పులివెందుల అభివృద్ధి పనులపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
2 Sep, 2022 12:27 IST
వైయస్ఆర్ జిల్లా: పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..చక్రాయపేట మండంలంలో రూ.1200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రూ.3 వేల కోట్లతో పంటల బీమా కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖలో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. రైతులు తప్పనిసరిగా తమ పంటలను ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.