ఘనంగా దేవినేని మురళి 38వ వర్ధంతి
10 Mar, 2026 14:00 IST
ఎన్టీఆర్ జిల్లా: యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (యూఎస్‌వో) వ్యవస్థాపకులు స్వర్గీయ దేవినేని మురళి 38వ వర్ధంతి ఘనంగా జరుపుకున్నారు. విజయవాడలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దేవినేని మురళి చిత్రపటానికి దేవినేని అవినాష్, దేవినేని అభిమానులు, సన్నిహితులు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుణదల కట్టపై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించి మురళి సేవలను స్మరించుకున్నారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల్స్, మహిళలకు చీరలు , పండ్లను కూడా పంపిణీ చేశారు.