డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం
అమరావతి: డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరుతో చంద్రబాబు నాయుడు మోసం చేశారని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో సన్నా వడ్డీ పథకాన్ని నీరు కార్చారని ధ్వజమెత్తారు. 3వేల 36 కోట్లను ఎగ్గొట్టారని విమర్శించారు. పాదయాత్రలోసీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళల కష్టాలను చూసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలకు వడ్డీ 13 శాతం గా ఉండేది. సీఎం వైయస్ జగన్ బ్యాంకర్లతో మాట్లాడి ఆ వడ్డీని ఏడు శాతానికి తగ్గించారని చెప్పారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలను పూర్తిగా కష్టాల్లో ముంచారు. రూ.25,571 కోట్ల బకాయిలు పెట్టారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక ఆసరా పథకాన్ని తీసుకువచ్చి వారికి అండగా నిలిచారన్నారు. మూడు విడతల్లో 19 వేల 178 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారని మంత్రి తెలిపారు.