కుట్రదారులు త్వరలోనే బయటకొస్తారు..

2 Feb, 2019 12:21 IST

అనంతపురం: వెన్నుపోటు పోడవడం చంద్రబాబుకు అలవాటేనని వైయస్‌ఆర్‌సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం వెనుక ఎవరెవరు కుట్రలో ఉన్నారో త్వరలోనే బయటకొస్తారన్నారు.ఎన్‌ఐఏ విచారిస్తుంటే చంద్రబాబు ఎందుకంత భయం అని ప్రశ్నించారు.చంద్రబాబు ప్రభుత్వం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆయన తెలిపారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఎదుర్కొలేక..ఆయనను తుదముట్టించాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు.ప్రజలందరూ గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు.