తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ
23 Sep, 2019 15:18 IST
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, కే.చంద్రశేఖర్‌రావులు ఈరోజు హైదరాబాద్ ప్రగతి భవన్‌లో భేటి అయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ.. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై వారు చర్చిస్తారు. ఈ సమావేశంలోనే నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.