సీఎం వైయస్ జగన్‌ను కలిసిన దళిత ఎమ్మెల్యేలు
20 Mar, 2023 14:56 IST
అమరావతి: శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత ఎమ్మెల్యేలు కలిశారు. శాసనసభలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాడి ఘటనను సీఎంకు దళిత ఎమ్మెల్యేలు వివరించారు. టిడిపీ ఎమ్మెల్యే దాడిలో ఎమ్మెల్యే సుధాకర్ బాబు మోచేయి గాయంతో పాటు వాచిందని సీఎంకు ఎమ్మెల్యేలు వివరించారు. సీఎంను కలిసిన వారిలో హోంశాఖమంత్రి తానేటి వనిత, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు.