సీఎం వైయస్ జగన్‌ది చాణక్యుడి పాలన
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చాణిక్యుడి మాదిరిగా పాలన సాగిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అభివర్ణించారు. అందరికీ సమానంగా పాలన అందాలనే వికేంద్రీకరణ చేశారని చెప్పారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా రూ.2356 కోట్లతో పనులు చేపట్టిందని తెలిపారు. సామర్ధ్య ఆంధ్రా ద్వారా మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నామని, మానవ మూలధన అభివృద్ధికి గత ఐదేళ్లుగా ప్రాధాన్యతా క్రమంలో పెట్టుబడి పెట్టామన్నారు. ఐఎఫ్ పీ ప్యానెళ్లు ట్యాబ్ లను అందించటం ద్వారా బోదన, అభ్యాస ఫలితాలు మెరుగయ్యాయని చెప్పారు. 4 వ తరగతి నుంచి 12 తరగతి వరకూ 34.30 లక్షల మంది విద్యార్ధులు మరింత ప్రతిభావంతులయ్యారు. నాడు నేడు ద్వారా ఐదేళ్లలో 99.81 శాతం పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు అందించాం. మొత్తం 7,163 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. సంపూర్ణ పోషణ, గోరుముద్ద పథకాల ద్వారా పోషణా లోపాన్ని 2023 నాటికి 6.84 శాతానికి తగ్గించాం. విదేశీ విద్యాదీవెన ద్వారా 1,858 మంది విద్యార్ధులకు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య ఇచ్చామని మంత్రి వెల్లడించారు.
ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్‌ను రూపకల్పన చేశామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర అనే 7 అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించామన్నారు. గత ఐదేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు చేసిన ఖర్ఛులను మంత్రి వివరించారు. ఈ పథకాల అమలుతో సాధించిన ప్రగతిని వెల్లడించారు. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టామని వెల్లడించారు. ఇప్పటి వరకూ ఎవరూ చేయని పనులు మా ప్రభుత్వం చేసిందన్నారు.
పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 2. 6 లక్షల మంది వాలంటీర్లను నియమించామన్నారు. రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78 కి పెంచామని మంత్రి చెప్పారు. పాలనా పరమైన పునర్నిర్మాణంలో భాగంగా 13 కొత్త జిల్లాలు, 26 కొత్త రెవెన్యూ డివిజన్లు, పోలీసు డివిజన్లు ఏర్పాటు చేశామన్నారు. కొత్త రెవెన్యూ, పోలీసు డివిజన్లను కుప్పంలో కూడా ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. . భద్రత, మౌళిక సదుపాయాలను కల్పించామన్న మంత్రి బుగ్గన.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామన్నారు. వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమల్లోకి తీసుకొచ్చామని అని బుగ్గన సభలో వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామన్న ఆయన.. వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమల్లోకి తీసుకొచ్చామన్నారు. రూ.3,367 కోట్లతో జగనన్న విద్యాకానుక అమలు చేస్తున్నామన్నారు. 47 లక్ష మంది విద్యార్థులకు విద్యాకానుక ఇచ్చామన్నారు. జగన్నన గోరుముద్ద పథకం కోసం రూ.1910 కోట్లు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. 9,52,925 ట్యాబ్స్ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశామని మంత్రి చెప్పారు. రూ.11,901 కోట్లతో జగనన్న విద్యాదీవెన పథకానికి ఖర్చు చేశామన్నారు. విదేశీ విద్యాదీవెన కింద 1,858 మందికి లబ్ధి చేకూర్చామన్నారు. రూ.4,267 కోట్లు జగనన్న వసతీ దీవెన ఖర్చు చేశామని మంత్రి బుగ్గన వెల్లడించారు. 20.37 శాతం నుంచి 6.62 శాతానికి డ్రాప్ అవుట్ తగ్గించామన్నారు. బుధవారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు.
బడ్జెట్ వివరాలు ఇలా..
- ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం దక్కింది
- మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం
- మేనిఫెస్టోను సీఎం వైయస్ జగన్ పవిత్ర గ్రంధంగా భావించారు
- రూ.2,86,389 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన
- రెవెన్యూ వ్యయం రూ.2,30,110 కోట్లు
- మూలధన వ్యయం రూ.30,530 కోట్లు
- ద్రవ్య లోటు రూ.55,817 కోట్లు
- రెవెన్యూ లోటు రూ.24,758 కోట్లు
- జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు 1.56 శాతం
- జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు 3.51 శాతం
- ఇప్పటి వరకు ఎవరూ చేయని పనులు మా ప్రభుత్వం చేసింది
- మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నుల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర
- గడప గడపకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు
- 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలు
- 2.6 లక్షల మంది వలంటీర్ల నియామకం
- రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78 చేశాం
- ప్రతి జిల్లాలో దిశ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేశాం
- భద్రత, మౌలిక సదుపాయాలను పెంచాం
- 7 అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన
- గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్లు ఎక్కువ
- సంపూర్ణ పోషణ పథకం ద్వారా గర్భిణులకు మేలు
- 99.81 పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు అందించాం
- జగనన్న గోరుముద్ద కోసం రూ.1910 కోట్లు ఖర్చు
- రూ.11,901 కోట్లతో జగనన్న విద్యా దీవెన
- రూ.4267 కోట్లతో జగనన్న వసతి దీవెన
- ఇప్పటి వరకు 52 లక్షల మందికి లబ్ధి
- డ్రాప్ అవుట్ శాతం 20.37 నుంచి 6.62 శాతానికి తగ్గింది.
- సీబీఎస్‌ఈలోకి 4.39 లక్షల మంది విద్యార్థులు
- జగనన్న అమ్మ ఒడి పథకం కింద నాణ్యమైన విద్య
- అమ్మ ఒడి పథకం ద్వారా 43 లక్షల 61 వేల మంది మహిళలకు రూ.26,067 కోట్లు
- వైయస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంచాం
- జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద 10,754 శిబిరాలుôæ
- కోటి 67 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు
- 10 కొత్త మెడికల్ కాలేజీలు, 10 బోధనాస్పత్రులు
- 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది నియామకం
- ఏపీలో 192 స్కిల్ హబల్‌లు, 27 స్కిల్ కాలేజీలు ఏర్పాటు
- వైయస్‌ఆర్ ఆసరా కింద రూ.25,571 కోట్లు చెల్లింపు
- వైయస్‌ఆర్ సున్నా వడ్డీ కింద మహిళలకు రూ.4969 కోట్లు
- వైయస్‌ఆర్ రైతు భరోసా–పీఎం కిసాన్ ద్వారా 53.53 లక్షల రైతులకు సాయం
- వైయస్‌ఆర్ రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.33,300 కోట్లు జమ చేశాం
- కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులకు రూ.13,500
- ఆచం
- రైతులకే నేరుగా సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు
- రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు
- ఉచిత పటల బీమా కింద రూ.3411 కోట్లు
- సున్నా వడ్డీ పంట రుణాలు కింద రూ.1835 కోట్లు
- వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతర విద్యుత్
- వ్యవసాయ విద్యుత్ కోసం రూ.37,374 కోట్ల సబ్సిడీ
- రూ.3 వేల కోట్లతోధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
- ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.1,277 కోట్లు అందించాం
- 127 వైయస్‌ఆర్ పరీక్షా కేంద్రాల ఏర్పాటు
- యంత్ర సేవా పథకం కింద రైతులకు యంత్రాలు
- ఉద్యానవన రంగంలో వివిధ పథకాల ద్వారా రూ.4,363 కోట్లు అందించాం
- 2356 మంది ఉద్యానవన సహాయకుల నియామకం
- జగనన్న పాల వెల్లువతో పాడి రైతులకు లబ్ధి
- వైయస్‌ఆర్ మత్స్యకార భరోసా 2లక్షల 43 వేల కుటుంబాలకు మేలు
- చేపట వేల నిషేధ కాలంలో ఆర్థికసాయం 4 నుంచి 10 వేలకు పెంపు
- అంతర్జాతీయ ప్రమాణాలతో పది ఫిషింగ్ హార్బర్‌లు
- ఆక్వా కల్చర్ కింద 12 వేల హెక్టార్ల విస్తీర్ణం
- 16 లక్షల 5 వేల మందికి జీవనోపాధి
- ఐదేళ్లలో 30.65 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
- ఐదేళ్లలో రూ.2.53 లక్షల కోట్ల నగదు బదిలీ
- నాన్ డీబీటీ ద్వారా రూ.1.68 లక్షల కోట్లు అందించాం
- తలసరి ఆదాయంతో ఏపీకి 9వ స్థానం
- వైయస్‌ఆర్ పెన్షన్ రూ.3 వేలకు పెంచాం
- 66.35 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం
- పెన్షన్లకు ఐదేళ్లలో 84,731 కోట్లు ఖర్చు చేశాం
- బీసీలకు 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం
- బీసీల సంక్షేమం కోసం రూ.71,740 కోట్లు ఖర్చు
- వాహన మిత్ర కింద రూ.1,305 కోట్ల సాయం
- అగ్రిగోల్డ్ బాధితులకు రూ.883.5 కోట్ల సాయం
- రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలో పోర్టుల నిర్మాణం
- పోర్టుల నిర్మాణం ద్వారా 75 వేల మందికి ఉపాధి
- 3,800 కోట్లతో షిషింగ్ హార్బర్ల నిర్మాణం
- ఫైబర్ గ్రిడ్ ప్రతి గ్రామంలో అనుసంధానం
- 55 వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ ఏర్పాటు
- గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రుల నిర్మాణం
- 77 చెరువుల అనుసంధాన ప్రాజెక్టును ప్రారంభించాం
- వర్షాలపైనే ఆధారపడిన రైతులకు ఎంతో మేలు
- అవుకు రెండవ టన్నెల్ పూర్తి
- రూ.1079 కోట్లతో మూడో టన్నెల్
- ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- రూ.10,137 కోట్లతో 9 తాగునీటి పథకాలు మంజూరు
- సుజలధార ప్రాజెక్టు ద్వారా ఉద్దానం ప్రాంత ప్రజలకు ఎంతో మేలు
- సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం
- ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన
- రూ.15,711 కోట్ల పెట్టుబడులతో 55,140 మందికి ఉపాధి
- 23 అవగాహన ఒప్పందాలు కుదిరాయి
- 17 ఎలక్ట్రానిక్ కంపెనీల స్థాపన ద్వారా 34,750 మందికి ఉపాధి
- తిరుపతిలో వంద ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాం
- పురోగతిలో 13 న్యాయభవన నిర్మాణాలు
- 1426 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లు
- 12,042 ప్లాట్‌లతో ఎంఐజీ లేఅవుట్‌ల అభివృద్ధి
- 10,893 గ్రామ పంచాయతీ భవనాలు
- 10,216 వ్యవసాయ గోదాముల నిర్మాణాలు
- 8,299 భారత్ నిర్మాణ్ సేవా కేంద్రాలు
- 3,734 భారీ పాల శీతలీకరణ కేంద్రాలు నిర్మించాం
- ఐదు అంచెల్లో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం
- విజేతతలకు రూ.12 కోట్ల 21 లక్షల విలువైన బహుమతులు
- 41 క్రీడా వికాస కేంద్రాలు పూర్తి, పురోగతిలో 65 క్రీడా వికాస కేంద్రాలు
- ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో 117 ఒప్పందాలు
- బీసీ సంక్షేమానికి రూ.71,740 కోట్లు
- జగనన్న పచ్చతోరణం కింద 5కోట్ల 11 లక్షలు మొక్కలు నాటాం
- నగరవనం పథకం కింద పట్టణ, శివారుల్లో పచ్చదనం
- జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షణ పథకాలను ప్రారంభించాం
- కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్ల నియామకం
- 17లక్షల 53 వేల మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలు
- 4 లక్షల 80 వేల మ్యుటేషన్‌ల పరిష్కారం
- ఐదేళ్లలో 4 లక్షల 93 వేల కొత్త ఉద్యోగాలు కల్పించాం
- ఇందులో 2,13,662 శాశ్వత నియామకాలు
- 10 వేల మంది ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ
- ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం
- డీఎస్సీ ద్వారా 6100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- 11వ వేతన సవరణ సంఘం సిఫారసులు అమలు చేశాం
- ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62కు పెంపు
- పోలీసు వ్యవస్థలో కొనసాగుతున్న నియామక ప్రక్రియ
- వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12 నుంచి 6వ స్థానానికి
- రైతులందరికీ ఉచిత పంటల బీమా పథకం వర్తింపజేసిన రాష్ట్రం మనదే
- రాష్టర స్థూల ఉత్పత్తి రేటులో 14వ స్థానం నుంచి 4వ స్థానానికి పురోగమించాం
- సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్
- జాతీయ ఆహార భద్రతలో ఏపీ 3వ స్థానంలో ఉంది
- ఒక జిల్లా– ఒక ఉత్పత్తి కింద ఉప్పాడ జమ్దానీ చీరలకు గోల్డ్ ప్రైజ్
- చేనేత ఉత్పత్తులకు ఏపీకి మరో నాలుగు అవార్డులు
- అత్యంత ప్రసిద్ధ పర్యాటక జాబితాలో ఏపీకి 3వ స్థానం
-
ముగింపు:
అబ్రహాం లింకన్ మాటలు..భవిష్యత్‌ను అంచనా వేయడానికి అత్యంత నమ్మదగిన మార్గం ఆ భవిష్యత్‌ను సృష్టించడం. మన ప్రభుత్వం గానీ, మన గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్‌ను సృష్టించారు. సీఎం వైయస్ జగన్ తిరుగులేని నాయకత్వంలో ఈ ఐదేళ్లలో సంక్షేమ, ఆధారిత పాలన వల్ల మన రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, శ్రేయ రాజ్యా స్థాపన జరిగింది. విభిన్న కార్యక్రమాలు, స్ఫూర్తిదాయక పథకాలు, విస్తృత విధివిధానాల సమ్మిళతమై మన రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్‌ను స్వయంగా ఎవరికి వారే లిఖించుకునే విధంగా స్వయం సాధికారత పొందే దిశలో వారిని నడిపిస్తున్నాయి. మన ముందున్నది మన రాష్ట్రం ధృడమైన ఉజ్వల భవిష్య™Œ అంటూ స్వామీ వివేకానంద స్ఫూర్తిదాయ మాటలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గుర్తు చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.