సీఎం సహాయ నిధికి రూ.100 కోట్ల విరాళం
11 May, 2021 16:11 IST
తాడేపల్లి: కోవిడ్ –19 నివారణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మినరల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.100 కోట్లు విరాళం అందజేసింది. డీఎంఎఫ్ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) నుంచి రూ.90 కోట్లు, ఏపీఎండీసీ నుంచి రూ.10 కోట్లు విరాళం సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, గనులు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీఎండీసీ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి జి వెంకటరెడ్డిలు విరాళాలకు సంబంధించిన చెక్కులను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు అందించారు.