గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
18 Jul, 2022 16:11 IST
తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వంపై ప్రతి నెల సీఎం వైయస్ జగన్ సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం రెండో నెల సమీక్ష నిర్వహిస్తున్నారు. అత్యంత ప్రాధాన్యత కార్యక్రమంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాంను చేపట్టారు.మూడేళ్లలో ప్రజలకు మన ప్రభుత్వం ఏం చేసిందో వివరిస్తూ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ప్రతి ఇంటికి వెళ్తున్నారు.