కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు
13 May, 2023 19:14 IST
అమరావతి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి నా శుభాకాంక్షలు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతోంది అంటూ డీకే శివకుమార్‌ను ట్యాగ్ చేస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.