17 న సీఎం వైయస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలి
15 Apr, 2023 16:43 IST
అనంతపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 17 న జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొనడానికి సింగనమల నియోజకవర్గంలోని నార్పలకు వస్తున్నారని, సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం అనంతపురంలో వైయస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో వెంకట్రామిరెడ్డి సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ నార్పల కు విచ్చేస్తున్న నేపథ్యంలో సభకు పార్టీ శ్రేణులు పెద్ద హాజరై విజయవంతం చేయాలని కార్యకర్తలకు, నాయకులను కోరారు.