భూసర్వే క్రెడిట్‌ చోరీకీ చంద్రబాబు నానా తంటా

22 Jan, 2026 18:50 IST


తాడేపల్లి: రీసర్వే వాస్తవాలు. దానిపై చంద్రబాబు కూటమి దుష్ప్రచారం.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ, చేస్తున్న రాజకీయ హత్యలపై వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏయే అంశంపై ఏం మాట్లాడారంటే..:

ఏనాడైనా ఆ ఆలోచన వచ్చిందా?:
    ఈ మధ్య కాలంలో చంద్రబాబుగారు మాట్లాడుతున్న మాటలు, భూముల రీసర్వేపై ఆయన మాటలు వింటుంటే ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్‌ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా? అనిపించేట్లుగా ఉంది. ఆ విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. చివరకు ఊసరవెల్లి కూడా చంద్రబాబునాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో!. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. 
    నేను సూటిగా చంద్రబాబునాయుడుగారిని అడుగుతున్నా మీ ద్వారా. ప్రజలందరి తరఫున కూడా అడుగుతున్నా. అయ్యా నాలుగుసార్లు సీఎం అని చెప్పుకునే మీకు భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన ఏనాడైనా వచ్చిందా? ఈరోజు క్రెడిట్‌ చోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతున్న మాటలకు నిజంగా ఈ పెద్దమనిషి సిగ్గుపడాలి. 

నేను ఆరోజే ఆలోచించాను:
అప్పటి వాస్తవ పరిస్థితి ఏమిటంటే..?:

    అసలు భూముల రీసర్వేకు మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? 2019కన్నా ముందు నా 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర మార్గమధ్యంలో రైతన్నలు పడుతున్న అవస్థలు, ఇబ్బందులు చూసిన తర్వాత.. భూములకు సంబంధించి వాళ్లు లేవనెత్తిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న తపన, తాపత్రయం నుంచి ఆ ఆలోచన వచ్చింది. అదే దీనికి మూలం. అసలు ఆరోజుల్లో చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నా పాదయాత్ర జరుగుతోంది. 2019కి ముందు. 
    ఇంకా ఆనాడు రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ పరిస్థితి ఎలా ఉందంటే.. సర్వేయర్లు లేరు. సరిపడా సిబ్బంది లేరు. పరికరాల్లేవు. లేటెస్ట్‌ టెక్నాలజీ అంతకన్నా లేదు. భూములెప్పుడైనా కూడా క్రయ విక్రయాలు జరిగినా లేకపోతే భాగ పరిష్కాల్లో భాగంగా ఏదైనా కుటుంబాల మధ్య డివిజన్‌ చేసుకున్న సబ్‌ డివిజన్‌ లేదూ, మ్యూటేషనూ లేదు. ఇవి కూడా జరిగేటివి కాదు.
    పైగా ఎడాపెడా లెఫ్ట్‌ రైట్‌ సెంటర్‌ ఈయన (చంద్రబాబు)కు ఎప్పుడు మూడ్‌ వస్తే అప్పుడు, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఎవరైనా నచ్చకపోతే అప్పుడు.. 22–ఏ. అంటే ప్రొహిబిటెడ్‌ ల్యాండ్‌ సేల్‌ (22–ఏ) లో భూములు పెట్టడం. అది రైతులను, ప్రజలను ఇబ్బంది పెడుతూ అవస్థలకు గురి చేస్తున్న పరిస్థితి. అలాంటి సవాలక్ష సమస్యలకు పరిష్కారంగా సమగ్రమైన భూసర్వే అండ్‌ సమగ్రమైన భూసంస్కరణలు చేయాలన్న ఆలోచన వచ్చింది.

మ్యానిఫెస్టోలోనూ పొందుపర్చాం:
    ఆ ఆలోచనను అమలు చేసేలా ఆ అంశాన్ని 2019 ఎన్నికల్లో మా మ్యానిఫెస్టోలో కూడా పొందుపర్చాం.
(అంటూ మ్యానిఫెస్టో పీపీటీలో చూపిన శ్రీ వైయస్‌ జగన్‌ దాన్ని చదివి వినిపించారు)
‘సుపరిపాలన విషయంలో రాష్ట్రంలో భూములన్నింటినీ సమగ్ర రీసర్వే చేయించి, భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలగజేస్తాం’.. అని చదివి వినిపించిన శ్రీ వైయస్‌ జగన్, అది తమ మ్యానిఫెస్టో ప్రామిస్‌ అని చెప్పారు.

ఎవరూ ఆలోచనకూ సాహసించలేదు:
అది ఒక మహాయజ్ఞం. అయినా మొదలుపెట్టాం:
    ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అది ఒక మహాయజ్ఞం అని తెలిసినా 2020 డిసెంబరు 21న ఆ మహా కార్యం మొదలుపెట్టాం. 100 సంవత్సరాల క్రితం 1923లో బ్రిటిష్‌ ప్రభుత్వ హయాంలో భూసర్వే జరిగింది. నాడు బ్రిటిష్‌ వాళ్లు సమగ్ర సర్వే చేశారు. దాని తర్వాత ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా సమగ్ర రీసర్వే అన్నది కనీసం ఆలోచన చేయడానికి ఎవరూ సాహసించలేదు. 
    కానీ, మా హయాంలో సమగ్ర భూ సర్వే, అన్ని రికార్డ్స్‌ అప్‌డేట్‌ చేయడంతో పాటు, వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చే దిశలో ఒక గొప్ప అడుగు పడింది ఆరోజు. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక గొప్ప అధ్యాయం అది. 
    సమగ్ర రీసర్వేతో కూడిన సంస్కరణలు ఒక మహాయజ్ఞం. ఆ పదం  ఎందుకు వాడుతున్నాను అంటే.. ఒకసారి ఆ లోతులోకి పోతే మీతోపాటు ప్రజలందరికీ కూడా అర్థం అవుతుంది అసలు ఎంత లోతుగా పోయామంటే..
    ‘ప్రజలకు, రైతులకు వివాదాలు లేని విధంగా.. ఐ రిపీట్‌ దీస్‌ వర్డ్స్‌.. వివాదాలు లేని విధంగా.. పారదర్శకంగా భూములు సర్వే చేయడంతో పాటు, భూరికార్డులన్నీ కూడా అప్‌డేట్‌ చేయడం. వాటిని ట్యాంపర్‌ చేయలేని విధంగా ఫిజికల్‌ అండ్‌ డిజిటల్‌ ఫార్మాట్‌లో రకరకాలుగా వివిధ చోట్ల వాటిని భద్రపరచడం. ఇంకా భూ యజమానులకు, రైతులకు శాశ్వత యాజమాన్య పత్రాలు క్లియర్‌ టైటిల్స్‌ ఇవ్వడమే కాదు.. ఆ క్లియర్‌ టైటిల్స్‌కు ప్రభుత్వం పూచీకత్తుగా గ్యారెంటీగా నిలబడడం’.

ఏ స్థాయిలో, ఎంత ప్రయోజనకరంగా చేశామంటే..:
    మోస్ట్‌ అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ ఫీచర్స్‌తో ఎవరూ కూడా ట్యాంపర్‌ చేయలేని విధంగా క్యూఆర్‌ కోడ్‌ ను సైతం ఈ పాస్‌ బుక్స్‌లో పొందుపరుస్తూ, ఫిజికల్‌గా కూడా ఎవరూ ట్యాంపర్‌ చేసే పరిస్థితి లేకుండా.. పట్టాదారు పాసుపుస్తకాలివ్వడం జరిగింది. టైటిల్‌ మారినా కానీ, భాగాల పరిష్కారంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య లేదా,  అన్నదమ్ముల మధ్య టైటిల్స్‌ మారినా లేదా క్రయవిక్రయాల ద్వారా ఏదైనా టైటిల్స్‌ మారినా కూడా ఆటోమేటిక్‌ సబ్‌ డివిజన్స్, ఆటోమేటిక్‌ ప్రోటోకాల్‌ ప్రకారం మ్యూటేషన్‌ జరగడం. ఇంకా వాటికి సంబంధించిన రికార్డులన్నీ ఆ గ్రామంలోనే, సచివాలయంలోనే భద్రపర్చడం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచడం. 
    చివరికి గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా జరిగేట్టుగా చేయడం. ఇదొక్కటే కాదు.. రియల్‌ టైమ్‌ అలర్ట్స్‌.. మీరు ఏదైనా భూమి అమ్మినా, కొనుగోలు చేసినా, మీ భూమికి సంబంధించిన లావాదేవీలు ఎక్కడైనా జరిగినా మీకు (మీ ఫోన్‌కు) రియల్‌ టైమ్‌ అలర్ట్స్‌ వస్తాయి. రియల్‌ టైమ్‌ అలర్ట్స్‌తో మన గవర్నమెంట్‌ పోర్టల్‌ను అప్‌ గ్రేడ్‌ చేయడమే కాకుండా రియల్‌ టైమ్‌ డేటాతో దాన్ని అప్‌డేట్‌ చేయడం జరిగింది.

బాబుగారు ఇలాంటివి విన్నావా? చూశావా? చేశావా?:
    చంద్రబాబునాయుడు గారు 8 పదుల వయసున్నా కూడా.. ఎప్పుడైనా ఇలాంటివి విన్నావా? చూశావా? చేశావా? అని అడుగుతున్నా చంద్రబాబును. 
    ఇంకా ఆ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసే వాళ్లం. అది ఏ స్థాయిలో ఉండేదంటే..
(అంటూ 2022, మార్చి 31న నిర్వహించిన రివ్యూ వీడియో ప్రదర్శించారు)
    అలా ప్రతి విషయంలో ఏ స్థాయిలో ప్రజలకు, రైతులకు మేలు జరగాలని, ట్యాంపర్‌ ఫ్రీ డాక్యుమెంట్స్‌ వాళ్లకు అందజేయాలని ఏ స్థాయిలో తపన పడ్డామో.. తాపత్రయ పడ్డామో.. చెప్పడానికి, ఆ రివ్యూ మీటింగ్స్‌లో మేము తీసుకున్న జాగ్రత్తలు, వాటి సీరియస్‌నెస్‌ చెప్పడానికే ఆ వీడియో చూపాము.

ఆ బృహత్తర కార్యక్రమం ఒక రికార్డ్‌:
    నిజంగా ఈ సమగ్ర సర్వే కోసం మేము చేసిన ప్రతి ప్రయత్నమూ కూడా ఒక రికార్డే. ఐ యూస్‌ దట్‌ వర్డ్‌ రికార్డే. ఏకంగా 15వేల గ్రామ సచివాలయాలు ఒక రికార్డ్‌.. నెవర్‌ ఇన్‌ ద పాస్ట్‌.. ప్రతి ్రగ్రామ సచివాలయంలో పది మంది ఉద్యోగులను నియమించడమూ ఒక రికార్డే. దీని కోసం ఒకే ఒక్క నోటిఫికేషన్‌. ఏకంగా 1.34 లక్షం ఉద్యోగుల  నియామకం. ఎవరూ, ఎన్నడూ అధిగమించలేని, తుడిచి వేయలేని ఒక సూపర్‌ రికార్డు. 
    ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఏర్పాటు చేయడమే కాదు.. అందులో ఒక వీఆర్వో, ఒక సర్వేయర్, ఒక డిజిటల్‌ అసిస్టెంట్‌.. వీళ్లంతా కూడా 15 వేల సచివాలయాల్లో ఉన్నారు. సర్వేయర్లు, వీఆర్వోలు, డిజిటల్‌ అసిస్టెంట్లు దాదాపు 40 వేల మంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.. నెవర్‌ ఇన్‌ ద హిస్టరీ..నెవర్‌ ఇన్‌ ద పాస్ట్‌.
    ఈ స్థాయిలో ఒక వ్యవస్థను సృష్టించి.. రైతులకు, ప్రజలకు మంచి చేయాలి. శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడాలి. పూర్తి ప్రక్షాళన చేసి, సమగ్ర భూ సర్వే చేసి, ట్యాంపర్‌ ఫ్రీ డాక్యుమెంట్స్‌ చేతిలో పెట్టి.. తర్వాత కూడా ఆ సిస్టంను మెయింటెయిన్‌ చేయాలని తపన పడ్డ్డ మా వంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. 

కనీసం సిగ్గుండాలి కదా?:
    మరి ఇవన్నీ తానెప్పుడూ కూడా చేయకుండా మరి ఏ రకంగా చంద్రబాబుగారు ఈ రికార్డును తన ఖాతాలోకి వేసుకుంటూ క్రెడిట్‌ చోరీకి ఎలా పాల్పడతారని అడుగుతున్నాను. నిజంగా ఇవన్నీ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబుగారి హయాంలో జరగలేదు. మరి సిగ్గుండాలి కదా క్రెడిట్‌ చోరీ చేయడానికి?.

సర్వేలో మరో కీలక ఘట్టం:
    రీసర్వే ప్రక్రియను సమర్థంగా కొనసాగించడానికి అత్యున్నతమైన కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సర్వే ఆఫ్‌ ఇండియా’తో ఒప్పందం కుదుర్చుకున్నాం. డిసెంబర్‌ 9, 2020న ఏపీ ప్రభుత్వం సర్వే ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం కుదిరిన తర్వాత ఇద్దరం అడుగులు కలసికట్టుగా వేయడం మొదలుపెట్టాం. యూరప్, అమెరికాల్లో ఏ టెక్నాలజీని వాడుతున్నారో.. ఆ టెక్నాలజీని ఇక్కడికి తీసుకువచ్చాం. ఆ టెక్నాలజీని వాడటం కోసం తెచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 70కి పైగా కోర్స్‌ (సీఓఆర్‌ఎస్‌–కంటిన్యూయస్‌లీ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్స్‌) ఏర్పాటు చేశాం. ఇంకా 3,640 గ్లోబల్‌ నావిగేషన్‌ సిస్టం రిసీవర్స్‌ (జీఎన్‌ఎస్‌ఆర్‌) ఏర్పాటు చేశాం. వాటితో పాటు, హై యాక్యురసీ కోసం గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (జీపీఎస్‌) వాడిన ప్రభుత్వం మాది.
    ఈ సమగ్ర రీ సర్వే కోసం 2 విమానాలు, 4 హెలికాప్టర్లు, 200కు పైగా హై ఎండ్‌ డ్రోన్స్‌ తొలిసారిగా వాడిన ప్రభుత్వం మాది. దీనిపై సిబ్బందికి పూర్తి అవగాహన కోసం 40 వేల మందికి 70సార్లు ట్రైనింగ్‌ ఇచ్చాం. కొన్ని కోట్ల సర్వే రాళ్లను గ్రామాలకు తరలించాం. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు. ఇంత గొప్ప యజ్ఞం చేశాము కాబట్టే 5 సెంటీమీటర్లు కూడా తేడా రాకుండా మేము కొలతలు వేశాం.  
    చంద్రబాబులా మేము ఎప్పుడూ కూడా కబుర్లు చెప్పలేదు. గొప్ప వ్యవస్థను క్రియేట్‌ చేశాం. గొప్ప టెక్నాలజీని అడాప్ట్‌ చేసుకున్నాం. గొప్పగా అడుగులు పడ్దాయి. అక్కడితో ఆగిపోలేదు. ఎక్కడికక్కడ వివాదాల పరిష్కారం కోసం మండలానికి ఇద్దరు అధికారులు చొప్పున 1,358 మండల మొబైల్‌ మెజిస్ట్రేట్లు.. అక్కడికక్కడ పరిష్కారాలు చూపడం కోసం 1,358 మండల మొబైల్‌ మెజిస్ట్రేట్లు.. దే వర్‌ ఓన్‌ ద మూఫ్‌. మండలానికి ఇద్దరు అధికారులు చొప్పున. అంటే, న్యాయాన్ని ప్రజల ముంగిటకే తీసుకువచ్చి వారికి శాశ్వత పరిష్కారాన్ని చూపెట్టే దిశగా.. అక్కడికక్కడే.. ప్రజల సమక్షంలోనే.. వారి గ్రామానికే వీళ్లు వచ్చి కూర్చుని రికార్డులు అక్కడికక్కడే చూసి వివాదాలు సెటిల్‌ చేసే విధానం తీసుకొచ్చాం.
    అదే కాకుండా రియల్‌ టైం అప్‌ డేట్స్‌ తో ఏపీ గవర్నమెంట్‌ పోర్టల్‌ ‘మీ భూమి’ వెబ్‌ పోర్టల్‌ ను మేము అప్‌ గ్రేడ్‌ చేశాం.. మీ ల్యాండ్‌ పార్సిల్స్‌ వివరాలను.. వాటిపై ఏ ట్రాన్సాక్షన్‌ జరిగినా మీకు రియల్‌ టైమ్‌ అలెర్ట్స్‌ వచ్చే విధంగా ఈ పోర్టల్‌ను అప్‌ గ్రేడ్‌ చేశాం. అందుకే దీన్ని మహాయజ్ఞం అన్నాం.

ఆయనకు చిత్తశుద్ధి లేదు. అవగాహన తక్కువే:
    చంద్రబాబుగారికి చిత్తశుద్ధి లేదు. సీరియస్‌ కూడా లేదు ఆయనకు. ఎవరైనా చేస్తే ఆ క్రెడిట్‌ తానే తీసుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప, ఏదైనా చేయాలని కానీ, ఒకవేళ చేస్తే దాన్ని చక్కగా చేయాలన్న చిత్తశుద్ది కూడా ఉండదు. బేసిగ్గా ఆయనకు అవగాహన కూడా తక్కువే. 
    సర్వే అంటే ఏమిటనేది చంద్రబాబుకు అవగాహన కూడా తక్కువే. ఎందుకంటే, ఎప్పుడైనా అందులో ఇన్‌వాల్వ్‌ అయి ఉంటే కదా?. ఏనాడైనా చేయాలని తపన, తాపత్రయం పడి ఉంటే కదా. ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే..
    అసలు సర్వే అన్నది సర్వే రాళ్లు లేకుండా ఎలా పూర్తవుతుంది? ఈ  పెద్ద మనిషి అంటాడు.. కొన్ని కోట్ల సర్వే రాళ్లను చేయించి గ్రామాలకు తరలించారని. బుద్ది లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. సర్వే అనేది సర్వే రాళ్లు లేకుండా ఎలా పూర్తయినట్లు.? ఏ రైతుకైనా, ఏ భూ యజమానికైనా సర్వే రాళ్లను పాతితేనే కదా సర్వే పూర్తయినట్లు. ఆ భూమిలో సర్వే చేసినట్లు పక్కా గుర్తు సర్వే రాయి. అది ఒక విశిష్ట రాయి.. ఒక విశిష్ట మార్కర్‌ ఏదైనా ఉండాలి కదా?.
    ఏ రాయి  పడితే ఆ రాయిని పెట్టేసి.. ఇదే సర్వే రాయి అని  చెప్పడం మొదలుపెడితే దానికి బౌండరీస్‌ ఎలా ఫిక్స్‌ అవుతాయి. లేదంటే ఏ రాయిని పడితే ఆ రాయిని చూపిస్తే అదే సర్వే రాయి అని చెబితే మళ్లీ కథ మొదటికి రాదా? సర్వే రాయి అనేది ఒక ప్రత్యేక, వివిష్ట రాయిగా ఉండాలి. ఒక మార్కర్‌గా ఉండాలి. అందుకే యునిక్‌ పద్ధతిలో సర్వే రాళ్లను ప్రభుత్వం ఉచితంగా రైతులకు సరఫరా చేసింది. యూనిక్‌గా ఉండేందుకు ‘శాశ్వత భూ హక్కు.. భూ రక్ష’ అని పేరు పెట్టాం. అదే సర్వే రాళ్ల మీద రాశాం.

ఎన్నికల నాటికే 6 వేలకు పైగా గ్రామాల్లో..:
    ఇంత పెద్ద వ్యవస్థను క్రియేట్‌ చేసి మా ప్రభుత్వ హయాంలోనే డ్రోన్‌ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేశాం. దీంతోపాటు ఓఆర్‌ఐ (ఆర్థో రెక్టిఫైడ్‌ రాడార్‌ ఇమేజెస్‌)ని కూడా తయారు చేసి జిల్లాలకు పంపడం కూడా మా హయాంలోనే పూర్తయింది. ఎన్నికల నాటికే అది రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయడమే కాకుండా 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో మిగిలిన అన్ని రకాల సర్వేలు కూడా పూర్తి చేసి రైతుల హద్దులను కూడా మార్కు చేసి సర్వే రాళ్లను కూడా పాతడం పూర్తయింది. ఈ 6800 గ్రామాల్లో రికార్డులన్నీ అప్‌డేట్‌ చేసి సబ్‌ డివిజిన్లు, మ్యూటేషన్లు పూర్తి చేసి, ప్రతి ల్యాండ్‌ పార్శిల్‌కి ఒక యూనిక్‌ నెంబర్‌ ఇచ్చి ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌ని కూడా జియో ట్యాగింగ్‌ చేసి దాన్ని కూడా పాస్‌ బుక్‌లో పొందుపరిచి 30 లక్షల మంది రైతులకు వారి సమస్యలన్నీ మొబైల్‌ మెజిస్ట్రేట్‌లతో తీర్చి మరీ వివాదాలు లేని విధంగా మోస్ట్‌ అడ్వాన్సడ్‌ సెక్యూరిటీ ఫీచర్స్‌తో క్యూఆర్‌ కోడ్‌ కూడా పొందుపరిచి మంచి క్వాలిటీతో పాస్‌ పుస్తకాలు అందజేశాం.
    ఇంకా రియల్‌ టైమ్‌ అలర్ట్స్‌ వచ్చే విధంగా ‘మీ భూమి’ ఏపీ గవర్నమెంట్‌ పోర్టల్‌ కూడా అప్‌గ్రేడ్‌ పూర్తి చేశాం. ఈ క్యూఆర్‌ కోడ్‌ ని గనుక మొబైల్‌ తో స్కాన్‌ చేస్తే జియో ట్యాగింగ్‌ చేయడం వల్ల అక్షాంశాలు, రేఖాంశాలతో సహా మొత్తం ల్యాండ్‌ వివరాలు వచ్చేస్తాయి. అన్ని వివరాలు కూడా కనిపిస్తాయి.

రియల్‌ టైమ్‌ అలర్ట్స్‌తో హైసెక్యూరిటీ పాస్‌ పుస్తకాలు:
    రైతులు, భూ యజమానులకు ఇంత గొప్పగా భద్రత కల్పించే పని చంద్రబాబు ఏనాడైనా చేశాడా అని సీరియస్‌ గా అడుగుతున్నా. వారు నష్టపోని విధంగా ట్యాంపర్‌ ప్రూఫ్‌ డాక్యుమెంట్స్‌ ఇచ్చే విధంగా చంద్రబాబు ఏనాడైనా తాపత్రయపడ్డాడా? ఇంత చేసిన మా గురించి ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు.
    ఇప్పుడు చెప్పండి ఎవరు దొంగలు? ఎవరు కబ్జా కోరులు? ఎవరు రైతులు, భూ యజమానులకు రక్షణ కల్పించారు? ప్రజల ఆస్తులను కొల్లగొట్టాలనుకుంటే ఇంత పక్కాగా యూనిక్‌ రాళ్లు పాతి, ల్యాండ్‌ పార్శిల్స్‌కి నలువైపులా అక్షాంశాలు రేఖాంశాలతో జియో ట్యాగింగ్‌ చేసి.. ఎవరూ ట్యాంపర్‌ చేయలేని విధంగా అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ ఫీచర్స్‌తో క్యూఆర్‌ కోడ్‌తో కూడిన పాస్‌ బుక్‌ని తయారు చేసి అందజేస్తారా? చెడు ఉద్దేశాలుంటే ఈ విధంగా మేలు చేస్తారా? అబద్ధాలకైనా ఒక హద్దూ పొద్దూ ఉండాలి. 
    ఆనాడు మాపై చంద్రబాబునాయుడు చేసిన విష ప్రచారం అంతా ఇంతా కాదు. పాత పట్టాదారు పాస్‌ బుక్‌ ఒకసారి పరిశీలిస్తే ల్యాండ్‌  వివరాలన్నీ చేతితో రాసి ఉంటాయి. 
(అంటూ పట్టాదారు పాస్‌ పుస్తకాల ఫొటోలు చూపారు)
    వాటిలో ఎక్కడా మ్యాప్‌లు, జియో ట్యాగింగ్‌ చేసిన  ల్యాండ్‌ పార్సిల్స్‌ అసలే లేవు. క్యూఆర్‌ కోడ్‌ అసలే లేదు. యూనిక్‌ ల్యాండ్‌ పార్సిల్‌ అంతకన్నా లేదు. 

నీతి ఆయోగ్‌ సైతం ప్రశంసించింది:
    కొత్త పాస్‌ బుక్‌లో సబ్‌ డివిజన్‌ చేసి మ్యూటేషన్‌ చేసిన తర్వాత యూనిక్‌ ల్యాండ్‌ పార్సిల్‌ నెంబర్‌ జియో ట్యాగింగ్‌ చేసి 5 సెం.మీ తేడా కూడా లేకుండా అక్షాంశాలు, రేఖాంశాల కొలతలు, ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్, క్యూఆర్‌ కోడ్‌ ఇవన్నీ మా పాసుబుక్‌లో ఉంటాయి. పాస్‌ బుక్‌ చివర్లో మీ భూమి వెబ్‌సైట్‌ని అప్‌గ్రేడ్‌ చేసి రైతుల వివరాలు అప్‌డేట్‌ చేసి రియల్‌ టైమ్‌ అలెర్ట్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చివరి పేజీలో రైతులకు సూచనలు చేశాం. 
    ఇంత గొప్పగా చేశాం కాబట్టే నీతి ఆయోగ్‌ కొనియాడింది. కేరళ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చి ఇక్కడ జరుగుతున్న రీసర్వేను అధ్యయనం చేసి వెళ్లారు. మహారాష్ట్ర ఇక్కడికి వచ్చి ప్రశంసలు కురిపించింది.
(అంటూ ఆ క్లిప్పింగ్స్‌ చూపారు)
    అసోం టీమ్‌ ఇక్కడ పర్యటించి మా ప్రభుత్వ సహకారం కోరింది. సర్వే ఆఫ్‌ ఇండియా అప్పటి డైరెక్టర్‌ ఎస్వీ సింగ్‌ గారు మా ప్రభుత్వ పనితీరును ఎంతగానో మెచ్చుకున్నారు.
(అంటూ 2022, నవంబరు 23న నరసన్నపేటలో జరిగిన సభలో ఎస్వీ సింగ్‌ ప్రసంగం వీడియో ప్రదర్శించి చూపారు)

అక్కసుతో దారుణంగా విష ప్రచారం:
    మేం సంకల్పంతో పని చేస్తుంటే ఈ యజ్ఞ ఫలాలు రైతులకు, భూ యజమానులకు అందకూడదని.. అలాగే ఎక్కడ వైయస్‌ జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని రాక్షసులకన్నా దారుణంగా చంద్రబాబు, ఆయన ఎల్లో గ్యాంగ్‌ విశ్వప్రయత్నాలు, కుట్రలు చేశారు. ఎన్నికలు దగ్గరికి వచ్చే సరికి చంద్రబాబు ప్రధాన రాక్షసుడి పాత్ర పోషిస్తే, ఆయన లెఫ్ట్, రైట్‌ ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి అసిస్టెంట్‌ పాత్ర పోషించారు. ‘మీ భూమి మీది కాదట. కాళ్ల కింద నేల కదిలిపోతుందట’.. ఆ హెడ్డింగ్‌లు ఏంటి? ఆ రాతలేంటి? వీళ్ల దుర్మార్గం నిజంగా ఎన్నికలు వచ్చేసరికే రైతు గుండెల్లో పలుగు రాళ్లు వేసినట్లుగా విష ప్రచారం చేశారు. భూరక్ష, భూ సురక్ష అని పేర్లతో రాళ్లు పాతి మంచి చేస్తే, ఇలాంటి వక్రీకరణలు రాశారో చూశాం.

ఎన్నాళ్లు నిజాలు దాచగలుగుతారు:
    పోలింగ్‌ మే 14న ఉంటే, మే 10న ఈనాడులో ఏకంగా ‘మీ భూమి మీది కాకుండా పోతుంది’ అని ఒక ప్రకటన ఇచ్చారు. గుర్గావ్‌ నుంచి కొన్ని కోట్లు ఖర్చు చేసి ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ చేశారు. వైయస్‌ఆర్‌సీపీకి ఓట్లు వేస్తే మీ భూమి మీది కాకుండా పోతుందని విష ప్రచారం చేశారు.  తప్పుడు రాతలు, విషపూరిత ప్రచారం, వక్రీకరణలతో ప్రజలను భయాందోళనకు గురి చేశారు. ఒకటే అడుగుతున్నాను.. చంద్రబాబు రాజకీయంగా తాత్కాలికంగా ప్రయోజనం పొంది ఉండవచ్చు. కానీ నిజాలను దాచలేరు.
    ఈ భూముల సర్వే విషయంలో ఆ రోజు వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలు, దాని ద్వారా రైతులకు, భూ యజమానులకు ఆ భూమి ఉన్నంతకాలం నిలిచిపోతాయి.

రూ.400 కోట్లు రాయితీ:
ఆ క్రెడిట్‌ కోసం చంద్రబాబు తంటా!:

    చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాను. సమగ్ర సర్వే వల్ల భూములు పోతాయని, ల్యాండ్‌ టైటిలింగ్‌ వల్ల ప్రజల ఆస్తులు కబ్జాకు గురవుతాయని ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న వ్యక్తిగా పూర్తిగా యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు?
    మా ప్రభుత్వ హయాంలో మేం చక్కగా సర్వే చేసినందుకు, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో బాగా చేశారని కేంద్రం నుంచి రూ.400 కోట్లు మాకు రాయితీ వస్తే.. ఆ క్రెడిట్‌ను చంద్రబాబు ఖాతాలో వేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని ట్వీట్‌ చేయడం, చంద్రబాబు ‘థ్యాంక్యూ’ అని రీట్వీట్‌ చేయడం ఆశ్చర్యంగా ఉంది. అసలు క్యూఆర్‌ కోడ్‌ చంద్రబాబు తెచ్చారంటూ సొల్లు మాటలు మాట్లాడుతున్నారు.

చంద్రబాబు నాతో కూడా పోటీ పడలేకపోతున్నారు:
    ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మనిషి ఈ స్థాయిలో అబద్ధాలు ఆడుతున్నారు. మా నాన్నతో చంద్రబాబు సమకాలికులు. నేను కొడుకు వయసులో ఉన్నాను. నాతో కూడా పోటీ పడలేక నా క్రెడిట్‌ను కూడా తీసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రీ–సర్వేలో ఏపీ ప్లాటినమ్‌ గ్రేడింగ్‌ సాధించిందని 2023 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చింది. ఈ రూ.400 కోట్లు ఎప్పుడు వచ్చాయో తెలుసా? 2025 ఫిబ్రవరి 19న వచ్చాయి. చంద్రబాబు చేసిన పనికి కేంద్రం ఈ డబ్బులు ఇచ్చిందని క్రెడిట్‌ చోరీకి పడరాని పాట్లు పడుతున్నారు. 
    మాకు నాలుగేళ్లు సమయం పడితే, చంద్రబాబు ఆరు నెలల్లో చేసిన పనికి ప్లాటినమ్‌ గ్రేడింగ్‌ ఇచ్చారట!. ఏంటి ఈ సొల్లు మాటలు. దానికి అబద్ధాలు జోడించి బ్లాక్‌చైన్, క్యూఆర్‌ కోడ్, మన్ను అంటూ మాట్లాడుతున్నారు.

ఆ ప్రచారం ధర్మమేనా?:
    ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన ఆరోపణలు ఏం కావాలి? ఒక అబద్ధాన్ని ప్రజలను నమ్మించేందుకు ఈ స్థాయిలో గ్లోబల్‌ ప్రచారం చేయడం ధర్మమేనా? ప్రజల జీవితాలతో చెలగాటమాడటం న్యాయమేనా? చంద్రబాబు తన గుండెలపై చేయి వేసుకొని ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈ మాదిరిగా 15 వేల గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడమే కాకుండా, ఏకంగా 40 వేల మంది సర్వేయర్లు, డిజిటల్‌ అసిస్టెంట్లు, వీఆర్‌వోలను నియమించి, కోట్ల సంఖ్యలో యూనిక్‌ కోడ్‌ రాళ్లను గ్రామాలకు చేర్చడం, క్యూఆర్‌ కోడ్, పాస్‌బుక్కులు ఇవ్వడం, సబ్‌డివిజన్, మ్యూటేషన్‌ చేసి, యూనిక్‌ ల్యాండ్‌ పార్సిల్‌ ఐడీ ఇచ్చి, పాస్‌బుక్‌లో జియో ట్యాగింగ్‌తో ల్యాండ్‌ మ్యాప్‌లు పెట్టి, అడ్వాన్స్‌ సెక్యూరిటీ ఫీచర్లతో క్యూఆర్‌ కోడ్‌ పొందుపరిచి పాస్‌బుక్‌ ఇచ్చాం. ప్రోటోకాల్‌లో భాగంగా ఆటోమేటిక్‌ మ్యూటేషన్, ఆటోమేటిక్‌ సబ్‌డివిజన్‌ జరిగేలా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. రియల్‌టైమ్‌ అలర్ట్‌లతో మీ భూమి ఏపీ గవర్నమెంట్‌ పోర్టల్‌ను అప్‌గ్రేడ్‌ చేసి, భూ రికార్డులు ఆటోమేటిక్‌గా మీకు అలర్ట్‌లు వచ్చే విధంగా మార్పులు తీసుకొచ్చాం.

40 వేల మంది ఉద్యోగుల కష్టం, శ్రమ ఉంది:
    దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న కార్యక్రమం ఇది. 40 వేల మంది ఉద్యోగుల నాలుగేళ్ల శ్రమ, కష్టం ఉంది. టెక్నాలజీ ఉంది. కోట్లాది సర్వే రాళ్లు ఉన్నాయి. ఇంత ఎఫర్ట్‌తో రైతులకు, భూ యజమానులకు ట్యాంపర్‌ చేయలేని విధంగా పాస్‌బుక్కులు అందించాలనే తపనతో పని చేశాం. అందుకే ఈ పథకానికి ‘జగనన్న భూ హక్కు – భూరక్ష’ అని పేరు పెట్టాం. 

సేమ్‌ టు సేమ్‌. కలర్‌ మాత్రమే మార్పు:
    ఒకసారి చంద్రబాబు నాయుడు ఇస్తున్న పాసుబుక్, మన హయాంలోని పాసుబుక్‌ చూద్దామా.. ఈయన మనం ఇచ్చిన 30 లక్షల పాస్‌ బుక్‌లు వెనక్కి తీసుకొని, ఆ పాస్‌బుక్కులను చంద్రబాబు కలరింగ్‌ మార్చి ఇస్తున్న వాటిల్లో తేడా ఏంటో చూద్దాం..
    సేమ్‌ అదే క్యూఆర్‌ కోడ్, అదే ఫార్మాట్‌. జీయో కోఆర్డినేట్స్‌తో ల్యాండ్‌ పార్సల్‌ నంబర్, జియో కోఆర్డినేట్స్‌ ల్యాండ్‌ మ్యాప్, విస్తీర్ణం కూడా తెలుపుతున్న వివరాలు, విత్‌ జియో కోఆర్డినేట్స్, విత్‌ క్యూఆర్‌ కోడ్‌. ల్యాండ్‌ కోఆర్డినేట్స్, ల్యాండ్‌ ఎక్స్‌టెంట్, విత్‌ క్యూ ఆర్‌ కోడ్‌ సేమ్‌. 
చివరి పేజీల్లో చూస్తే వైఎస్సార్‌ సీపీ హయాంలో అప్‌గ్రేడ్‌ చేసిన మీ భూమి ఏపీ గవర్నమెంట్‌ పోర్టల్‌ కాపీ కొట్టి కొత్త పాస్‌బుక్కుల్లో పెట్టుకున్నాడు. కేవలం కలర్‌ ఒక్కటే మార్చాడు. 
    మనం అప్‌గ్రేడ్‌ చేసిన ఠీఠీఠీ.ఝ్ఛ్ఛbజిౌౌఝజీ.్చp.జౌఠి.జీn వెబ్‌సైట్‌ పోర్టల్‌. మనం ఆ టైమ్‌లో అప్‌గ్రేడ్‌ చేసి రియల్‌ టైమ్‌ అలర్ట్స్‌ వచ్చేట్టుగా దీంట్లో మార్పులు తీసుకొచ్చి, రియల్‌ టైమ్‌ డాక్యుమెంట్స్‌ అప్‌డేట్‌ అయిన వెంటనే, రియల్‌ టైమ్‌ డేటాతో అలర్ట్స్‌ వచ్చేలా మార్పులు మనం తీసుకొచ్చాం. 
    చంద్రబాబు ఏం చేస్తున్నాడు.. అయ్యే పాస్‌బుక్కులు తీసుకోవడం, కలర్‌ మార్చడం.. ఇవ్వడం. అన్నీ సేమ్‌ టు సేమ్‌.. ఒక్క కలర్‌ తప్ప. ఇందులో చంద్రబాబు చేసిందేముంది. రంగులు మార్చడం తప్ప. ఈ 19 నెలల చంద్రబాబు పాలనలో ఆయన చేసింది ఏమిటంటే.. మేము ఇచ్చిన పుస్తకాలు తిరిగి వెనక్కి తీసుకొని, కొత్తగా వాటికి రంగులు మార్చి ప్రింటింగ్‌ చేసి ఇవ్వడం. అది కూడా కరెక్ట్‌గా ఇవ్వడం లేదు. దాంట్లో విపరీతమైన తప్పులు దొర్లుతున్నాయి. పేర్లు, ఫొటోలు, ఐడీ నంబర్లు, విస్తీర్ణం అన్నీంట్లో తప్పులు వస్తున్నాయి. మళ్లీ వాటిని సరిదిద్దుకోవడానికి రైతులు వెళ్లి లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి. 

ఆ పనులు అత్యంత హేయం:
    కొన్ని కోట్ల రాళ్లను మేము పాతాం. ఈ చంద్రబాబు ప్రభుత్వం.. ఆ రాళ్ల మీద ఉన్న  వైఎస్సార్, జగనన్న భూ హక్కు– భూరక్ష పేరును అదే పనిగా రూ.15 కోట్ల డబ్బు ఇచ్చి మెషీన్లు పెట్టి తుడిపించే కార్యక్రమం చేస్తున్నాడు. ఎంత పనికి మాలిన చేస్తున్నాడు.. దానికి రూ.15 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ డబ్బు ఖర్చు చేస్తున్నాడు. 
    ఈయన రాళ్లు ఇవ్వకపోగా, ఆల్రెడీ చేసిన యూనిక్‌ రాళ్లను దాని మీద భూహక్కు– భూ రక్ష అని చెక్కి పెట్టిన రాళ్లను తుడిపేస్తున్నాడు. అంటే అవి భూ రక్ష రాళ్లు కాదని చూపడానికి.. దాంట్లో ఉన్న యూనిక్‌ నెస్‌ను దగ్గరుండి తీసివేసే కార్యక్రమం చేస్తున్నాడు. పనికి మాలిన పని కాకపోతే ఇదేంటీ..? బుద్ధి ఉన్నాడో ఎవడైనా ఇలా చేస్తాడా..?
    అంబేద్కర్‌ విగ్రహం వద్ద కూడా అంతే.. అంబేద్కర్‌ విగ్రహాన్ని నేను స్టార్ట్‌ చేశా.. నేనే కంప్లీట్‌ చేశాను. దాని మీద నా పేరు ఉందని అదే పనిగా అధికారులను పంపించి నా పేరు తీసేయించాడు. ఇంత పనికిమాలినోడు ప్రపంచ చరిత్రలో ఎవడూ. ఉండడు. నా పేరు తీసేస్తే మాత్రం ఆ అంబేద్కర్‌ విగ్రహం ఎవరు కట్టారో తెలియదా..? ఈ రైతులకు సర్వేలు ఎవరు చేయించారు.. వ్యవస్థలు ఎప్పుడొచ్చాయి.. ఈ ట్యాంపర్‌ ప్రూఫ్‌ పాస్‌బుక్కులు ఎప్పుడు వచ్చాయో తెలియదా..? 
    మా నాన్నతో పోటీ కథ దేవుడెరుగు.. ఆయన కొడుకు వయసులో ఉన్న నాతో పోటీ పడటానికి ఇబ్బంది, అవస్థ పడుతున్నాడు. 

అసలు సర్వే రాళ్లు లేకపోతే ఎలా?:
    అన్నింటికంటే విచిత్రం ఏంటంటే.. ఇప్పుడు ఆయన సర్వే చేయించే కార్యక్రమం ఏదైతే చేయిస్తున్నాడో.. దానికి సర్వే రాళ్లు లేవు. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టుకోవడం, అదే సర్వే రాయి అని రేపు పొద్దున ఎవరైనా చూపించొచ్చు. సర్వే రాళ్లు లేకుండా సర్వేలు చేయిస్తున్నడు. ఎంత విచిత్రమైనోడంటే.. 
    సర్వే రాళ్లు లేకపోతే సర్వే ఎలా జరుగుతుంది. ఏ రాయి పడితే ఆ రాయి నాటితే సర్వే చేసినట్టేనా..? సర్వే రాళ్లు డిస్టింక్ట్‌ గా లేకపోతే ఎవరు పడితే వాళ్లు రాళ్లు మార్చరా..? ఇదే సర్వే రాయి అని ఏరాయి పడితే ఆ రాయిని అనరా..? 
    అసలు సర్వే అంటే ఏంటో కూడా చంద్రబాబుకు తెలియదు. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. అది ఉంటే ఈ తప్పులు జరగవు. చిత్తశుద్ధి లేదు కాబట్టే తప్పులు జరుగుతున్నాయి. మా మీద కక్ష, శాడిజంతో సర్వేను ఏ స్థాయిలోకి తీసుకెళ్తున్నాడంటే.. దాని అంతిమ లక్ష్యాలను గందరగోళం సృష్టించి,  పూర్తిగా నీరుగార్చే కార్యక్రమం చేస్తున్నాడు. 

ఆ రిజిస్ట్రేషన్లు కూడా వదిలేశారు:
    ఇంకా, సర్వే పూర్తయిన తరువాత గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం పూర్తిగా వదిలేశాడు. అసలు గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ అన్న కార్యక్రమం ఎందుకు ఇపార్టెంట్‌ అంటే.. కళ్ల ఎదుటే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియల జరుగుతూ, రికార్డులు అప్‌డేట్‌ అవుతున్నప్పుడు.. అంతా అదే గ్రామస్తులు, అదే గ్రామంలోనే అన్నీ జరుగుతున్నప్పుడు మోసం చేయడానికి కష్టం అవుతుంది ఎవరికైనా అలర్ట్‌ వస్తుంది.. వెంటనే పక్కనే ఉన్న సచివాలయంలో చూస్తారు. వాళ్ల ఊర్లలోనే సచివాలయం ఉంటుంది కాబట్టి, ఎవరైనా మోసం చేయాలంటే భయపడుతారు. అది ఫైనల్‌ ఉద్దేశం. అలాంటి మంచి ఉద్దేశాన్ని కూడా నీరుగారుస్తున్నాడు.

ఒక్కో  పాస్‌బుక్‌పై రూ.20 కమిషన్‌!:
    ఇంకో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. మా హయాంలో పట్టాదారు పాస్‌బుక్‌ రూ.55.79కి ఇస్తే.. చంద్రబాబు కలర్‌ మార్చి ఇస్తున్న పుస్తకానికి రూ.76. అంటే రూ.20 కమీషన్‌. కమీషన్‌ కోసం దేనిని వదలడం చంద్రబాబు చరిత్రలోనే ఉండదు.

నిషేధిత జాబితాలో భూములు:
ప్రజలు. రైతుల ఇక్కట్లు:

    అన్నింటి కంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. అసలు 22ఏ గురించి చంద్రబాబు మాట్లాడడం. 22–ఏ గురించి 2016–17లో ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి, ప్రాహిబిటివ్‌ లిస్ట్‌ కింద పెట్టి, రైతులను, పేదలను, భూ యజమానులను ఇబ్బందులు పెట్టిన ఘనత చంద్రబాబుదే. 2016, 2017లో అడ్డగోలుగా జీవోలు, 22–ఏలో పెట్టి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. 
    తప్పులు ఆయన చేస్తాడు.. బురద వేరేవాళ్ల మీద జల్లుతాడు. మా ప్రభుత్వ హయాంలో, మేము వచ్చిన తరువాత రైతులను, పేదలను దష్టిలో ఉంచుకొని వాళ్లకు శాశ్వత హక్కులు కల్పించాం. మేము తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 20.24లక్షల మంది పేదలు, రైతులకు ఏకంగా 35.44లక్షల ఎకరాలపై హక్కులు లభించాయి. మేము తీసుకున్న నిర్ణయాల వల్ల.
    ఇందులో ప్రధానంగా అసైన్డ్‌ ల్యాండ్‌ పొంది 20 ఏళ్లు దాటితే, వారి భూముల మీద వారికి పూర్తి హక్కులు కల్పించిన చరిత్ర మా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో జరిగింది. ఒరిజినల్‌ అసైనీలకు లేదా వారి వారసులకు మాత్రమే వర్తింపజేస్తూ మేము తీసుకొచ్చిన చట్టం ద్వారా ఏకంగా 15,21,160 మంది అసైన్డ్‌ నిరుపేదలకు, 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు వచ్చాయి. మేము తీసుకున్న నిర్ణయం వల్ల. 
చుక్కల భూములకు సంబంధించి మరో 97 వేలకు పైగా కుటుంబాలకు చెందిన 2,06,171 ఎకరాలు మా వల్ల హక్కులు వచ్చాయి. మేము ప్రోయాక్టివ్‌ నిర్ణయాల వల్ల హక్కులు వచ్చాయి.
    షరతులు కలిగిన భూములకు సంబంధించి 22 వేల మంది రైతులకు మరో 35 వేలకు పైగా ఎకరాల భూమి మీద వాళ్లకు హక్కులు వచ్చాయి. విలేజ్‌ సర్వీస్‌ ఇనాం భూముల కింద 1.58 లక్షల ఎకరాలకు సంబంధించి మరో 1.61 లక్షల మందికి మేలు జరిగిస్తూ హక్కులు కల్పించాం. వీటన్నింటినీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించి, రైతులకు, పేదలకు మేలు మేము చేస్తే.. చంద్రబాబు సృష్టించిన కష్టాల నుంచి మేము బయటకు తీస్తే ఈ మనిషి 22–ఏ గురించి మొన్నెప్పుడో మేము పెట్టామని మాట్లాడుతున్నాడు. అబద్ధాలు చెప్పడానికి బుద్ధి, జ్ఞానం ఏమైనా ఉండాలి. 

సెంటు భూమి ఇవ్వలేదు:
    చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక్క సెంటు కూడా ఒక్కరికి ఇచ్చిన పాపాన పోలేదు. మా ప్రభుత్వ హయాంలో, మేము వచ్చిన తరువాత 42,307 మంది రైతులకు 46,463 ఎకరాల అసైన్డ్‌ భూములు కొత్తగా మేము పంపిణీ చేశాం. ట్రైబల్‌ ప్రాంతాల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల కింద 1.54 లక్షల గిరిజన కుటుంబాలకు 3.26 లక్షల ఎకరాలపై హక్కు కల్పించింది మా ప్రభుత్వంలోనే. 

నీతిమాలిన పనులు. సిగ్గూ ఎగ్గూ లేని మాటలు:
    చంద్రబాబు క్రెడిట్‌ చోరీలో భాగంగా, 22–ఏ మేము పెట్టామని అంటున్నాడు.. క్యూఆర్‌ కోడ్‌ విధానం ఆయన తెచ్చానని చెప్పుకుంటున్నాడు. పోర్టల్, బ్లాక్‌ చెయిన్‌ అంటాడు.. మన్ను అంటాడు. పాడు అంటాడు.. చేసింది బొత్తిగా ఏమీ లేదు. ఇంత దారుణమైన అబద్ధాలు, వక్రీకరణలు చేయడం. ప్రజలను తప్పుదోవ పట్టించడం.
    ఇంత దారుణమైన అబద్ధాలు, వక్రీకరణలు చేయడం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, ఎన్నికలకు ముందు కూడా ఇదే మాదిరిగా దుష్ప్రచారాలు చేస్తూ అడ్వర్ట్‌ టైజ్మెంట్లు ఇవ్వడం, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ చేయడం, ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడం, మళ్లా సిగ్గు లేకుండా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులన్నీ చేసినందుకు రూ.400 కోట్లు కేంద్ర ప్రభుత్వం రివార్డు ఇస్తే అది ఆయన వల్లే రివార్డు వస్తోందని ఆయనే క్రెడిట్‌ తీసుకోవడం.. మళ్లా ఆ పాస్‌ బుక్కులు చూస్తే, మేం ఇచ్చిన పాస్‌ బుక్కులు, ఆయనిచ్చిన పాస్‌ బుక్కులు సేమ్‌ టు సేమ్‌. 
    అవే క్యూఆర్‌ కోడ్లు, అవే ల్యాటిట్యూడ్స్, లాంగ్‌ ట్యూడ్స్‌ తో జియో ట్యాగింగ్‌ చేసి ఉన్న ల్యాండ్‌ పార్సిళ్లు, డిస్టింగ్ట్‌ ల్యాండ్‌ పార్సిల్‌ నంబర్లు, ల్యాండ్‌ మ్యాప్స్, ఇంక్లూడింగ్‌ రిఫరెన్స్‌ టు మీ భూమి ఏపీ గవర్నమెంట్‌ పోర్టల్, మేం తీసుకొచ్చిన మార్పులు. అవే రిఫరెన్స్‌ ఇస్తూ. 

రెడ్‌బుక్‌ రాజ్యాంగం:
దిగజారిన శాంతి భద్రతలు:

    ఈ మధ్య కాలంలో జరిగిన ఒక దారుణమైన ఘటన. నిజంగా ఒక రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అన్నది నిజంగా ఈ రాష్ట్రంలో ఏ స్థాయికి పోయింది అని చెప్పడానికి ఇదొక చిన్న నిదర్శనం, ఇదొక చిన్న ఉదాహరణ. 
    పిన్నెల్లి గ్రామం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఉంది. ఇందులో సర్పంచ్‌ మా వాడు. ముగ్గురు ఎంపీటీసీలూ మావాళ్లే. వైసీపీ వాళ్లు. ఈ ముగ్గురు ఎంపీటీసీలు, సర్పంచ్‌.. వీళ్లతోపాటు దాదాపు 300 పైచిలుకు కుటుంబాలు. ఊళ్లు విడిచిపెట్టిపోయే పరిస్థితిలోకి రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడిపిస్తున్నారు అంటే నిజంగా సిగ్గుపడాలి వీళ్లంతా. వాళ్ల ఊర్లో వాళ్లకున్న ఆస్తులు, వాళ్లకున్న పొలాలను, వాళ్లకున్న ఇవన్నీ వదిలేసేట్టుగా వాళ్ల మీద దౌర్జన్యం చేసి వాళ్లను ఊర్లను విడిపించే కార్యక్రమం చేయడానికి సాక్షాత్తూ చంద్రబాబుగారు ప్రోత్సహిస్తున్నాడు అంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ ఉంది అని అడుగుతున్నా. 

అనారోగ్యంతో ఉన్న భార్యను చూడ్డానికి వస్తే..:
    వాళ్లు ఊర్లో మళ్లీ తిరిగి ప్రవేశం చేయడం కోసం కోర్టులో కేసు పెండింగ్‌ ఉంది. వాళ్లు వేసిన కేసు. పోలీస్‌ సెక్యూరిటీతో ప్రొటెక్షన్‌ తో పికెట్‌ ఆర్గనైజ్‌ చేసి వాళ్లను ఊర్లోకి తిరిగి పంపించమని హైకోర్టును అభ్యర్థిస్తూ వాళ్లు వేసిన పిటిషన్‌ పెండింగ్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్న ఏదైతే వదిలేసి వచ్చిన వాళ్ల ఇంటిని క్లీన్‌ చేసుకునే దానికి, చూసుకునే దానికి ఒక దళితుడు.. ఒక సామాన్యుడు, ఒక పేదవాడు.. ఆయన భార్య తన ఇంటికి వెళ్లి ఆ ఇల్లు చూసుకునే క్రమంలో అక్కడే ఆమె సిక్‌ అయ్యి ఉండిపోతే, భార్య సిక్‌ అయ్యింది అని చూడటానికి ఈ పేదవాడు, ఈ దళితుడు, ఈ సామాన్యుడు ఈ కార్యకర్త చూడ్డానికి పోయాడు. పోతే, అటాక్‌ చేసి దారుణంగా రాడ్లతో కొట్టి చంపినారు. సిగ్గుండాలి ఏమన్నా. ఆ చంపినోళ్లకు, ఎవరినైతే ఇన్‌ స్ట్రుమెంట్స్‌ కింద వాడారో వాళ్లకు, వీళ్లకు గొడవ కూడా లేదు. అంటే పై నుంచి ఉపయోగించి వాళ్లను చంపించే కార్యక్రమం.

అంత్యక్రియలనూ అడ్డుకున్నారు:
    దీంట్లో సీఐలు, ఎస్‌ఐలు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తూ.. వీళ్లంతా దోషులే. చివరికి ఆ మనిషి చనిపోతే, దెబ్బలు తిని హాస్పిటలైజ్‌ అయితే, ఆరు రోజులు వైద్యం చేయించుకునే క్రమంలో ఆరో రోజు చనిపోతే, చనిపోయిన ఆ మనిషిని తన ఊర్లో బరీ చేయడానికి కూడా ఊర్లోకి పోకూడదని పోలీసులు అడ్డుకున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం. ఎట్టా అడ్డుకుంటావయ్యా అని చెప్పి మా పార్టీకి సంబంధించిననాయకులు, కార్యకర్తలు, చనిపోయిన ఆయన బంధువులు.. అందరూ కూడా గట్టిగా కొన్ని వేల మంది గుమిగూడితే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రవేశానికి అనుమతించారు. 

ఇది మంచి సంప్రదాయం కాదు:
    నిజంగా ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా లేదా అన్నది ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆలోచన చేయాలి. ఇది తప్పుడు సాంప్రదాయానికి బీజం వేస్తున్నాడు. ఇదే సాంప్రదాయం గన కొనసాగితే వీళ్లు వేసిన విత్తనాలు.. ఎల్లకాలం వీళ్ల ప్రభుత్వమే ఉండదు. రేప్పొద్దున అవి చెట్లవుతాయి. ఏదైతే విత్తుతారో అదే పండుతుంది. ఏ కుటుంబం అయితే నష్టపోతుందో ఆ కుటుంబానికి బాధ కలుగుతుంది, దెబ్బ తగులుతుంది. 

ఈ విత్తనమే రేపు చెట్టు అవుతుంది:
    రేప్పొద్దున వాళ్లూ చూస్తూ ఊరుకోరు. ఇది సర్వ సహజంగా హ్యూమన్‌ నైజం ఇది. మనం పాలకులుగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి అడుగూ ఆచితూచి అడుగులు వేయాలి. న్యాయం, ధర్మం వైపు నిలబడాలి. పాలకుడు అనే వాడు న్యాయాన్ని, ధర్మాన్ని తప్పితే ఒక విషపు గింజలు నాటినట్టు అవుతుంది. రేప్పొద్దున అవి చెట్లవుతాయి. ఎవరూ కంట్రోల్‌ చేయలేని పరిస్థితిలోకి ఆ చెట్లు పెరుగుతాయి. 
    ఈ మనిషి నాయకుడు కాదు, పాలకుడు కాదు, అన్నీ చెడ్డ అలవాట్లు, చెడ్డ గుణాలు ఉన్న ఒక తప్పుడు మనిషి. ఏదన్నా భగవద్గీత చదివినా, బైబిల్‌ చదివినా, ఖురాన్‌ చదివినా ఆ గ్రంథాల్లో మనకు చెప్పేది ఏంది? మోసం చేయకండి, అబద్ధాలు ఆడకండి, హానెస్ట్‌ గా బతకండి అని నేర్పిస్తారు. 
    కానీ చంద్రబాబు నాయుడు, ఆయనకున్న అలవాటు, ఆయన కొడుక్కు నేర్పించిన అలవాటు, చివరికి ఆయన పార్టీ వాళ్లకు ఆయన చెప్పే అలవాటు ఏంది.. దౌర్జన్యం చేయండి, మోసం చేయడం తప్పులేదు. అబద్ధాలు ఆడినా తప్పులేదు. వెన్నుపోట్లు పొడిచినా తప్పులేదు. అధికారమే ముఖ్యం.. ఇవీ ఆయన నేర్పించేటివి. నిజంగా అన్నీ తప్పుడు విత్తనాలు నాటుతున్నాడు. ఇవి రేప్పొద్దున వక్షాలు అవుతాయి. 

న్యాయపోరాటం కూడా చేస్తాం:
    గట్టిగా కోర్టుల మీద ఒత్తిడి తీసుకొస్తాం. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయిస్తాం. న్యాయపోరాటం కూడా చేస్తాం. కోర్టుల ప్రొటెక్షన్‌ ద్వారా కచ్చితంగా వీళ్లందరికీ మంచిరోజులు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. మళ్లీ పున: ప్రవేశం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎల్లకాలం నువ్వు ఆపలేవు. ఎల్లకాలం చంద్రబాబునాయుడు రోజులు ఉండవు. కళ్లు మూసుకునికళ్లు తెరిచే సరికి రెండేండ్లు అయిపోయింది. మళ్లీ కళ్లు మూసుకుని కళ్లు తెరిచే సరికి మూడేండ్లు అయిపోతుంది. దాని తర్వాత ఇదే చంద్రబాబు నాయుడుకు తాను వేసిన విత్తనాలు వృక్షాలయితే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడుకి తెలుస్తాయి.

మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..
    ఎక్కడ పడితే అక్కడ వైన్‌షాప్‌లు. బెల్టు షాప్‌లు. అడ్డగోలుగా మద్యం అమ్మకాలు. కల్తీ మద్యం. ఎక్కువ ధర వసూలు, బెల్టుషాప్‌లు. సంక్రాంతి దోపిడి చూడండి. ఎక్కడిక్కడ ప్రజా ప్రతినిధలు కమిషన్లు దండుకున్నారు.
    ఇంకా రాజధానిలో నిర్మాణ వ్యయాన్ని దారుణంగా పెంచి యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి రూ.10 వేల నుంచి కు రూ.13 వేల వరకు చెల్లిస్తున్నారు. నిజానికి ఒక్కో చదరపు అడుగుకు రూ.5 వేలతో ఫైవ్‌ స్టార్‌ నిర్మాణం చేయొచ్చు. కానీ, ఇక్కడ అంత ఎక్కువ చెల్లించి దోపిడి చేస్తున్నారని శ్రీ వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు.