సంతృప్తస్థాయిలో సంక్షేమ పథకాల అమలు
వైయస్ఆర్ జిల్లా:అర్హత ఒక్కటే ప్రామాణికంగా అందరికీ సంతృప్తస్థాయిలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని, పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా అన్నారు. కడప నగరంలోని 15వ డివిజన్‌లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి.. సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమలు చేస్తున్న పథకాలతో ఏ మేరకు లబ్ధిపొందారో ప్రతి గడపకూ వివరించారు. ప్రజలు ఇంకేమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కడప మేయర్ సురేష్‌బాబు, డివిజన్ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.