సీఎం వైయస్ జగన్‌కు అభినందనలు
10 Mar, 2022 12:05 IST
అమరావతి: స్కోచ్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్ధానంలో నిలవడంతో అసెంబ్లీలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి హర్షం వ్యక్తం చేశారు. వివిధ విభాగాల్లో స్కోచ్ అవార్డుల్లో ఏపీ మొదటి స్ధానంలో నిలవడంపై మంత్రులు కురుసాల కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు, పి అనిల్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు.