వైయస్ జగన్తో సీఎస్, డీజీపీల భేటీ
28 May, 2019 10:34 IST
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డితో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, డీజీపీ ఠాకూర్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎస్, డీజీపీ, ఇతర శాఖల అధికారులు వైయస్ జగన్తో సమావేశమై ఈ నెల 30వ తేదీ జరుగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. అలాగే పలు అంశాలపై సమీక్షించారు.