ఇదా ప్రజాస్వామ్యం చంద్రబాబు గారూ..
29 Apr, 2019 11:29 IST
హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యహరించిన తీరును వైయస్ఆర్‌సీపీ అధ్య క్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదా ప్రజాస్వామ్యం చంద్రబాబు గారూ..ఇంతకీ వర్మ చేసిన తప్పేమింటి అని ప్రశ్నించారు. పోలీసులను బంట్రోతులు కన్నా హీనంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. రామ్‌గోపాల్ వర్మ ప్రెస్ మీట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడానికి ఆయన చేసిన తప్పేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిచారు. ఇలాంటి సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని, ఇలాంటి వైఖరి గర్హనీయమని పేర్కొంటూ ట్విటర్‌లో ట్వీట్ చేశారు.