వైయస్ జగన్‌ను కలిసిన మాజీ ఎంపీ తనయుడు
17 May, 2019 11:53 IST
వైయస్ఆర్ జిల్లా : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్.జగన్‌మోహన్‌రెడ్డిని పులివెందులలో ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కుమారుడు దరూరు రమేష్‌బాబు వందలాది మంది అనుచరులు, అభిమానులతో వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా దరూరు రమేష్‌బాబును వైయస్.జగన్ ఆప్యాయంగా పలకరించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల పోలింగ్ సరళి, పార్టీ పరిస్థితి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ.వీరన్న, వజ్రకరూరు మండల అధ్యక్షుడు జయేంద్రరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు వడ్డె మహేష్, మాజీ ఎంపీపీ నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు కమలపాడు వెంకటరెడ్డి, కొనకొండ్ల సంజప్ప తదితరులు వైయస్.జగన్‌ను కలిశారు. పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేయాలని వైయస్ జగన్ వారికి సూచించారు.