ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతల దాడి దుర్మార్గం
2 Jan, 2021 17:15 IST
విజయనగరం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతల దాడి దుర్మార్గమని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థం ఘటనకు బాధ్యులైన దోషులను కఠినంగా శిక్షిస్తామని పుష్పశ్రీవాణి తెలిపారు.