గిరిపుత్రుల సంక్షేమానికి పెద్దపీట
9 Aug, 2023 12:46 IST
తాడేపల్లి: అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నా గిరిపుత్రులు మాత్రం అమ్మలా భావిస్తున్న అడవులపైనే ఆధారపడి జీవిస్తూ.. నిత్యం ప్రకృతిని కాపాడుతున్నారు. వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మన ప్రభుత్వంలో వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టాం. నాణ్యమైన విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పిస్తూనే లక్షల మంది గిరిజనులకు పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పించాం. గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చి, కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేశాం. నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు.