రానున్నది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వమే.. 

29 Jan, 2026 12:46 IST

ఏలూరు జిల్లా: రానున్నది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వమే.. నేటి కృషికే రేపటి గుర్తింపు అని ఏలూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు స్ప‌ష్టం చేశారు. పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా కైకలూరులో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైయ‌స్ఆర్‌సీపీ మరింత బలంగా ప్రజల ముందుకు వెళ్లబోతుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకూ రేపటి రోజుల్లో తగిన గుర్తింపు, గౌరవం తప్పకుండా లభిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కైకలూరులో నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఏలూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ధ్యక్షతన కైకలూరు–ఏలూరు రోడ్డులోని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ… పార్టీ బలోపేతమే లక్ష్యంగా మండల కమిటీలు, మండల అనుబంధ విభాగాల కమిటీలు, వార్డు మరియు గ్రామ స్థాయి పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలను వేగంగా నియమించాలని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచే పార్టీని మరింత బలపర్చాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు మొండితోక అరుణ్ కుమార్ , ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ కారుమూరు సునీల్ కుమార్ , ఏలూరు నియోజకవర్గం ఇంచార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ)  , రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ అధ్యక్షులు కోమటి విష్ణు  , రాష్ట్ర కార్యదర్శులు నూకపేయి సుధీర్ బాబు  , దాసరి రమేష్ , బీవీఆర్‌కే చౌదరి పాల్గొన్నారు.