అన్ని వర్గాల మద్దతు వైయస్ జగన్‌కే
విజయవాడ: అన్ని వర్గాల వారు సీఎం వైయస్ జగన్కు అండగా ఉన్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు కాపు సామాజిక వర్గంను మోసం చేశారని.. కాపులను బీసీ చేస్తానని చేయలేదని ఆరోపించారు. కాపులకు ఏం చేస్తానో చెప్పి.. చేసి చూపించిన వ్యక్తి వైయస్ జగన్ అని అన్నారు. దళితులను జగన్ కు దూరం చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు.. ఆ ప్రయత్నాలు ఫలించలేదని పేర్ని నాని మండిపడ్డారు. బీసీలు కూడా చంద్రబాబు తమను వాడుకుని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది వైఎస్ జగన్.. ఇది వాళ్లకు కూడా తెలుసని తెలిపారు. మహిళలను కూడా చంద్రబాబు మోసం చేశారని.. ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. మహిళ లోకం ఇవాళ జగన్ కు అండగా ఉందని పేర్కొన్నారు.
మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఏం మాట్లాడారంటే:
- ఈ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుపై జరకూడదని దుష్టచతుష్టయం పన్నాగం:
- – ఈ ఎన్నికలు జరుగుతున్న తీరును గమనిస్తే 14 ఏళ్ల ఇండస్ట్రీ, 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు, ఆయన మందీమార్బలం వింత పోకడలు కనిపిస్తున్నాయి.
- – జగన్‌మోహన్‌రెడ్డి గారు ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపి తాను చెప్పింది చేశాననే ఆత్మస్థైర్యంతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
- – ఎన్నికలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పనితీరుపై జరగకూడదని రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ దుష్ట పన్నాగాలు పన్నారనేది స్పష్టం అవుతోంది.
- – గత నాలుగేళ్లుగా వీళ్లంతా జగన్ గారిపై ఏ రకంగా దాడి చేస్తూ వచ్చారో ప్రజలు గమనించాలి.
- – జగన్ గారి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ చేపట్టిందని, అది దుర్మార్గమైన వ్యవస్థ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
- – వాలంటీర్ వ్యవస్థ పెద్ద మాఫియా అని, వాలంటీర్లు అమ్మాయిలను రెడ్ లైట్ ఏరియాకు అమ్మేస్తున్నారని పవన్ కల్యాణ్ మాట్లాడారు.
- – ఆంధ్రప్రదేశ్‌లో చాలా అమ్మాయిలు మిస్సయ్యారని, నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని దుష్ప్రచారం చేశారు.
- – ఈ సంచులు మోసే వాలంటీర్లు మగ వాళ్లు ఇంట్లో లేని సమయంలో తలుపులు కొట్టి ఆడవాళ్లను లోబరుచుకుంటారని చంద్రబాబు మాట్లాడాడు.
- – అతి నీచంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు వాలంటీర్ వ్యవస్థపై వార్తలు రాశాయి.
- – కానీ ప్రజల్లో ఈ వ్యవస్థపై ఈసుమంత కూడా నమ్మకం సడలలేదు.
కులాలను వాడుకుని జగన్ గారిని దెబ్బతీయాలని ఫెయిల్ అయ్యారు:
- – ఈ రాష్ట్రాన్ని ఐదేళ్లు చంద్రబాబు, ఐదేళ్లు జగన్ గారు పరిపాలించారు.
- – చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్నికి ఈ మేలు చేశాను అని చెప్పుకునే పరిస్థితి ఏమైనా ఉందా?
- – చంద్రబాబు పల్లకీ మోస్తున్న ఈనాడు రామోజీ, రాధాకృష్ణ, పవన్ కల్యాణ్‌లు..చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పగలరా?
- – మీ పరిపాలనను, జగన్ పరిపాలనను పోల్చుకుని ప్రజల ముందుకు వెళ్లే సత్తా లేని బ్యాచ్ ఇది.
- – చేసిందేమీ లేక కులాలను వాడుకుని జగన్ గారిని దెబ్బతీయాలనే ప్రయత్నం చేశాడు.
- – పవన్ కల్యాణ్‌ను వాడుకుని జగన్ గారికి కాపులను దూరం చేయాలనే ప్రయత్నం చేశాడు.
- – కానీ కాపులను జగన్ గారితో దూరం చేయలేక చతికలపడ్డారు..
- – చంద్రబాబు..పవన్ కల్యాణ్ భుజాల మీద కూర్చుని కాపులను మోసం, దగా చేశాడు తప్ప, ఏరోజూ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు.
- – కాపులను బీసీలను చేస్తానని చేయలేదు. కాపు సంక్షేమం గురించి కోతలు కోశాడు తప్ప చేయలేదు.
- – కానీ జగన్ గారు కాపులకు చెప్పిన దానికంటే మిన్నగా సంక్షేమాన్ని అందించారు.
- – కాపు సంక్షేమానికి రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి అంతకంటే మిన్నగా ఖర్చు చేశారు.
- – అంతేకాదు..జనాభా దామాషాలో కాపులకు రాజ్యాధికారంలో భాగం పంచారు.
- – ఉప ముఖ్యమంత్రితో పాటు జనాభా దామాషా ప్రకారం వారికి అధికారం కల్పించారు.
- – దళితులను చీల్చుదామని చంద్రబాబు.. మందా కృష్ణమాదిగను తీసుకొచ్చాడు.
- – ఆయనతో ఎన్ని సభలు పెట్టించినా, ఎన్ని స్టేట్‌మెంట్లు ఇప్పించినా వారి ప్రయత్నం నిష్ప్రయోజనం అయ్యింది.
- – దళితులు జగన్ గారిని వదిలి పెట్టే పరిస్థితి వారికి కనిపించలేదు.
తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నేత జగన్ అని బీసీలు స్పష్టం చేస్తున్నారు:
- – పోనీ బీసీలను చీల్చుదామని ప్రయత్నం చేస్తే వారు ప్రశ్నించడం మొదలు పెట్టారు.
- – చంద్రబాబు నాయుడు బీసీలను వాడుకోవడం తప్ప మాకేం చేశాడు అని ప్రశ్నిస్తున్నారు.
- – జగన్ గారు బీసీలకు వెన్నుదన్నుగా నిలిచి రాజ్యాధికారం పంచడం, ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లను పంచడంలోనూ వారికి అండగా నిలిచారు.
- – బీసీల ఆత్మగౌరవం ఒక్క జగనన్నతోనే సాధ్యమని బీసీలు స్పష్టం చేస్తున్నారు.
- – మహిళలనూ చీల్చుదామని చూశాడు. ఆడవాళ్లను మోసం చేసిన వాడు ఏ రోజన్నా సుఖశాంతులతో ఉన్నట్లు మనం చరిత్రలో చూశామా?
- – డ్వ్రాక్రా అక్క చెల్లెమ్మలకు రూ.14వేల కోట్ల రుణాలు భేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసింది చంద్రబాబు.
- – అంత మంది ఉసురు తగిలినవాడు మళ్లీ బాగుపడే అవకాశం ఉంటుందా?
- – ప్రతి మహిళకు సెల్ ఫోన్ కొనిస్తానన్నాడు..పుట్టిన ప్రతి ఆడబిడ్డకూ రూ.25వేలు ఇస్తానని మోసం చేశాడు.
- – ఇళ్లు లేని ప్రతి ఆడబిడ్డకు 3 సెంట్లు స్థలం ఇస్తానని మోసం చేశాడు.
- – దీంతో మహిళలను చీల్చుదామంటే వారు చంద్రబాబును ఛీకొట్టిన పరిస్థితి.
- – నేడు జగన్ బలం, బలగం..అండా దండా..ధైర్యం ఈ రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెమ్మలే.
- – రాష్ట్రంలో ఉన్న సుమారు 3కోట్ల మంది మహిళామణులు ఈ రోజు జగన్ గారికి అండగా ఉన్నారు.
ప్రజలారా..కోవిడ్ కష్టకాలంలో ఈ ప్రభుత్వ పనితీరును గుర్తు చేసుకోండి:
- – కోవిడ్ సమయంలోనూ ఈ రాష్ట్రం అసలు ప్రజలను పట్టించుకోలేదు అని ప్రచారం చేద్దామంటే అదీ కుదరలేదు.
- – ఈ దేశంలోనే అత్యద్భుతంగా సేవలిందించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది.
- – వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జగన్ గారు సేవలు ప్రతి ఒక్కరి జీవితాలకు అండగా నిలిచాయి.
- – నిజంగా వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, సచివాలయ సిబ్బంది కోవిడ్‌లో చేసిన సేవలకు చేతులెత్తి మొక్కాలి.
- – చంద్రబాబు, పవన్ కల్యాణ్, రామోజీ, రాధాకృష్ణలో హైదరాబాద్‌లో ఇంట్లోంచి బయటకు రాని పరిస్థితుల్లో ఈ సిబ్బంది ఘననీయమైన సేవలు అందించారు.
- – ప్రతి ఇంటికీ వెళ్లి రోజూ వారి ఆరోగ్య పరిస్థితి కనుక్కోవడంతో పాటు కావాల్సిన వైద్య సేవలన్నీ అందించారు.
- – ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరూ కోవిడ్‌లో ఈ ప్రభుత్వం చేసిన సేవను ఒక్క సారి గుర్తుకు తెచ్చుకోండి.
- – మీ బిడ్డకంటే మిన్నగా వాలంటీర్లు ఎలా పనిచేశారో ఒక్క సారి గుర్తుకు తెచ్చుకోమని కోరుతున్నా.
- – భారత దేశంలోనే కోవిడ్ సేవలందించడంలో మన రాష్ట్రం ముందుంది.
- – రూ.30వేల కోట్లు కోవిడ్ కోసం ఖర్చు చేసిన మందులు, వైద్యాన్ని అందించింది.
- – ఏ ఆస్పత్రిలో ఆక్సిజన్ లేదు అనే మాట రానివ్వకుండా గొప్పగా పనిచేసిన ప్రభుత్వం మనది.
- – కోవిడ్ సేవల్లో ఇంత గొప్పగా సేవలు చేస్తే దాన్ని కూడా తప్పు పట్టాలని చూశారు.
2019 నుంచీ ఎవరి ఆస్తి పత్రాలు వారి వద్దే ఉన్నాయి కదా?:
- – చంద్రబాబును జగన్‌తో పోల్చి చూపాలని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేదు.
- – అలా పోల్చినప్పుడు పెద్ద గీత జగన్ గారి పక్కన చంద్రబాబు చిన్న గీతగానే మిగిలాడు.
- – ఎంత జాకీలు పెట్టి చంద్రబాబును ఆకాశానికి ఎత్తినా, జగన్ గారిపై విషం చిమ్మినా ఫలితం లేకుండా పోయింది.
- – వీళ్లు ఎంత చేసిన జగన్ గారికి ప్రజల్లో ఉన్న పరపతిని తగ్గించలేకపోతున్నామని వీళ్లంతా కుయుక్తులతో భయానకమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై పుకార్లు సృష్టించారు.
- – ఈ యాక్ట్ 2019లోనే వచ్చింది. ఇప్పుడు 2024లో దాని గురించి మాట్లాడుతున్నారు.
- – ఈనాడు రామోజీ, రాధాకృష్ణలు విషపు రాతలు రాస్తుంటే..పవన్ కల్యాణ్ విషపు ప్రసంగాలు చేస్తున్నాడు.
- – చంద్రబాబు పాపానికి హద్దే లేదు. అతను చెప్పే తప్పుడు మాటలకు హద్దేలేకుండా పోతోంది.
- – మన ఆస్తులు కొంటే ఒరిజినల్స్ అన్నీ జగన్ దగ్గర పెట్టుకుంటాడు..మనకు జిరాక్స్‌లు మాత్రమే ఇస్తాడంటారు.
- – మన ఆస్తులన్నీ జగన్ గారు బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటాడంటారు.
- – ఎవరికి కావాలంటే వాళ్లకి మన ఆస్తులను బదలాయింపు చేస్తారంటారు.
- – ఈ చట్టం దుర్మార్గమైనది..నేనొస్తే రద్దు చేస్తా అంటున్నాడు.
- – 2019లో చట్టం వస్తే..ఇప్పటి వరకూ చంద్రబాబు కొనుక్కున్న ఆస్తుల కాగితాలు మీ వద్ద ఎందుకు ఉన్నాయి?
- – పవన్ కల్యాణ్..ఈ ఐదేళ్లలో మూడో, నాలుగో ఆస్తులు కొన్నారని చెప్తున్నారు. మరి ఆయన కాగితాలు ఆయన వద్దే ఎలా ఉన్నాయి?
- – ఈ రాష్ట్రంలోని టీడీపీ, జనసేన నాయకులు కొనుక్కున్న ఆస్తుల ఒరిజనల్స్ మీ వద్ద ఎందుకున్నాయి?
- – అంటే మీరు రోజూ ఊదరగొడుతున్నదంతా వాస్తవం కాదనేది తేలిపోతోంది కదా?
- – 2019 నుంచి ఈ రోజు వరకూ రాష్ట్రంలో జరిగిన ఆస్తుల క్రయవిక్రయాల సేల్‌డీడ్స్ ఒరిజినల్స్ ఎవరు కొనుక్కుంటే వారి వద్దే ఉన్నాయి.
చంద్రబాబు ఎన్నికల కమిషన్‌ను కూడా ఏం పీక్కుంటారో పీక్కొండి అంటున్నాడు:
- – చంద్రబాబుకు ఎంత కండకావరమంటే..ఎన్నికల కమిషన్ వీరు చేస్తున్న తప్పుడు ప్రచారంపై కేసులు పెడితే..నువ్వేం పీక్కుంటావో పీక్కో అని వీళ్లు ఫుల్ పేజీ అడ్వరై్టజ్‌మెంట్ ఇచ్చారు. ఇదీ చంద్రబాబు బరితెగింపు.
- – చంద్రబాబుకు వ్యవస్థలంటే ఎంత లెక్కలేని తనమో గమనించాలి.
- – ఈ పొగరు అంతా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల వచ్చిన పొగరు.
- – పక్క రాష్ట్రాల్లో మోడీ గారిపై విమర్శలు చేస్తే వారు రెండు రోజులు ప్రచారమే చేయకూడదని ఈసీ ఆంక్షలు విధిస్తుంది.
- – ఇక్కడ పచ్చిగా, దుర్మార్గంగా చంద్రబాబు...జగన్ గారిని చంపేయండి, తొక్కేయండి, పాతేయండి అంటున్నా ఈసీ మాత్రం ఆయనకు నోటీసులు ఇచ్చి ఊరుకుంటుంది.
- – ఎన్నికల కమిషన్ ఎంత ధర్మంగా, సజావుగా ఎన్నికలు నిర్వహిస్తుందో ప్రజలు గమనించాలి.
- – తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ పథకాలు అమలు చేయవచ్చు కానీ..ఏపీలో మాత్రం చేయకూడదట.
- – ఏపీలో మే14 తర్వాత ఎందుకు వేయకూడదు అన్నప్పుడు..ఇదే మాట తెలంగాణలో ఎందుకు అనలేదు?
- – ఆఖరికి కోర్టు తీర్పులను సైతం లెక్క చేయని పరిస్థితి ఇక్కడే వచ్చింది.
- – చంద్రబాబు అంటే అడుగులకు మడుగులు వత్తడం, ఆయనపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని పరిస్థితి రాష్ట్రంలో ఉంది.
- – చివరికి ఈసీ ఇచ్చిన నోటీసులకు చంద్రబాబు కనీసం సంజాయిషీ కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి.
ఏం చూసుకుని చంద్రబాబుకు ఇంత కండకావరం?:
– ఏం చూసుకుని చంద్రబాబుకు ఇంత కండకావరం? ఎందుకు ఎన్నికల కమిషన్ కొరడా ఝళిపించడం లేదు?
– ఇలాంటి తప్పుడు, అసత్యపు వార్తలు రాస్తూ...కోట్లు ఖర్చు పెట్టి పత్రికల్లో మొదటి పేజీ అడ్వరై్టజ్‌మెంట్లు ఇస్తే పట్టించుకోవడం లేదు.
– బీజేపీతో మీరు పొత్తు పెట్టుకున్నది ఇందుకోసమేనా? ఇలాంటి విషపు ప్రచారం చేయడానికేగా?
– ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూరాబంధులు, కబ్జాకోరులను కట్టడి చేసే చట్టం.
– అలాంటి చట్టంపై ఎతంటి దుష్ప్రచారం చేస్తున్నారో గమనించాలి.
– ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఛార్మినార్‌ను తీసుకొచ్చినా రిజిస్ట్రేషన్ చేస్తాం అనే పరిస్థితి ఉండేది.
– మనిషికి మనిషికి మధ్య సేల్ డీడ్ మాత్రమే ఉన్న ఈ వ్యవస్థలో టైటిల్ డీడ్ ఇస్తూ తెచ్చిన చట్టం ఇది.
– ఆ భూహక్కుదారుడు ఎవరనేది కూడా ప్రభుత్వం ఖచ్చితంగా హామీ పత్రం ఇస్తోంది.
– ఆ ఆస్తి యజమానికి ప్రభుత్వం భరోసా కల్పించే చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.
– 2019 నుంచి ఈ ఐదేళ్లలో జగన్‌మోహన్‌రెడ్డి ఎవరి ఆస్తి తాకట్టు పెట్టాడో చెప్పండి?
– మీ డాక్యుమెంట్లు మీ ఇంట్లోనే ఉన్నాయి కదా? మీ ఆస్తిపై మీరు కూడా అప్పులు తెచ్చుకుంటున్నారు కదా?
– నిజంగా వాళ్లు చెప్పినట్లు జగన్ తాకట్టు పెట్టి అప్పు తెస్తే మళ్లీ మీకెలా అప్పు ఇస్తారు?
ఎన్ని చేసినా జగన్ గారిని ఎదుర్కోలేక కుట్రలు, కుయుక్తులు:
– జగన్ గారిని ఏ రకంగా, ఎన్ని చేసినా ఎదుర్కోలేక ప్రజల్లో ఇలాంటి అపోహలు సృష్టిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
– జగన్ గారి పరిపాలనను ఆక్షేపించలేక పోతున్నారు. నువ్వు ఈ ఎన్నికల హామీ చేయలేదని చెప్పలేకపోతున్నారు.
– ప్రజల్లో జగన్ గారికి ఉన్న బలాన్ని తగ్గించలేకపోతున్నారు.
– తన పరిపాలనను చూపించి నాకు ఓటేయమని అడిగే పరిస్థితి చంద్రబాబుకు లేకుండా పోయింది.
– నేను జన్మభూమి కమిటీలతో మంచి పరిపాలన అందించాను..మళ్లీ వస్తే ఆ జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పుకోలేని దుస్థితి.
– చివరికి జగన్ గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థనే నేను కొనసాగిస్తానంటున్నావంటే నీ దుస్థితి పగవాడికి కూడా రాకూడదు.
– నిన్నటి వరకూ వాలంటీర్లను తిట్టారు. అసలు జగన్ గారు ఉద్యోగాలే ఇవ్వలేదన్నారు.
– ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం..సచివాలయ ఉద్యోగాలు 1.30లక్షల ఇచ్చారని చెప్తున్నారు.
– జగన్ గారు చేసిన మంచిని తగ్గించి చెప్పినా ప్రజలు నమ్మడం లేదు.
– జగన్ గారి కంటే మిన్నగా నేను పరిపాలన చేశాను అని చెప్పుకోలేరు.
– గ్రామాల్లో కనీసం పంచాయతీ భవనాలు కూడా లేని పరిస్థితుల నుంచి ప్రతి గ్రామంలో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లు..ఇలా అనేక భవనాలు వచ్చాయి.
– చట్టంలో లేని అంశాలను ఉన్నట్లుగా చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నంచేస్తున్నారంటే ఎంత బరితెగింపు?
– ఆ పత్రికలు తప్పుడు వార్తలు రాసి ప్రజల మనసుల్లో విషపు బీజాలు నాటే ప్రయత్నాలు చేస్తున్నారు.
– జగన్ అమ్మ ఒడి ఇస్తే పేరు మార్చి ఇస్తానంటాడు..చేయూత ఇస్తే పేరు మార్చి ఇస్తానంటాడు.
– రాజకీయాల్లో చంద్రబాబుకు పట్టిన ఖర్మ ఎవరికీ పట్టి ఉండదు.
– లక్ష వార్తల్లో ఒకటన్నా నిజం రాయలేని వీళ్లు చంద్రబాబు హితం కోసమే ఎంతకైనా బరితెగిస్తున్నారు.
– వీళ్లకు కావాల్సిందే చంద్రబాబు పచ్చగా ఉండాలి. అప్పుడే వీళ్లంతా చల్లగా ఉంటారు.
– దాని కోసం ఎంతకైనా బరితెగించేందుకు వెనుకాడటం లేదు.
భూములు సర్వే చేసిన గ్రామాల్లో ఒక్క టీడీపీ వారు కూడా ఎందుకు ఆరోపణలు చేయలేదు?:
- – ఈ రాష్ట్రంలో 26వేల వరకూ రెవిన్యూ గ్రామాలు ఉంటే వాటిలో ఇప్పటి వరకూ 6వేల గ్రామాల్లోనే సర్వే జరిగింది.
- – ఆ సర్వే జరిగిన గ్రామాల్లో ఒక్కరు కూడా టీడీపీ వారు లేరా? సర్వే సందర్భంగా ఒక్కరన్నా ఆరోపణలు చేశారా?
- – సర్వే జరిగిన 6వేల గ్రామాల్లో ఏ రైతునైనా చెప్పమనండి ఆతని ఆస్తికి ఏం ఇబ్బంది వచ్చిందో?
- – చంద్రబాబు చేసిన వెబ్ అడంగల్ వల్ల ఈ రోజు ఎంత మంది ఏడుస్తున్నారు?
- – వీఆర్వో కూడా ఆన్‌లైన్లో పేర్లు మార్చే పరిస్థితులు ఉన్నాయి.
- – ఇప్పుడు ఈ చట్టం ద్వారా అడంగల్ మార్చాలంటే ఒక్క జాయింట్ కలెక్టర్ అన్ని పరిశీలించి చేస్తారు.
- – మీరు చెమటోడ్చి పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న ఆస్తికి ఇతను హక్కు దారుడని ప్రభుత్వం హామీ ఇచ్చే చట్టం ఇది.
- – కానీ ఈ చట్టంపై చంద్రబాబు విషాన్ని పాదరసంలా పారిస్తున్నాడు.
- – ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఈ నక్కలు, తోడేళ్ల మాటలు నమ్మవద్దు.
- – ఆ రోజు అసెంబ్లీలో చట్టం చేసేటప్పుడు టీడీపీ సమర్థించింది..ఇప్పటికే ఈ చట్టం తీసుకురావడం ఆలస్యమైంది అన్నారు.
- – ఈ రోజు ఎన్నికల కోసం ఇలాంటి విషం చిమ్మే కార్యక్రమాన్ని తీసుకున్నారు.
- – రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించుకున్న ఆస్తి పోతుందనే అపోహలు కల్పిస్తే మాత్రమే జగన్‌ని ఓడించగలమని ఈ దుష్టకూటమి భావిస్తోంది.
- – చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు నేను సవాల్ విసురుతున్నా.
- – మోడీ ఉండగా..ఈ చట్టం తప్పుడు చట్టం..దీన్ని మేం వెనక్కితీసుకుంటాం అని చెప్పగలరా?
- – ఈ చట్టం చాలా దుర్మార్గమైన చట్టం అని పురంధేశ్వరి, అమిత్‌షా, మోడీలతో చెప్పించగలరా?
- – ఇలాంటి దుర్మార్గాలకు మళ్లీ తెరలేవకుండా ఉండాలంటే ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.
- పాసు పుస్తకంపై ఉన్న ఫోటో ముఖ్యమా? లోపలున్న తాసీల్దార్ సంతకం ముఖ్యమా?:
- – జగన్ గారి ఫోటో పాసు పుస్తకంపై ఏంటి అంటున్నారు. చంద్రబాబు ఫోటో రేషన్ కార్డుపై ఉండొచ్చా?
- – చివరికి అన్నా క్యాంటీన్‌లో అప్పడాలపై కూడా చంద్రబాబు ఫోటో వేసుకున్నాడుగా..!
- – ప్రభుత్వం ఒక సర్టిఫికెట్ ఇస్తే దానిపై ఆ ప్రభుత్వాధినేత ఫోటో వేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది.
- – ఏ ప్రభుత్వంలోనైనా అలా ఫోటో వేస్తే ఆస్తి వాళ్లది అవుతుందా?
- – చంద్రబాబు ఒక బీసీ సర్టిఫికెట్ ఇస్తే..దానిపై ఆయన బొమ్మ ఉంటే ఆ బీసీ..కమ్మ వారు ఆయిపోతారా?
- – ఆ పాసు పుస్తకం లోపల తాసీల్దార్ సంతకం ఉంటుంది. పైన ఫోటో ముఖ్యమా? లోపల సంతకం ముఖ్యమా?