`ఎట్ హోమ్`కు హాజరైన సీఎం వైయస్ జగన్ దంపతులు
26 Jan, 2023 19:20 IST
విజయవాడ: రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీమతి వైయస్ భారతి దంపతులు హాజరయ్యారు. అదే విధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు, ఇతర న్యాయమూర్తులు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, బాడ్మింటన్ స్టార్ పీ.వీ.సింధు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.