ఆదాయం తగ్గినా.. ఆర్థికసాయం అందిస్తున్నాం

17 Apr, 2020 16:32 IST

అమరావతి: కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణ స్వామి తెలిపారు. లాక్‌డౌన్‌తో ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల ద్వారా రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఆదాయం తగ్గినా.. సీఎం వైయస్‌ జగన్‌ లాక్‌డౌన్‌కు కఠినంగా అమలు చేస్తున్నారని వివరించారు. మంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఆదాయం లేకపోయిన పేదలకు రేషన్, ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ఇంగ్లిష్ మీడియాన్ని చంద్రబాబే అడ్డుకున్నాడని మండిపడ్డారు. సుప్రీంకోర్టుకు వెళితే చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.