కొల్లు రవీంద్ర బందర్ కమల్ హాసన్
మచిలీపట్నం: టీడీపీ నేత కొల్లు రవీంద్ర నటన ముందు ఎవరూ సరిపోరు. ఆయన బందర్ కమల్ హాసన్ అని మాజీ మంత్రి పేర్ని నాని అభివర్ణించారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులపై కొల్లు రవీంద్ర దాడి చేశారని పేర్ని నాని పేర్కొన్నారు. సానుభూతి రాజకీయాల కోసమే రవీంద్ర ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దాడులు చేసి కేసులు పెట్టించుకొని బెయిల్ వస్తే ఊరేగింపులు చేసుకుంటాడని విమర్శించారు. పదవి ఉన్నప్పుడు మాత్రం పనిచేయడు..పదవి పోగానే ఇలాంటి డ్రామాలాడుతారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆస్తులపై ముందు కన్నేసింది ఎవరని ప్రశ్నించారు?. హైదరాబాద్ నడిబొడ్డున టీడీపీ ఆఫీస్ ఉన్నది ప్రభుత్వ స్థలం కాదా?
మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ ఉన్న స్థలం ప్రభుత్వ భూమి కాదా? అని నిలదీశారు. మచిలీపట్నంలో టీడీపీ ఆఫీస్‌కు ప్రభుత్వ భూమి లీజుకు అడిగింది నువ్వు కాదా..అసత్యాలు, మోసాలు, డ్రామాలాడే జన్మ నీకు అవసరమా అని కొల్లు రవీంద్రను పేర్ని నాని ప్రశ్నించారు.