ముదిగుబ్బలో సీఎం వైయస్ జగన్‌కు జన నీరాజనం
1 Apr, 2024 15:49 IST
శ్రీసత్యసాయి జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముదిగుబ్బ చేరుకుంది. ముదిగుబ్బ చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ప్రజలు గజమాలతో స్వాగతం పలికారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా అభిమాన జనం బారులు తీరారు. ముదిగుబ్బ మెయిన్ రోడ్డులో ముఖ్యమంత్రి వైయస్ జగన్ బస్సుతో పాటు జనప్రవాహం కదిలింది. ముదిగుబ్బలో బస్సుపై నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సుమారు గంట పాటు ముదిగుబ్బలో జనంతోనే సీఎం వైయస్ జగన్ ఉన్నారు.