వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం
రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కి నివాళులర్పించారు. రాజ్యాంగానికి విరుద్దంగా ఏపీలో జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక దాడులు, దౌర్జన్యాలపై గళమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి జరుగుతున్న రాజ్యాంగ హననంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ
సింగ్ నగర్ లోని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్
రాజ్యాంగం ప్రతి పౌరుడు కి భద్రత, హక్కులు, స్వేచ్ఛ కల్పించింది
కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది
వైయస్ జగన్ మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధం చేస్తుంది
కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతిలోకి తీసుకొని వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంది
సోషల్ మీడియాను నియంత్రించే విధంగా కొత్త చట్టాలు తేవటం దారుణం
నల్ల చట్టాలు తేవడంలో కూటమి ప్రభుత్వం ముందుంది
ఆంధ్ర రాష్ట్రంలో వినూత్నమైన పరిపాలన జరుగుతుంది
ప్రజల యొక్క హక్కులు హరించబడుతున్నాయి
పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది
వైయస్ జగన్ పై దుష్ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది
రాజ్యాంగం అమలు చేయడంలో కుటుంబ ప్రభుత్వం విఫలమైంది
విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అధికారులు ఎందుకు నివాళులర్పించలేదు..?
ప్రభుత్వం, అధికారులు వివక్షత చూపిస్తున్నారు
విశాఖ :
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైఎస్ఆర్సిపి నేతలు..
గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి..
రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాలేదు.
లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది
రాష్ట్రంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారు..
విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని వైయస్ జగన్ ఏర్పాటు చేశారు..
రైల్వే భవనాల నిర్మాణానికి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం 52 ఎకరాలను కేటాయించింది.
కేకే లైన్ తో కూడిన రైల్వే జోన్ ఇవ్వాలి..
వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అదా నీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ సేకితో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఆదానీ సంస్థతో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం.
ప్రధాని మోడీ ప్రారంభిస్తారనే గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఒప్పందం వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జరిగింది.
ప్లాంట్ కు సంబంధించిన భూ కేటాయింపులు మా ప్రభుత్వ హయాంలోనే జరిగాయి
తూర్పుగోదావరి జిల్లా :
కొవ్వూరులో రాజ్యాంగం 75వ ఆమోద దినోత్సవ సందర్భంగా కొవ్వూరు బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన కొవ్వూరు వైసిపి కన్వీనర్ తలారి వెంకట్రావు
రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు, దోపిడీ, అక్రమ ఇసుక రవాణా,మద్యం అక్రమ అమ్మకాలు ఎక్కువ అయిపోయాయని త్వరలోనే తగిన మూల్యం చెల్లించే రోజు వస్తుందని హెచ్చరించిన తలారి వెంకట్రావు ........
కాకినాడ జిల్లా:
తునిలో ఘనంగా 75వ భారత రాజ్యంగ ఆమోద దినోత్సవం.
డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.
దాడిశెట్టి రాజా,మాజీ మంత్రి
*రాష్ట్రంలో గత ఆరు నెలలుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా పాలన జరుగుతోంది.
*ప్రత్యార్ధులను అణివేసే దోరణీ చాల నిరంకుశంగా జరుగుతోంది
*తునిలో 17 మందిపై అక్రమ కేసులు పెట్టారు
*సోషల్ మీడియాలో పోస్ట్ ను లైక్ చేసిన వారిపై నాన్ బెయిల్ కేసులు పెట్టారు.
*పసుపు చొక్కాలేసుకుని ఉద్యోగాలు చెయ్యోద్దని పోలీసులను కోరుతున్నాను
*గత 10 ఏళ్ళ కాలంలో వైయస్ఆర్ సిపి ఒక పర్సంటేజ్ పోస్టులు పెడితే..టిడిపి,జనసేన 99 % అసభ్య పదజాలాలతో పోస్టులు పెట్టారు.
*తునిలో మామ అల్లుళ్ళ పాలన సాగుతోంది.
*అల్లుడు గల్లా పెట్టె దగ్గర కూర్చుంటే..మాయ యనమల అమాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
ఏలూరు జిల్లా :
75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైసిపి ప్రధాన కార్యదర్శి జెట్టి గురునాథం, ప్రజాప్రతినిధులు వైయస్ఆర్‌సీపీ శ్రేణులు.
కృష్ణాజిల్లా :
పెడన మండలం బల్లిపర్రు అంబేద్కర్ సెంటర్లో 75 వ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము వైసిపి నాయకులు కార్యకర్తలు
ఏలూరు జిల్లా:
75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా కొయ్యలగూడెం లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు,పాల్గొన్న వైయస్ఆర్‌సీపీ శ్రేణులు.
కృష్ణా జిల్లా
కానూరు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో 75వ భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవభక్తిని చక్రవర్తి.
ఎన్టీఆర్ జిల్లా :
తిరువూరు పట్టణంలోని బోసు బొమ్మ సెంటర్లో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో 75వ "భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.
_డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వైయస్ఆర్‌సీపీ నాయకులు,కార్యకర్తలు.
విజయనగరం జిల్లా...
భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన రాజాం వైయస్ఆర్‌సీపీ ఇంచార్జ్ డాక్టర్ తలే రాజేష్.
పార్వతీపురం మన్యం జిల్లా :
పార్వతీపురం లో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన మాజీ ఎమ్మెల్యే జోగారావు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
వైయస్ఆర్ జిల్లా
కడప వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు..అంబేద్కర్ రచించిన రాజ్యాంగ అమలై 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజు సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళి..
పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష
గుంటూరు:
గుంటూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్....
ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు..
భారత రాజ్యాంగం రూపకల్పనకు కమిటీ చైర్మన్ గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వ్యవహరించారు..
ప్రపంచ దేశాలలోని అన్ని రాజ్యాంగంలో పరిశీలించి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది..
చిన్నచిన్న అమెండ్మెంట్స్ మినహా నేటికీ చెక్కుచెదరని విధంగా భారత రాజ్యాంగం ఉంది..
న్యాయ వ్యవస్థ అయినా, రాజకీయ వ్యవస్థ అయినా, మీడియా వ్యవస్థ అయినా భారత రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాలి..
కాని ఇవాళ రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తులు తయారయ్యాయి..
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక అరాచక, కక్ష సాధింపు పాలన సాగుతుంది..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను పక్కనపెట్టి కక్ష సాధింపు చర్యలకే పరిమితమైంది..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కాలేదు.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది
ఈ ఐదు సంవత్సరాలు మంత్రి నారా లోకేష్ తీసుకువచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరిగే విధంగా ఉంది..
మంత్రి నారా లోకేష్ ఎవరిని జైల్లో పెట్టమంటే వారిని పోలీసులు బలవంతంగా అక్రమ కేసులతో అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు..
ఒక్కో వ్యక్తిమీద 10, 20, 30 కేసుల వరకు పెడుతున్నారు..
బ్రిటిష్ పాలనలో స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వారి మీద కూడా ఇన్ని కేసులు పెట్టి ఉండరు..
రానున్న రోజుల్లో నారా లోకేష్ దోషిగా నిలబడాల్సి వస్తుంది..
ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం కామెంట్స్..
భారతదేశం గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్..
ఇవాళ కూటమి పాలనలో రాజ్యాంగం ఉల్లంఘనకు గురవుతుంది..
కర్నూలు
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు ఓల్డ్ టౌన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు..
పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, మేయర్ బి వై రామయ్య..
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కామెంట్స్ ..
రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు.
చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.
నిరంకుశ పాలన రాష్ట్రంలో కొనసాగుతుంది.
గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగింది.
ఇంటి వద్దకే సంక్షేమ పాలనతో పాటు సంక్షేమ పథకాలు అందించారు.
ప్రకాశం
రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఒంగోలు వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయం లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఒంగోలు వైయస్ఆర్‌సీపీ ఇంచార్జీ చుండూరి రవిబాబు ,సిటీ పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, సీనియర్ నాయకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, కుప్పం ప్రసాద్ మరియు కార్యకర్తలు
ఈ రోజు సంక్షేమ పథకాలు లేవు, రాజ్యాంగానికి విరుద్ధంగా పాలనను చంద్రబాబు సాగిస్తున్నారంటూ మండిపడ్డ నేతలు ...
నంద్యాల
రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి...
ఆత్మకూరు పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..
ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగాఆందోళననెలకొంది... మాజీ ఎమ్మెల్యే శిల్పా.
ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో బ్యాలెట్ పేపర్లతోటే ఎన్నికలుజరుగుతున్నాయి..మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి
మన దేశము మన రాష్ట్రం కూడా బ్యాలెట్ వైపు ఎందుకు వెళ్ళకూడదూ, అందరూ ఆలోచించాలి..మాజీ ఎమ్మెల్యే శిల్పా.
నంద్యాల జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కామెంట్స్...
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.
సంబంధం లేని కేసులను రాజకీయ నాయకులు కంటగడుతూ పబ్బం గడుపుకుంటున్నారు.
రాష్ట్రంలో అమలు అవుతున్న పోలీసులు కూడా రెండు బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారు
ప్రతి ఒక్క పేద కుటుంబానికి నిత్యవసరమైన సరుకులు కూరగాయలు , నూనె , కందిపప్పు ప్రతి ఒక్కటి రేట్లు విపరీతంగా పెంచేశారు
మా ప్రభుత్వంలో నిత్యవసర సరుకులను రేట్లు పెంచామని అబద్ధపు పుకార్లు చేసుకుంటూ రోడ్లెక్కిన ఘనత టిడిపి నాయకులకు చెల్లుతుంది
రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోతే ప్రభుత్వం నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఘనత మా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుంది.
మీడియా చేతిలో ఉంది కదా అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
మా పైన పెట్టిన పోస్టింగులు కూడా మేము పోలీసులకు అందజేస్తాం వాటిపై కూడా చర్యలు తీసుకోవాలి.
కేవలం తెలుగుదేశం పార్టీ వారు మా పైన పెట్టిన కేసులు మాత్రమే విచారిస్తారా మా వైయస్ఆర్‌సీపీ నాయకులు పెట్టిన కేసులను విచారించరా
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అధికారులు కూడా గమనించుకోవాలి మేం అందజేసిన ఫిర్యాదులపై నిజ నిజాలు విచారించి చర్యలు తీసుకోవాలి.
పోలీసులు ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన విధంగా ఉండకూడదు ...
నెల్లూరు జిల్లా
- తన నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి..
- రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీలో పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్..
- గత ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పాటుపడిందని వెల్లడి..
- స్వరాజ్ మైదానంలో అప్పటి సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు..
- అంబేద్కర్ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలని ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి జగన్..
పల్నాడు జిల్లా
నరసరావుపేట :
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.