్‌ని టీటీడీ బోర్డు పరిశీలించింది. టెక్నికల్‌ క్వాలిఫికేషన్‌గా నిర్ధారించామని టీటీడీ తీర్మానం చేసింది. బోలేబాబాకు ద్వారాలు తెరిచిందీ, ఆర్డర్లు ఇచ్చిందీ చంద్రబాబే. ఆ తర్వాత 6 మార్చి, 2019లో 82 వేల కేజీల నెయ్యి సపై్ల చేయడానికి భోలేబాబాకు చంద్రబాబు ప్రభుత్వంలోనే ఆర్డర్‌ ఇచ్చారు. హెరిటేజ్‌తో వ్యాపార భాగస్వామ్యం అన్నట్లుగా స్వయంగా తెలిపిన బోలేబాబా కంపెనీ. 
    వీళ్లు అంటారు బోలేబాబా రాజస్థాన్‌ది..బోలేబాబా ఉత్తరాఖండ్‌ది కాదు అని టీడీపీ బ్యాచ్‌ అంటున్నారు. హెరిటేజ్‌ హైదరాబాద్, హెరిటేజ్‌ విజయవాడ రెండూ  ఒక్కటి కాదా?. ఉత్తరాఖండ్‌కు టెస్ట్‌ కోసం పంపించింది వీళ్లే కాదా?, హెరిటేజ్‌ హెరిటేజే, బోలేబాబా బోలేబాబనే.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్‌ డెయిరీ టైమ్‌లైన్‌:
    మార్చి 16, 2024న ఎన్నికల కోడ్‌ వచ్చింది. మే 13, 2024న పోలింగ్‌ జరిగింది. మే 15, 2024లో టెండర్లు ఒపెన్‌ అయ్యాయి. ఎన్నికల రెండు రోజుల తరువాత టెండర్లు ఓపెన్‌ అయ్యాయి. జూన్‌ 4, 2024 ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జూన్‌ 12, 2024న ఏఆర్‌ డెయిరీ నెయ్యి సరఫరా చేయడం మొదలుపెట్టింది. ఏఆర్‌ డెయిరీ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్లు పాస్‌ అయ్యాయి. జులై 6, 2024న మరో నాలుగు ట్యాంకర్లు టెస్ట్‌లో ఫెయిల్‌ అయ్యాయి. జులై 23న ఎన్‌డీడీబీ రిపోర్టు వచ్చింది. ఈ నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపించారు. జులై 27న రిజెక్ట్‌ అయిన నాలుగు ట్యాంకర్లు శ్రీకాళహస్తి వద్ద రహస్యంగా ఉంచారు. ఆగస్టు, సెప్టెంబర్‌ 2024లో అవే ట్యాంకర్లు మళ్లీ టీటీడీకి వచ్చాయి. దీనికి టీటీడీ అభ్యంతరం చెప్పలేదు.
    ఆ తర్వాత సెప్టెంబర్‌ 18, 2024న చంద్రబాబు నెయ్యిలో జంతుకొవ్వు, చేప కొవ్వు ఉందని ఆరోపణలు చేశారు. టెండర్లు ఎప్పుడు ఖరారు అయ్యాయి. నెయ్యి ఎప్పుడు సరఫరా చేశారు. శాంపుల్స్‌ ఎప్పుడు రిజెక్ట్‌ అయ్యాయి. రిజెక్ట్‌ అయిన ట్యాంకర్లు ఎప్పుడు తిరిగి వచ్చాయి. వచ్చిన ట్యాంకర్ల నెయ్యి ఎప్పుడు వాడారు..ఇవన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయి కదా? వీటికి వైయస్‌ఆర్‌సీపీకి ఏం సంబంధం?.

మా ప్రభుత్వానికి ఏం సంబంధం?:
    అసలు అన్ని కనెక్షన్లు చంద్రబాబునాయుడు హయాంకు కనిపిస్తుంటే. వీళ్లను తీసుకొచ్చిన దగ్గర నుంచి, వాళ్ల హయాంలో సప్లయ్‌ చేయం దగ్గర నుంచి, ఇప్పుడు టెస్ట్‌ శాంపిల్స్‌ ఫెయిల్‌ అయితే మళ్లీ తిరిగి టీటీడీలోకి తీసుకురావడం దగ్గర వరకు అన్నీ ఆపక్కే కనపడుతుంటే, నువ్వు ఎందుకు 2019లో ఆపుతున్నావు? 2014 దాకా ఎందుకు చేయడం లేదు ఎంక్వైరీ?
    అసలు వైయస్సార్‌ సీపీ ప్రభుత్వానికి ఏరకంగా సంబంధం ఇది? 
టీటీడీలో ఒక రోబోస్ట్‌ ప్రొసీజర్‌ ఉంది. వచ్చే ప్రతి ట్యాంకరు కూడా అక్రిడేటెడ్‌ ల్యాబు రిపోర్టు తీసుకుని రావాలి. అక్రిడేటెడ్‌ ల్యాబు నుంచి రిపోర్టు తీసుకుని వస్తేనే ట్యాంకర్‌ రానిస్తారు. ఆ తర్వాత టీటీడీ ఆ అక్రిడేటెడ్‌ ల్యాబు రిపోర్టుతో సంతృప్తి చెందకుండా వాళ్లు కూడా మళ్లీ టెస్టులు చేస్తారు. ఆ టెస్టులో పాసైతేనే పైకి పంపిస్తారు. ఫెయిలైతే తిరిగి వెనక్కి పంపిస్తారు. ఇక్కడ కూడా వెనక్కి పంపించారు. క్లియర్‌ గా కనిపిస్తోంది.
    చంద్రబాబు హయాంలో 15 సార్లు అలా వెనక్కి వెళ్లాయి. వైయస్సార్‌ సీపీ హయాంలో గతంలో అలా 18 సార్లు వెనక్కి పంపించేశాం. టెస్టు ఫెయిల్‌ అయితే. అక్రిడేటెడ్‌ ల్యాబు రిపోర్టు అనుకూలంగా ఉన్నా టీటీడీ చేసిన టెస్టు ఫెయిలైతే వెనక్కి పంపించే సాంప్రదాయం. మరి అలాంటప్పుడు ఏరకంగా నువ్వు మాకు అంటగడుతున్నావు?
    ఈ వ్యవహారంతో వైయస్సార్‌ సీపీకి ఏం సంబంధం? తప్పు జరిగింది ఇప్పుడు చంద్రబాబు హయాంలో. రిజెక్ట్‌ చేసిన ట్యాంకర్లు మళ్లీ వెనక్కి తీసుకున్నావు. తీసుకుని నువ్వు వాడావు. సీబీఐ చెప్పింది నేను చెప్పలేదు. వాళ్ల ఛార్జిషీట్‌లో రాశారు. అందులో 44, 91, 64 పేజీల్లో ఈ విషయాలు స్పష్టంగా రాశారు.
(అంటూ వాటిని చదివి వినిపించారు)

ప్రీమియర్‌ డెయిరీ కూడా వారి హయాంలోనే:
    ఆరోపణ ఎదుర్కొంటున్న ప్రీమియర్‌ డెయిరీ టైమ్‌ లైన్‌. సీబీఐ సిట్‌ చార్జిషీటులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ 2013 నుంచి 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో వరుసగా టెండర్లు దక్కించుకుంటూ నెయ్యి సప్లయ్‌ చేసింది. ఈ విడత చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్లలో పాల్గొంది. ఇక బోలే బాబు, ఇందాపూర్, హెరిటేజ్‌ లకు చంద్రబాబు హయాంలో కనెక్షన్స్‌ ఇదివరకే చూపించాం. 
    చంద్రబాబు హయాంలో వీళ్లంతా ఆ రేట్లకు కోట్‌ చేశారు. చంద్రబాబు ఇప్పుడు వచ్చిన తర్వాత రేట్లు మారిపోయాయి. అప్పుడంతా చంద్రబాబు హయాంలో కిలో నెయ్యి రూ.270, రూ.320కి సరఫరా చేసిన వాళ్లు ఇప్పుడు ఏకంగా రూ.658 కోట్‌ చేశారు. ఇంతకు ముందు నేను చెప్పా కనెక్షన్‌.. భోలేబాబాకు ఉన్న కనెక్షన్, ఇందాపూర్‌కు ఉన్న కనెక్షన్‌. ఇందాపూర్‌ ఇంతకు ముందు ఏ రేట్లో కోట్‌ చేశారు, చంద్రబాబు హయాంలో ఎప్పుడు సప్లయ్‌ చేశారు, ఇప్పుడు మళ్లీ రూ.658 కి మళ్లీ టెండర్లు ఎలా దక్కించుకున్నారో చెప్పా. 
    ఇప్పుడు చెప్పండి.. ఈ డాక్యుమెంట్లన్నీ చూశారు. ఇంత ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి. అసలు చంద్రబాబు అనే వ్యక్తిని, హెరిటేజ్‌ అనే సంస్థ ఈ రెండూ తప్పు చేసినట్లు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు ఏరకంగా చంద్రబాబు అనే వ్యక్తి నాలుగు వేళ్లు తమవైపు చూపిస్తుంటే ఒకవైపు ఇలా వేలెత్తి ఇంకొకరి మీద ఎలా చెప్పగలుగుతారు? 
    దేవునితో చంద్రబాబు అబద్ధాలతో మోసాలతో దేవుడితో చెలగాటం ఆడాడు. అందుకే దేవుడే బుద్ధి వచ్చేట్టుగా మొటిక్కాయలు వేస్తున్నాడు. 

మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ.. 

తిరుమలలో ఏడు కొండలపై వైయస్ఆర్ గారే జీఓ ఇచ్చారు:
    జీవో నెం:746, 747 చూడండి. అసలు ఆ జీవోలిచ్చింది రాజశేఖరరెడ్డి గారు. ఆ జీవోలేంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాన్న. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఇంకో 19 గుడుల దగ్గర జరక్కుండా జీవోలిచ్చింది కూడా నాన్నే. వైయస్సారే.
(అంటూ ఆ జీఓ కాపీ పీపీటీలో చూపారు)

ఆ జీఓలు రద్దు చేస్తామన్న చంద్రబాబు:
    చంద్రబాబునాయుడు అప్పట్లో బీజేపీతో లేడు. ముస్లిం ఓట్లతో పని పడింది. క్రిష్టియన్‌ ఓట్లతో పని పడింది. అప్పుడు ఇదే చంద్రబాబు ఏమన్నాడు 2009లో.. 746, 747 జీవో వైయస్సార్‌ ఇచ్చారు, మేం వచ్చాక క్యాన్సిల్‌ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. మీ అందరికీ తెలుసుకోవాలి. 
(అంటూ ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు నాటి స్పీచ్‌ వీడియో ప్రదర్శించారు)

చివరగా,
    చంద్రబాబునాయుడు ఏ పార్టీతో ఉంటే ఆ పార్టీ పాట పాడతాడు. మళ్లా ఆయనకు ఓట్లు అవసరం ఉన్నప్పుడు ఆ పార్టీ వద్దు అనుకున్నప్పుడు, వేరే రకంగా పని పడినప్పుడు, మళ్లీ ఏరకంగా ప్లేటు మారుస్తాడన్నది వైయస్ఆర్ గారి హయాంలో జారీ అయిన జీవో నెం:746, 747 రద్దు చేస్తామంటూ చంద్రబాబు చేసిన ప్రసంగం చూశారు. 
    అదే ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ఏమంటున్నాడు అన్నది ఆలోచించండి. తిరుమల కొండలపై వైయస్సార్‌గారిపై పచ్చి అబద్ధాలు చెబుతూ నిందిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు క్యారెక్టర్‌ ఏమిటి? నైజం ఏమిటి? అనేది అందరికీ అర్థం అవుతుందని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.