పవన్ తన కార్యకర్తలని అదుపులో పెట్టుకోవాలి
17 Oct, 2022 17:20 IST
విశాఖ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం రాజన్నదొర సూచించారు. విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను వ్యక్తిగతంగా ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానిని.. కానీ పవన్ మీద ఉన్న అభిమానాన్ని ఈ ఘటనతో పోగొట్టుకున్నాడని అన్నారు . పవన్ తన కార్యకర్తలని క్రమశిక్షణ లో పెట్టుకోలేపోతున్నారని మండిపడ్డారు.. జన సైనికులలో క్రమశిక్షణ లేక పోవడం వల్లే అధికారంలోకి రాలేకపోయామని గతంలో పవన్ కల్యాణ్ చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ తన కోసం రాజకీయాలు చెయ్యడం లేదు చంద్రబాబు కోసమే చేస్తున్నాడని రాజన్నదొర విమర్శించారు. ఉత్తరాంధ్రలో రాజధానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన మంత్రుల మీద రాళ్ళ దాడి హేయమైన చర్యగా భావిస్తున్నానని అన్నారు.