మైనారిటీలకు సబ్‌ప్లాన్ తీసుకువచ్చిన మొట్ట మొదటి ప్రభుత్వం మనదే
అమరావతి: దేశంలోనే మొట్టమొదటిసారిగా మైనారిటీలకు కూడా సబ్ ప్లాన్ తీసుకువచ్చిన ప్రభుత్వం వైయస్ఆర్సీపీనే అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. మైనారిటీ సబ్ ప్లాన్ కింద రూ.4,203 కోట్లు ఇవాళ బడ్జెట్లో కేటాయించామని, గతంలో ఏ ప్రభుత్వం మైనారిటీలకు ఈ స్థాయిలో నిధులు కేటాయించలేదని చెప్పారు. సంక్షేమ శాఖ పద్దులపై జరిగిన చర్చలో మంత్రి అంజాద్‌బాషా మాట్లాడారు. చంద్రబాబు హయాంలోనే మైనారిటీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం నడిచిందని మంత్రి గుర్తు చేశారు. మైనారిటీలకు ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చి మమ అనిపించారని తెలిపారు. మైనారిటీ ఓట్ల కోసమే ఆ రోజు చంద్రబాబు మూడు నెలల మంత్రి పదవి ఇచ్చి మభ్యపెట్టాలని చూశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మొదటి నుంచి మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. నలుగురికి శాసభ సభలో అవకాశం, మరో నలుగురిని శాసన మండలిలో కూర్చోబెట్టారని తెలిపారు. జకీయాఖాన్కు మండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవి ఇచ్చారు. ఎన్నడూ ఇలా మైనారిటీలకు పెద్ద పీట వేసింది లేదన్నారు. గతంలో మార్కెట్ యార్డు చైర్మన్ పదవి రావాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేదన్నారు. గత ప్రభుత్వం మైనారిటీలకు ఖర్చు చేసింది కేవలం రూ.2,660 కోట్లు మాత్రమే అన్నారు. ఇవాళ మా ప్రభుత్వం 45 నెలల కాలంలో రూ.21,756.69 కోట్లు మైనారిటీ సంక్షేమం కోసం ఖర్చు చేశారు. డీబీటీ కింద రూ.11,188 కోట్లు, నాన్ డీబీటీ కింద రూ.10,568 కోట్లు వైయస్ జగన్ ఖర్చు చేశారని వివరించారు.