ఖైదీ శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్‌లో సంచలన ఆధారాలు
విజయవాడ: ఖైదీ శ్రీకాంత్ పెరోల్ అంశానికి సంబంధించి సంచలన ఆధారాలు వైయస్ఆర్‌సీపీకి చిక్కాయి. శ్రీకాంత్ పెరోల్‌లో హోం మంత్రి అనిత అడ్డంగా దొరికిపోయారు. టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్ లేఖలపై హోంమంత్రి అనిత సంతకాలు చేశారు. హోంమంత్రి అనిత ఎండార్స్‌మెంట్ పైనే ఫైల్ కదిలింది. మే 16 న హోంమంత్రి అనిత ఫైల్‌పై సంతకం చేసి పంపగా, హోంమంత్రి ఆదేశాలతో హోంశాఖ ఫైల్ సిద్ధం చేసింది.
అయితే ఖైదీ శ్రీకాంత్‌కి పెరోల్ ఇవ్వొద్దని రిమార్క్స్ రాసిన నెల్లూరు జైల్ సూపరింటెండెంట్. ఫలితంగా శ్రీకాంత్‌కి పెరోల్ ఇవ్వడం సాధ్యం కాదని హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. జులై 16వ తేదీన శ్రీకాంత్ పెరోల్ ఫైల్‌ను హోంశాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. అయినా మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యేలు చక్రం తిప్పడంతో నిబంధనలు పక్కన పెట్టి శ్రీకాంత్‌కి పెరోల్ ఇస్తూ జీవో జారీ చేశారు.