దళిత మహిళా ఎస్‌ఐని అవమానించడం అహంకారానికి నిదర్శనం
12 Sep, 2019 14:14 IST
అమరావతి: దళిత మహిళా ఎస్‌ఐని మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్, టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి అవమానించం ఆమె అహంకారానికి నిదర్శనమని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విమర్శించారు. చంద్రబాబులా టీడీపీ నేతలూ దళితులను అవమానిస్తున్నారని, గతంలో ఆదినారాయణరెడ్డి ఇలాగే అవమానించారని గుర్తు చేశారు. ఎన్నికల్లో టీడీపీ నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రావడం లేదన్నారు.