సీఎం వైయస్ జగన్‌ను కలిసిన సమీర్ శర్మ, ఆదిత్యనాథ్ దాస్
1 Oct, 2021 12:07 IST
తాడేపల్లి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సమీర్ శర్మ, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు.. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సమీర్ శర్మ నిన్న బాధ్యతలు స్వీకరించగా.. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు.