ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం దంపతులు
13 May, 2024 08:05 IST

పులివెందుల: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని భాకారాంపురంలోని జయమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు కుటుంబ సమేతంగా సీఎం వైయస్ జగన్ చేరుకున్నారు. 138వ బూత్‌లో వైయస్ జగన్, వైయస్ భారతీరెడ్డిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.