వైయస్ జగన్ ని కలిసిన కరేడు గ్రామ రైతులు
15 Jul, 2025 13:19 IST
తాడేపల్లి: కరెడు గ్రామ రైతులు మంగళవారం వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తోందంటూ రైతులు వైయస్ జగన్‌కు ఫిర్యాదు చేశారు. పచ్చని పంటపొలాలను లాక్కుంటే మా పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బాధలు విన్న వైయస్ జగన్..వారికి ధైర్యం చెప్పారు. మీ పోరాటానికి అండగా ఉంటామంటూ భరోసా కల్పించారు. అవసరమైతే మీ గ్రామానికి కూడా వస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.