ఇడుపులపాయ నుంచి వైయస్ జగన్ ఎన్నికల సమర శంఖారావం
13 Mar, 2019 11:19 IST
హైదరాబాద్: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్‌జగన్ మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి ఎన్నికల సమర శంఖారావం మోగించనున్నారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 10.26 గంటలకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబితాను వైయస్ జగన్ విడుదల చేయనున్నారు.ఇడుపులపాయలో పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. ఆ తరువాత ఎన్నికల ప్రచారాన్ని వైయస్ జగన్ ఇడుపులపాయ నుంచి ప్రారంభిస్తారు. పార్టీలో భారీ ఎత్తున చేరికల నేపథ్యంలో అభ్యర్థులపై తుది కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలతో , సీనియర్లతో జాబితాపై కూలంకుషంగా అధినేత చర్చిస్తున్నారు.