గ్రామ సచివాలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం
5 Oct, 2021 16:13 IST
విజయనగరం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణి గ్రామసచివాలయాన్ని సందర్శించారు. మంగళవారం కురుపాం నియోజక వర్గంలోని గుమ్మలక్ష్మిపురం మండలం పి. ఆమిటి, మండ గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. సచివాలయం సిబ్బంది, వలంటీర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. నవరత్నాల పట్టిక,లబ్దిదారుల జాబితా నోటీస్ బోర్డ్ లో ఉంచుతున్నారా? లేదా? అని పరిశీలించారు. పోడుపట్టాలు, ఇళ్ళ స్థలాలు ,రైతు భరోసా, చేయూత , వైయస్ఆర్ పింఛను కానుక, విద్యాదీవెన, వసతి దీవెన అలాగే అన్ని సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ప్రజల సమస్య లు అడిగి తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాలు సూచించారు.