గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తప్పవు
6 Apr, 2020 13:36 IST
తిరుపతి: దుకాణాల వద్ద ప్రజలు గుంపులుగా ఉండకుండా యజమానులు జాగ్రత్తలు పాటించాలని, అందరూ కొద్దిరోజుల పాటు భౌతిక దూరం పాటించాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. తిరుపతిలో వారు మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు సీఎం వైయస్ జగన్ కఠిన చర్యలు తీసుకున్నారని, ప్రజలందరూ ఇందుకు సహకరించాలని కోరారు. ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లిన వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆస్పత్రిలో చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. కరోనా నియంత్రణకు అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో పలు ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్రకటన ఉందని.. ప్రజలు గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.