ఈ -రక్షా బంధన్‌కు విశేష స్పందన
తాడేపల్లి: రాష్ట్రంలోని బాలలు, మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘ఈ- రక్షాబంధన్’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 3వ తేదీ లాంఛనంగా ప్రారంభించారు. తోబుట్టువుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ -రక్షా బంధన్ ప్రారంభించిన ఒక్క రోజులోకే ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఇవాళ ఈ-రక్షా బంధన్ యూట్యూబ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించగా ఒక్క రోజులోనే 67 వేల మంది ఎన్‌రోల్ చేసుకున్నట్లు సీఐడీ ఎస్సీ రాధిక తెలిపారు. శిక్షణ కార్యక్రమాన్ని మంచి ప్రతిస్పందన లభిస్తోందని ఆమె చెప్పారు. మొదటి రోజు శిక్షణలో ఆన్‌లైన్ సేఫ్‌పై అవగాహన కల్పించామన్నారు. సైబర్ నేరగాళ్ల కదిలికలపై నిఘా పెట్టామని రాధిక తెలిపారు. 4 ఎస్, 4 యూ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసిన వారి విషయంలో గోప్యత పాటిస్తామని ఎస్పీ వెల్లడించారు. 9071666656 వాట్సాప్ నంబర్‌కు వివరాలు పంపితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాధిక వెల్లడించారు.