`ఎట్ హోమ్`కు హాజరైన సీఎం వైయస్ జగన్ దంపతులు
16 Aug, 2023 10:29 IST
విజయవాడ: రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్, శ్రీమతి వైయస్ భారతి దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు కొట్టు సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పలువురు ఉన్నతాధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.