పీపీపీ విధానంతో పేదలకు వైద్య సేవలు భారం
అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీపీపీ విధానంతో పేదలకు వైద్య వైద్య సేవలు భారం అవుతాయని నగర మేయర్ మహమ్మద్ వసీం ఆందోళన వ్యక్తం చేశారు. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా అనంతపురం నగరంలో ఉద్యమ స్ఫూర్తితో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగుతోంది. నగరంలోని 18వ డివిజన్ పరిధిలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమంలో మేయర్ మహమ్మద్ వసీం కార్పొరేటర్ ముంతాజ్, జిల్లా గ్రీవిన్స్ సెల్ అధ్యక్షులు భాకే హాబీబుల్లా ,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఖాజా లతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మాణం చేపట్టి పేదలకు వైద్య విద్యను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేశారన్నారు. అన్ని జిల్లాలలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ నిర్మించి విద్యార్థులు వైద్య విద్యను చేరువ చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీ లను పిపిపి విధానంలోకి తీసుకువచ్చి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోందని విమర్శించారు.అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని,వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల కార్యక్రమంలో స్వచ్చందంగా వచ్చి సంతకాలు చేస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ క్రమంలో కార్పొరేటర్ కమల్ భూషణ్, వైయస్ఆర్‌సీపీ నాయకులు దాదు, , కాకర్ల శీనా తదితరులు పాల్గొన్నారు.