మద్య నియంత్రణకు చంద్రబాబు తూట్లు
4 Sep, 2020 11:19 IST
చిత్తూరు: ఎన్టీఆర్ మద్యపాన నియంత్రణకు తూట్లు పొడిచినట్లే ఇప్పుడు కూడా చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. దశల వారీగా మద్య నియంత్రణలో భాగంగా ధరల క్రమబద్ధీకరణ చేపట్టామని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 43 వేల బెల్ట్ షాపులు తొలగించామని చెప్పారు. 33 శాతం మద్యం షాపులు తగ్గించి, బార్లను కుదిస్తున్నామని తెలిపారు. దశలవారి మద్య నియంత్రణకు టీడీపీ నేతలు తూట్లు పొడుస్తున్నారని ఆయన మండిపడ్డారు.హెరిటేజ్ కేంద్రాల్లో అక్రమంగా మద్యం అమ్ముతూ పట్టుబడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం వైయస్ జగన్ ఎస్ఈబీని ఏర్పాటు చేశారన్నారు. 3 నెలల్లో 36 వేల కేసులతో పాటు 46 వేల మందిని అరెస్టు చేశామని నారాయణ స్వామి వెల్లడించారు.