ఎంపీ వంగా గీతాకు అభినందనలు
3 Aug, 2022 14:50 IST
న్యూఢిల్లీ: సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (MPEDA) సభ్యురాలిగా కాకినాడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఎన్నిక కావడం పట్ల పార్టీ ఎంపీలు అభినందలు తెలిపారు. MPEDAలో ఆమె సమర్ధవంతమైన ఉనికి భారతదేశం, ఏపీ యొక్క సముద్ర ఎగుమతులను పెంచుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. కాకినాడలో 150 కి.మీ పైగా తీరప్రాంతం లాభపడుతుందని పేర్కొన్నారు. ఎంపీని అభినందించిన వారిలో లోక్‌సభ పార్టీ నేత మిథున్‌రెడ్డి, మహిళా ఎంపీలు జీ. మాధవి, సత్యవతమ్మ, తలారి రంగయ్య, తదితరులు ఉన్నారు.