సీఎం వైయస్ జగన్ ఈస్టర్ శుభాకాంక్షలు
4 Apr, 2021 11:01 IST
తాడేపల్లి: ఈస్టర్ పర్వదినం సందర్భంగా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. `విశ్వాసం, ప్రేరణ గొప్ప శక్తిగా మారి నడిపించే శుభదినం ఇది. ఈ ప్రకాశవంతమైన రోజు నిర్మలమైన దైవకృప అందరిపై ప్రసరించాలని కోరుకుంటున్నాను` అని హ్యాపీఈస్టర్ హ్యాష్ ట్యాగ్‌తో సీఎం ట్వీట్ చేశారు.